కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువతకి పెట్టుబడులు, ఆర్థిక అంశాలపై జ్ఞాన్ దర్శన్ ఛానెల్‌ ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) తో అవగాహన కుదుర్చుకున్న ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపిఎఫ్ఎ)

Posted On: 12 JAN 2022 2:33PM by PIB Hyderabad

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) తో   కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న  ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపిఎఫ్ఎ) ఈ రోజు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జ్ఞాన్ దర్శన్ ఛానల్  టెలి-లెక్చరింగ్ సౌకర్యాన్ని ఉపయోగించడం ద్వారా పెట్టుబడిదారుల విద్యఅవగాహన మరియు రక్షణ అంశాలపై యువతకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయాలన్న లక్ష్యంతో రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో రెండు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. 

ఆర్థిక వ్యవహారాల రంగంలో పనిచేస్తున్న వారికి, భవిష్యత్తులో ఈ రంగంలో ప్రవేశించే వారికి పెట్టుబడులకు సంబంధించిన విద్యా కార్యక్రమాలను వారిలో అవగాహన పెంపొందించేందుకు  ఇగ్నో/జ్ఞాన్ దర్శన్ ఛానెల్‌ సంయుక్తంగా కార్యక్రమాలను ప్రసారం చేస్తాయి. ఐసీఏఐ , ఐసీఎస్ఐ లాంటి ప్రముఖ సంస్థలు, ఐఈపిఎఫ్ఎకార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులునిపుణుల ఉపన్యాసాలతో కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తారు. దేశంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని 75 ఎపిసోడ్‌లతో నిర్మించారు. 24x7 జ్ఞాన్ దర్శన్ టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష టెలి-లెక్చరింగ్ సిరీస్ లో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 

24x7 జ్ఞాన్ దర్శన్ టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష టెలి-లెక్చరింగ్ సిరీస్ లో ఈ కార్యక్రమానికి సంబంధించి 26   2021 సంవత్సరం లో ప్రసారం అయ్యాయి. సంబంధిత వర్గాల నుంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఇదివరకు ప్రసారం అయిన కార్యక్రమాలు  ఐఈపిఎఫ్ఎ అధికార యూ ట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉన్నాయి. 

అవహగానా ఒప్పందం కుదిరిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ వర్మ ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నదని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌, స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న యువజన ఉత్సవాలు నేపథ్యంలో ఈ రోజు కుదిరిన ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. విద్యాపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇగ్నో, ఐఈపిఎఫ్ఎ లు ప్రజలను విద్యావంతులను చేసి వారిని చైతన్యవంతులను చేస్తున్నాయని అన్నారు. ఆర్ధిక వ్యవహారాల అంశాలపై మరింత అవగాహన కల్పించేందుకు ఐఈపిఎఫ్ఎ సహకారం అందిస్తుందని అన్నారు. 

ఇగ్నో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐఈపిఎఫ్ఎతో సంస్థకు కుదిరిన అవగాహనతో రెండు సంస్థల లక్ష్యాలు నెరవేరుతాయని, యువతకి మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు. 

ఐఈపిఎఫ్ఎ సీఈఓ శ్రీ మనోజ్ పాండే, ఇగ్నో ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సత్యకం, ఐసిఎఐ అధ్యక్షుడు శ్రీ నిహార్ జంబుసరియా, ఐసీఎస్ఐ అధ్యక్షుడు శ్రీ నాగేంద్ర డి రావు, ఇగ్నో,ఐఈపిఎఫ్ఎ, ఐసీఎస్ఐ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 125 (3) కింద   ఐఈపిఎఫ్  ఫండ్ నిర్వహణ కోసం కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 125 ప్రకారం ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ ( ఐఈపిఎఫ్ఎ  ) స్థాపించబడింది. పెట్టుబడిదారుల విద్యను ప్రోత్సహించడంకంపెనీల చట్టం 2013లోని సెక్షన్‌లు 124 మరియు 125 ప్రకారం సరైన హక్కుదారులకు అవగాహనరక్షణక్లెయిమ్ చేయని షేర్లుడివిడెండ్‌లు మరియు దానికి బదిలీ చేయబడిన ఇతర మొత్తాలను వాపసు చేయడం లాంటి అంశాలపై ఐఈపిఎఫ్ఎ దృష్టి సారించి పనిచేస్తోంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  పరిపాలనా నియంత్రణ లో ఐఈపిఎఫ్ఎ పనిచేస్తుంది. 

***


(Release ID: 1789503) Visitor Counter : 146