సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

హైదరాబాద్ లో విజయవంతంగా ముగిసిన 'ఈ-పరిపాలన పై ఏర్పాటైన 24 వ జాతీయ సదస్సు సుదీర్ఘ చర్చల తరువాత 'హైదరాబాద్' డిక్లరేషన్ కు ఆమోదండిజిటల్ వేదిక ఆధారంగా ప్రజలు, ప్రభుత్వం మధ్య మరింత సన్నిహితం చేయనున్న పరిపాలనా సంస్కరణలు

సచివాలయ సంస్కరణలు, స్వచ్ఛత ప్రచారం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సేవలను మరింత సమర్థంగా అందించే అంశాలకు మరింత ప్రాధాన్యత

ఈ కార్యాలయాలు, సీపీగ్రామ్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం

అభిప్రాయాలను పంచుకున్న అవార్డు గ్రహీతలు, యునికార్న్ లు

Posted On: 08 JAN 2022 4:39PM by PIB Hyderabad

 

 

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర పరిపాలనా సంస్కరణల శాఖ, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ-పరిపాలనపై రెండు రోజుల పాటు నిర్వహించిన రెండు రోజుల 24వ జాతీయ సాస్ విజయవంతంగా ముగిసింది. 2022 ఫిబ్రవరి 7,8 తేదీల్లో సదస్సు జరిగింది. ' మహమ్మారి తర్వాత నెలకొన్న పరిస్థితిలో డిజిటల్ పరిపాలన :భారతదేశంలో పరిస్థితి' అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ రోజు జరిగిన సదస్సు ముగింపు సమావేశంలో 'హైదరాబాద్ డిక్లరేషన్' ను ఆమోదించారు. రెండు రోజుల విస్తృత చర్చల తరువాత సదస్సు ;హైదరాబాద్ డిక్లరేషన్' ను ఏకగ్రీవంగా ఆమోదించింది. సదస్సు ఆమోదించిన 'హైదరాబాద్ డిక్లరేషన్' ను అనుబంధం -I లో చూడవచ్చు.

 

సదస్సును కేంద్ర శాస్త్ర సాంకేతిక ( సహాయ), భూగర్భ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు, అణు శాస్త్రం, అంతరిక్ష మంత్రిత్వ ( స్వతంత్ర) శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ప్రారంభ సమావేశం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు,పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి శ్రీ కె.టి. రామారావు అధ్యక్షతన జరిగింది.

 

ఈ-పరిపాలనను మరింత సమర్థంగా అమలు చేయాల్సిన ఆధునిక తాజా సాంకేతిక అంశాలను సమగ్రంగా ఈ-పరిపాలనపై జరిగిన 24 వ జాతీయ సదస్సులో నిపుణులు చర్చించారు. సదస్సులో ప్రసంగించిన నిపుణులు సదస్సు ఇతివృతంపై తమ అనుభవాలను, అభిప్రాయాలను వివరంగా వెల్లడించడం జరిగింది.ఈ-పరిపాలనను అమలు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై సదస్సులో పాల్గొన్న వివిధ రాష్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు స్పష్టమైన అవగాహన పొందారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని అమలు చేసేందుకు అవకాశం కలుగుతుంది.

 

రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో ఆరు అంశాలపై విడివిడిగా చర్చలు జరిగాయి, ఆత్మ నిర్భర్ భారత్, ప్రభుత్వ సేవలను ప్రజలందరికి అందుబాటులోకి తేవడం, సుపరిపాలకు సాంకేతికతను జోడించి ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ప్రభుత్వ విధానాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం, భారత దేశ టెకాడే- డిజిటల్ ఆర్థిక వ్యవస్థ (డిజిటల్ చెల్లింపులు-ప్రజల విశ్వాసం)పై నిపుణులు చర్చలు జరిపారు. దీనికి సమాంతరంగా జరిగిన సమావేశాల్లో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఈ-పరిపాలన అంశంలో అవార్డులు సాధించిన వ్యక్తులు తమ అనుభవాలు, అవార్డు సాధించిన తమ పనులను వివరించారు.

 

యునికార్న్స్ 2021, ఆవిష్కరణల శక్తి, డిజిటల్ వ్యవస్థలో జిల్లా స్థాయి ప్రతిభ, సులభతర పరిపాలన, వినూత్న పర్యావరణ వ్యవస్థ, భౌతిక ప్రమేయం లేకుండా సాంకేతికత సహకారంతో సేవలను అందించడం,ఈ పరిపాలన ఉత్తమ విధానాలపై చర్చలు జరిగాయి. ఈ-పరిపాలనలో భారతదేశం సాధించిన విజయాలు, ప్రగతిపై ప్రత్యేక ప్రదర్శనను సదస్సు సందర్భంగా ఏర్పాటు చేశారు.

వివిధ అంశాలపై 50 మందికి పైగా నిపుణులు పత్రాలను సమర్పించారు. సదస్సుకు 2000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

 

ఈ-పరిపాలన సాగుతున్న తీరుకు గుర్తింపుగా ప్రారంభ సమావేశంలో జాతీయ ఇ-గవర్నెన్స్ అవార్డు 2021నలను అందించారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు/శాఖలు, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు, జిల్లాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు విద్య, పరిశోధనా సంస్థలకు 6 కేటగిరీల కింద 26 అవార్డులు అందించబడ్డాయి. ఇందులో 12 స్వర్ణాలు, 13 రజతాలు మరియు 1 జ్యూరీ అవార్డులు ఉన్నాయి. ఆరు విభాగాలలో అవార్డు గెలుచుకున్న ప్రాజెక్ట్‌లు మరియు విజేతల పూర్తి జాబితా అనుబంధం-IIలో పొందుపరచబడింది.

 

సీనియర్ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రముఖులు మరియు పరిశోధకులు సహా ప్రతినిధులకు ఉత్తమ విధానాలు , తాజా సాంకేతిక పరిణామాలు పంచుకోవడానికి సదస్సు ఒక వేదికను అందించింది. సమర్థవంతమైన పాలన మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సదస్సు స్ఫూర్తి కలిగించింది. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు అమలు చేయాల్సిన ఈ-పరిపాలన సాధనాలను పంచుకోవడం, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్న కనీస ప్రభుత్వం, గరిష్ట పాలనసాధన అంశాలకు సదస్సు ప్రాధాన్యత ఇచ్చి దీనికి అవసరమైన వ్యూహ రచనపై దృష్టి సారించి సాగింది.

 

' మహమ్మారి తర్వాత నెలకొన్న పరిస్థితిలో డిజిటల్ పరిపాలన :భారతదేశంలో పరిస్థితి'

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర పరిపాలనా సంస్కరణల శాఖ, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ-పరిపాలనపై రెండు రోజుల పాటు 2022 జనవరి 7-8 తేదీల్లో 24వ జాతీయ సదస్సును నిర్వహించడం జరిగింది.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశంలో ఈ-పరిపాలన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ-పరిపాలన పరిధి పెరిగింది. ఈ-పరిపాలన విధానాలు, అమలు విధానాలలో సమగ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్వతంత్ర భారతావని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా ప్రజలు, ప్రభుత్వం మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేలా చూసేందుకు రేపటి తరం పరిపాలనా సంస్కరణలు అమలు కావాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. ఈ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సదస్సును నిర్వహించడం జరిగింది. భారత సుపరిపాలన నమూనాలో ప్రధానమైన సచివాలయ సంస్కరణలు, స్వచ్ఛత ప్రచారం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం మరియు సేవలు అందించడం అంశాలను సదస్సులో ప్రధానంగా చర్చించడం జరిగింది. మహమ్మారి సమయంలో విస్తృతంగా అనుసరించిన ఈ-కార్యాలయం విధానం వల్ల కేంద్ర సచివాలయంలో కాగితాలతో సంబంధం లేకుండా పరిపాలన సాగించేందుకు అవకాశం కలిగింది. ప్రభుత్వ పాలన సజావుగా సాగింది.

2021లో ప్రజల నుంచి అందిన 20 లక్షల ఫిర్యాదులు సీపీగ్రామ్స్ ద్వారా పరిష్కారం అయ్యాయి. జాతీయ ఈ-పరిపాలన అవార్డులను సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రధానం చేయడం జరిగింది. అవార్డు గ్రహీతలు, యునికార్న్స్ అభిప్రాయాలను పంచుకున్నారు.

హైదరాబాద్ డిక్లరేషన్ ను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో వివిధ అంశాలను సమగ్రంగా,లోతుగా చర్చించి ఆమోదించిన హైదరాబాద్ డిక్లరేషన్ ను అనుబంధం- II లో పొందుపరచడం జరిగింది.

భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కింది అంశాల అమలుకు సహకరించాలని సమావేశం తీర్మానించింది:

 

1. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలు, ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడం

2. ఆధార్, యూపీఐ డిజి లాకర్, ఉమాంగ్ ,, ఇ సైన్ మరియు సమ్మతి ఫ్రేమ్‌వర్క్‌తో కూడిన అంశాలను ఉపయోగించడం ద్వారా సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పౌర సేవల రంగంలో మార్పులు తీసుకురావడం

3. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం మొదలైన కీలక సామాజిక రంగాల్లో జాతీయ స్థాయిప్రజా డిజిటల్ వేదికలను వేగంగా అమలు చేయడానికి చర్యలు అమలు చేయడం. అనుసంధానం చేసిన సేవలను మరింత సమర్థంగా అమలు చేయడం

4. ప్రభుత్వ సంస్థలలోసమాచార భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి డేటా గవర్నెన్స్ వ్యవస్థను అమలు చేయడం. అలాగే ప్రతికూల జాబితా మినహా data.gov.inలో మొత్తం సమాచారాన్ని అందుబాటులో ఉంచండం. సమాచార ఆధారిత వ్యవస్థ నిర్మించడంలో సహాయపడే సమాచార సేకరణ, సమాచార గోప్యత, సమాచార వివరాలు తొలగించడం,, సమాచార భద్రత మరియు సమాచార సంరక్షణ కోసం విధి విధానాలను రూపొందించడం.

5. సామాజిక సాధికారత కోసం కృత్రిమ మేధస్సు , మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, 5G, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ మొదలైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం

6. భవిష్యత్ సాంకేతిక అంశాలపై నైపుణ్యం కలిగిన వనరులను పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయడం ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా రూపొందించడం

7. వంటి మహమ్మారి వంటి వంటి తట్టుకోవడానికి వీలుగా బలమైన సాంకేతిక పరిష్కారాలతో దృఢమైన ప్రభుత్వ మౌలిక వ్యవస్థను రూపొందించడం .

 

8. కొనసాగుతున్న ప్రభుత్వ సేవల్లో పరిశోధన మరియు అభివృద్ధి, ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ స్ఫూర్తిని పెంపొందించడం

9. ప్రామాణిక సేవల ద్వారా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించి సుపరిపాలనను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లడం.

 

10. ఇ-పరిపాలన పరిధిని పెంచేందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ 2021ని అమలు చేయాలి.

11. ప్రజా ఫిర్యాదులను సజావుగా పరిష్కారం కోసం సీపీగ్రామ్స్ తో అన్ని రాష్ట్ర/జిల్లా పోర్టల్‌ల ఏకీకరణ

 

12. ఈ-పరిపాలనలో 2020 21 లో జాతీయ అవార్డులు పొందిన, నామినేట్ అయిన ప్రాజెక్ట్‌లను ప్రాంతీయ సమావేశాల ద్వారా ఉత్తమ విధానాలను అనుసరించడం

13. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఈ -ఆఫీస్ వెర్షన్ 7.0ని వినియోగించడం

14. మానవ ప్రమేయం లేకుండా ప్రజలకు సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అమలు చేయడం

15. 'డిజిటల్' విధానాన్ని అన్ని ప్రభుత్వ సేవల రూపకల్పన, అమలులో ప్రాథమిక అంశంగా చేయడం

 (Release ID: 1788582) Visitor Counter : 290