వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్టార్టప్ ఇండియా ఇన్నొవేషన్ వీక్ ను నిర్వహించనున్న వాణిజ్య, అంతర్గత ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి)
భారతదేశ వ్యాప్తంగా పాదుకొని ఉన్న వ్యవస్తాపకతను, వ్యాప్తిని ప్రదర్శించనున్న ఇన్నొవేషన్ వీక్
భాగస్వాములు నమోదు ప్రక్రియ ప్రారంభం
Posted On:
07 JAN 2022 11:50AM by PIB Hyderabad
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమ & అంతర్గత వాణిజ్యను ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) జనవరి 10 నుంచి 16, 2022వరకు స్టార్టప్ ఇండియా ఇన్నొవేషన్ వీక్ (ఆవిష్కరణ వారోత్సవాలను) నిర్వహించనుంది. భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్మారకార్థం వారంరోజుల పాటు సాగే ఈ వర్చువల్ ఇన్నొవేషన్ (దృశ్యమాధ్యమం ద్వారా ఆవిష్కరణలు) వేడుకలను జరుపుకోవాలనే లక్ష్యంతో నిర్వహించడమే కాక, భారతదేశ వ్యాప్తంగా పాదుకొని ఉన్న వ్యవస్తాపకతను, వ్యాప్తిని ప్రదర్శించేందుకు రూపొందించారు.
స్టార్టప్ ఇండియా ఇన్నొవేషన్ వీక్ లో మార్కెట్ సౌలభ్యతను పెంచడం, పరిశ్రామిక నాయకులతో చర్చలు, రాష్ట్రాల ఉత్తమ పద్ధతులు, ఎనేబ్లర్ల సామర్ధ్య నిర్మాణం, ఇంక్యుబేటర్ల ద్వారా రివర్స్ పిచింగ్ ( స్టార్టప్‌లకు మార్కెట్ అందుబాటుపై ఇన్‌క్యుబేటర్లు దృష్టి పెట్టడం), సాంకేతికత ప్రదర్శనలు, కార్పొరేట్ అనుసంధానతలు, తదితరాల విషయాంశాలపై సెషన్లు సాగుతాయి.
ఈ కార్యక్రమం అగ్ర విధాన నిర్ణేతలు, పరిశ్రమ, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, స్టార్టప్‌లు, ప్రపంచం నలుమూలల నుంచి పాల్గొనే అందరు ఇకోసిస్టం ఎనేబ్లర్లను ఒక చోటు చేర్చగలదని భావిస్తున్నారు. ఈ వర్గాలకు చెందిన భాగస్వాములందరూ ఈ ఇన్నొవేషన్ వీక్‌లో పాలుపంచుకునేందుకు https://www.startupindiainnovationweek.in/ పోర్టల్‌పై నమోదు చేసుకోవలసిందిగా కోరడమైంది. అదనపు వివరాల కోసం, శ్రీ గౌతమ్ ఆనంద్ (మొబైల్ః 9205041872, ఇమెయిల్ః gautam.anand@investindia.org.in) ను సంప్రదించవచ్చు.
***
(Release ID: 1788313)
Visitor Counter : 243