వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టి ఎ)చర్చలు ప్రారంభించిన భారత్, బ్రిటన్ (యు కె)
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి దోహదపడనున్న ప్రతిపాదిత
ఎఫ్ టిఎ
లెదర్, టెక్స్ టైల్, ఆభరణాలు , ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల వంటి కార్మిక విస్తృత ఆధారిత రంగాలలో భారతీయ ఎగుమతులకు భారీ ప్రోత్సాహం ఇవ్వనున్న ఎఫ్ టిఎ
యుకెతో ఎఫ్ టిఎ ద్వారా ఖచ్చితత్వం, అంచనా , పారదర్శకత, మరింత సరళతరం, సౌకర్యం, పోటీ సేవల వ్యవస్థ ఏర్పాటు: శ్రీ పీయూష్ గోయల్
మార్కెట్ ప్రవేశ సమస్యలను పరిష్కరించడం, వాణిజ్య ఆంక్షలను తొలగించడం ద్వారా సెక్టోరల్ సహకారాన్ని పెంచాలని శ్రీ పీయూష్ గోయల్ పిలుపు
ఎఫ్ టిఎ తో ఉపాధి కల్పనకు భారీ ఊతం
Posted On:
13 JAN 2022 2:42PM by PIB Hyderabad
వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ,ప్రజా పంపిణీ, టెక్స్టైల్ శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు న్యూఢిల్లీలో బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి అన్నే-మేరీ ట్రెవెల్యాన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను ప్రారంభించారు. 2021 మేలో ఇరు దేశాల
ప్రధాన మంత్రులు శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ బోరిస్ జాన్సన్ నిర్దేశించిన 2030 నాటికి భారత్- బ్రిటన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ఈ ఎఫ్ టిఎ సాధ్యం చేయగలదని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత దేశం , బ్రిటన్ రెండూ పంచుకున్న చరిత్ర , సుసంపన్నమైన సంస్కృతి పై నిర్మితమైన భాగస్వామ్యంతో కూడిన బలమైన ప్రజాస్వామ్య దేశాలని అన్నారు. యుకె లోని విభిన్న భారతీయ
ప్రవాసులు " సజీవ వారధి (లివింగ్ బ్రిడ్జ్) " గా వ్యవహరిస్తున్నారనీ, ఇది రెండు దేశాల
మధ్య సంబంధాలకు మరింత వైశిష్ట్యాన్ని డైనమిజాన్ని జోడించిందని ఆయన అన్నారు.
యుకె తో ఎఫ్ టి ఎ ఖచ్చితత్వం, అంచనా పారదర్శకతను అందిస్తుందని, మరింత ఉదారమైన, సౌకర్యవంతమైన , పోటీ సేవల వ్యవస్థను సృష్టిస్తుందని మంత్రి అన్నారు.
యుకెతో ఎఫ్ టి ఎ చర్చలు లెదర్, టెక్స్ టైల్, ఆభరణాలు , ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులలో భారత్ ఎగుమతులను భారీగా
పెంచగలవని ఆశిస్తున్నట్లు శ్రీ గోయల్ తెలిపారు. భారత దేశం లోని 56 మెరైన్ యూనిట్ల గుర్తింపు ద్వారా మెరైన్ ఉత్పత్తుల ఎగుమతిలో కూడా భారత దేశం భారీ వృద్ధిని నమోదు చేయనుందని కూడా ఆయన తెలిపారు.
ఫార్మాపై మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్స్ (ఎంఆర్ఏలు) అదనపు మార్కెట్ యాక్సెస్ ను అందించగలవని మంత్రి తెలిపారు. ఆయుష్ , ఆడియో విజువల్ సర్వీసులు సహా ఐటి/ఐటిఈఎస్, నర్సింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వంటి సర్వీస్ సెక్టార్ లలో ఎగుమతులను పెంచడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారత దేశం తన ప్రజల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లను కూడా కోరుతుందని మంత్రి తెలిపారు.
ఎఫ్ టిఎ ను ఆవిష్కరించిన తరువాత వాణిజ్య ఒప్పందం పరిధి, విస్తరణ పై రెండు దేశాలు పరస్పరం చురుకుగా, క్రమం తప్పకుండా చర్చలు జరుపు తాయని మంత్రి హామీ ఇచ్చారు. వస్తువులు , సేవలలో గణనీయమైన ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణంతో యుకె భారతదేశ ప్రధాన వాణిజ్య భాగస్వామి గా ఉందని చెబుతూ శ్రీ గోయల్, పర్యాటకం, టెక్, స్టార్టప్ లు, విద్య, వాతావరణ మార్పు మొదలైన రంగాలలో సహకారం విస్తరించిందని ఇంకా విస్తృత శ్రేణి రంగాలలో సమతుల్య రాయితీలు ,మార్కెట్ యాక్సెస్ ప్యాకేజీతో పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాలు ఎదురు చూస్తున్నాయని చెప్పారు
మార్కెట్ యాక్సెస్ సమస్యలను పరిష్కరించడం ,వాణిజ్య ఆంక్షలను తొలగించడం ద్వారా సెక్టోరల్ సహకారాన్ని పెంచాలని పిలుపునిచ్చిన శ్రీ గోయల్, ఇది రెండు దేశాలలో ప్రత్యక్ష ,పరోక్ష ఉపాధిని సృష్టించడానికి సహాయపడుతుందని అన్నారు.
విలువ గొలుసులను సమీకృతం చేయడంలో భారతదేశం-యుకె ఎఫ్ టిఎ కూడా దోహదపడుతుందని, సరఫరా గొలుసుల స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి పరస్పర ప్రయత్నాలను పెంచడానికి సహాయపడుతుందని మంత్రి అన్నారు. 2022 ప్రారంభంలో ఎఫ్ టిఎ సంప్రదింపులను ప్రారంభించాలని ఉభయ దేశాల నేతలు నిర్ణయించారని గుర్తు చేసిన శ్రీ గోయల్, ఈ రోజు ఎఫ్ టి ఎ సంప్రదింపులను ప్రారంభించ డాన్ని ప్ర క టించడానికి సకాలంలో చ ర్చ లు విజయవంతంగా ముగిసినందుకు త న సంతోషాన్ని వ్య క్తం చేశారు.
రెండు దేశాలలో వ్యాపారాలకు ప్రయోజనం చేకూర్చడానికి శీఘ్ర లాభాలను అందించడానికి మధ్యంతర ఒప్పందం అవకాశాన్ని ఎఫ్ టి ఎ చర్చల సమయంలో అన్వేషించడానికి కూడా అంగీకరించినట్లు మంత్రి తెలియజేశారు, రెండు దేశాలలో
చిన్న , మధ్య తరహా, సూక్ష్మ సంస్థలకు
ప్రయోజనం కల్పించడం కోసం సమగ్రమైన, సమతుల్య మైన, సక్రమమైన, సమానమైన ఎఫ్ టి ఎ ను అందించడం తమ ఉద్దేశమని పీయూష్ గోయేల్ చెప్పారు.
***
(Release ID: 1789847)
Visitor Counter : 280