శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నీటి శుద్ధి కోసం ఐఐటీ పూర్వ విద్యార్థులు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టిడిబి) మరియు ఐఐటీ పూర్వ విద్యార్థులచే స్థాపించబడిన టెక్ స్టార్టప్ కంపెనీ స్వజల్ వాటర్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

నైపుణ్యం మరియు టాలెంట్ పూల్ కలిగి సరిపడా వనరులు లేని చిన్న మరియు ఆచరణీయ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

స్వచ్ఛమైన తాగునీరు ఇంకా అందని దాదాపు 14 కోట్ల కుటుంబాలను కవర్ చేయడానికి సాంకేతిక పరిష్కారాలతో ముందుకు రావాలని ప్రైవేట్ రంగాన్ని మంత్రి కోరారు.

Posted On: 11 JAN 2022 5:25PM by PIB Hyderabad

కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్; ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు వినూత్న సాంకేతికత ద్వారా నీటి శుద్దీకరణ కోసం ఐఐటీ పూర్వ విద్యార్థులచే రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ప్రారంభించారు. ఈ సదుపాయం మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత స్టార్ట్-అప్ చొరవలు ఇతర స్టార్ట్-అప్‌లకు కూడా ప్రోత్సాహకరంగా ఉండాలన్నారు.

భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ యొక్క చట్టబద్ధమైన సంస్థ అయిన టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టిడిబి) మరియు గురుగ్రామ్‌లో ఉన్న మాజీ ఐఐటీయన్లు స్థాపించిన టెక్ స్టార్ట్ అప్ కంపెనీ ఎం/ఎస్ స్వజల్ వాటర్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కూడా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. మురికివాడలు, గ్రామాలు మరియు హై యుటిలిటీ ప్రాంతాల కోసం ఐఓటీ ఆధారిత పాయింట్ ఆఫ్ యూజ్ సోలార్ వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్‌పై వారి ప్రాజెక్ట్ కోసం, విశ్వసనీయమైన స్వచ్ఛమైన తాగునీటిని సరసమైన ధరకు కమ్యూనిటీలకు అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ వినూత్న సాంకేతికతలపై దృష్టి సారించింది.

స్వజల్‌కు టిడిబీ అందించిన ఆర్థిక సహాయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ స్వాగతించారు. నైపుణ్యం మరియు టాలెంట్ ఉన్నా కూడా  వనరులు లేని సంభావ్య చిన్న మరియు ఆచరణీయ స్టార్టప్‌లను చేరుకోవడానికి తన మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని చెప్పారు. 2024 నాటికి అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే భారతదేశ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఊహించిన విధంగా ఈ సాంకేతికతను స్కేల్ చేయడంలో సహాయపడాలని స్వజల్ సీఈఓ& సహ వ్యవస్థాపకులు డాక్టర్ విభాత్రిపాఠిని మంత్రి కోరారు.

జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం (ఎన్‌ఆర్‌డిడబ్లుపి) మరియు జల్ జీవన్ మిషన్ వంటి కేంద్రం కార్యక్రమాలతో పాటు, దాదాపు 14 కోట్ల గృహాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలతో ప్రైవేట్ రంగం పెద్ద ఎత్తున ముందుకు రావాలని మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి 75వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, జల్ జీవన్ మిషన్ ప్రారంభించిన రెండేళ్లలోనే నాలుగున్నర కోట్ల కుటుంబాలకు కుళాయిల ద్వారా నీరు అందడం ప్రారంభించిందని, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సానుకూలంగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజన్ మరియు మిషన్ "హర్ ఘర్ నల్ సే జల్" కు దోహదపడిందన్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో జోధ్‌పూర్‌లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి సిఎస్‌ఐఆర్‌-ఎన్‌జిఆర్‌ఐ హైదరాబాద్ అభివృద్ధి చేసిన భూగర్భ జలాల నిర్వహణ కోసం అత్యాధునిక హెలి-బోర్న్ సర్వే టెక్నాలజీని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారని గుర్తుచేసుకోవచ్చు.  రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు ఈ తాజా హెలి-బోర్న్ సర్వే కోసం తీసుకోబడుతున్నాయి.

గురుగ్రామ్ ఆధారిత కంపెనీ పేటెంట్ సిస్టమ్, 'క్లైర్‌వాయంట్' శుద్ధీకరణ వ్యవస్థలను ఆప్టిమైజ్ చేయడానికి మరియు భవిష్యత్తులో విచ్ఛిన్నాలను అంచనా వేయడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. అందువల్ల, ప్రతి సిస్టమ్‌ను నిజ సమయంలో రిమోట్‌గా నిర్వహించడానికి, నవీకరించడానికి మరియు మరమ్మతు చేయడానికి అనుమతిస్తుంది. వారు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి సౌరశక్తితో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతను మిళితం చేసే వాటర్ ఏటిడబ్లుఎంఎస్‌ రూపంలో స్వచ్ఛమైన తాగునీటి పరిష్కారాలను కూడా అభివృద్ధి చేశారు. స్వజల్ ద్వారా ఈ గ్రామీణ నీటి ఏటిఎం సౌరశక్తిని ఉపయోగించి నదులు, బావులు, చెరువులు లేదా భూగర్భజలాల నుండి నీటిని పంపు చేయడానికి ప్రతిపాదించబడింది. నీటిని ఆరోగ్యంగా మరియు స్వచ్ఛంగా తాగడానికి తగిన సాంకేతికతతో శుద్ధి చేస్తారు. ఈ ఆవిష్కరణతో, శుద్ధి చేసిన నీటి ధర లీటరుకు 25 పైసలకు తగ్గించబడుతుంది.

గ్రామాలు మరియు మారుమూల ప్రాంతాలలో స్వచ్ఛమైన తాగునీటి అవసరాన్ని తీర్చడానికి పునరుత్పాదక సౌరశక్తితో ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిపి కొత్త సాంకేతికతల సమ్మేళనం ఈ ప్రాజెక్ట్ అని డిఎస్‌టి కార్యదర్శి&టిడిబి చైర్‌పర్సన్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు.

" టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఆర్థిక సహకారంతో స్వజల్ వంటి సామాజిక ప్రభావ స్టార్టప్ అద్భుతాలు చేయగలదు. భారతదేశంలోని మరిన్ని రాష్ట్రాలను వీలైనంత త్వరగా కవర్ చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము" అని స్వజల్ సీఈఓ & కో ఫౌండర్ డాక్టర్ విభాత్రిపాఠి అన్నారు.

ఐపీ &టిఎఎఫ్‌ఎస్‌, సెక్రటరీ, టిడిబి శ్రీ రాజేష్ కేఆర్‌. పాఠక్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కమ్యూనిటీ యాజమాన్యంతో వారి తాగునీటి అవసరాలను ప్లాన్ చేయడానికి మరియు పర్యవేక్షించడానికి కమ్యూనిటీలకు అధికారం ఇస్తుందని మరియు సంవత్సరంలో 365 రోజుల పాటు రోజులో  24 గంటలు అందుబాటులో, విశ్వసనీయమైన మరియు స్వచ్ఛమైన త్రాగునీటిని పొందుతుందని చెప్పారు. పెద్దసంఖ్యలో ప్రజలు ఉపయోగించుకునే ఇటువంటి వినూత్న సాంకేతికతలకు మద్దతు ఇవ్వడానికి టిడిబి కట్టుబడి ఉందన్నారు.


 

*****



(Release ID: 1789295) Visitor Counter : 203