వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వ్యవసాయ మార్కెట్ల యాక్సెస్‌తో భారత, అమెరికా వాణిజ్యానికి కొత్త ఉద్దీపన
- భారతీయ మామిడి & దానిమ్మ వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో ప్రవేశించేందుకు అనుమతి
- వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ (డీఏసీ&ఎఫ్‌డబ్ల్యు) మరియు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్‌డీఏ) "2 Vs 2" అగ్రి మార్కెట్ యాక్సెస్ సమస్యల పరిష్కార ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం
प्रविष्टि तिथि:
08 JAN 2022 2:30PM by PIB Hyderabad
2021 నవంబర్ 23న జరిగిన 12వ భారతదేశం- అమెరికా టీపీఎఫ్ సమావేశానికి అనుగుణంగా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ (డీఏసీ&ఎఫ్‌డబ్ల్యు) మరియు అమెరికా వ్యవసాయ శాఖ (యుఎస్‌డీఏ) 2 వర్సెస్ 2 అగ్రి మార్కెట్ యాక్సెస్ సమస్యలను అంటే తనిఖీ అమలుకు ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేశాయి. భారత మామిడి & దానిమ్మ పంట ఉత్పత్తుల పర్యవేక్షణ బదిలీ మరియు భారతదేశం నుండి దానిమ్మ అరిల్స్ కోసం మార్కెట్ యాక్సెస్ మరియు అమెరికా చెర్రీస్ మరియు అమెరికా అల్ఫాల్ఫా ఎండుగడ్డి కోసం మార్కెట్ యాక్సెస్ పొందేలా ఈ ఒప్పందం వెసులుబాటు కల్పించనుంది. మామిడి, దానిమ్మ ఎగుమతులు జనవరి - ఫిబ్రవరి 2022 నుండి దానిమ్మ ఆరిల్ ఎగుమతులు ఏప్రిల్ 2022 నుండి ప్రారంభమవుతాయి. అమెరికా నుండి అల్ఫాల్ఫా ఎండుగడ్డి, చెర్రీస్ ఎగుమతులు ఏప్రిల్ 2022లో ప్రారంభమవుతాయి. అదనంగా, మంత్రివర్గ చర్చల ఆధారంగా, పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ (డీఏహెచ్‌డీ) కూడా అమెరికా పంది మాంసం కోసం మార్కెట్ యాక్సెస్‌ను అందించడానికి తన సంసిద్ధతను తెలియజేసింది. దానిని ఖరారు చేయడానికి తుది శానిటరీ సర్టిఫికేట్ యొక్క సంతకం కాపీని భాగస్వామ్యం చేయమని అమెరికా పక్షం అభ్యర్థించింది.
***
(रिलीज़ आईडी: 1788679)
आगंतुक पटल : 290