సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఈ గవర్నెన్స్ పై జాతీయ సదస్పును ప్రారంభించనున్న శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశపు టెకేడ్: కోవిడ్ మహమ్మారి అనంతర ప్రపంచంలో డిజిటల్ గవర్నెన్స్ అనేది సదస్సు థీమ్
Posted On:
06 JAN 2022 3:45PM by PIB Hyderabad
భారత ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎఆర్ పిజి), తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ-గవర్నెన్స్ (ఎన్ సిఇజి) 2020-21 పై 24వ సదస్సును హైదరాబాద్‌లో జనవరి 7-8 తేదీలలో నిర్వహిస్తుంది.
ఇండియా టెకేడ్: కొవిడ్ మహమ్మారి అనంతర ప్రపంచంలో డిజిటల్ పాలన అనేది ఈ సదస్సు థీమ్ గా ఉంది. ఈ సదస్సును, ముఖ్య అతిధి, గౌరవనీయ శాస్త్ర సాంకేతిక , భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జి), ప్రధాన మంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల, పెన్షన్లు, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి, డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభిస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ కె. తారక రామారావు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.
ఈ గవర్నెన్సు 2021 కి సంబంధించి జాతీయ అవార్డులను ప్రకటిస్తారు. వీటిని కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలోని ఈ గవర్నెన్సు కార్యక్రమాలు, విద్యా సంస్థలు, పరిశోధనల సంస్థలు పబ్టిక్ సెక్టర్ అండర్ టేకింగ్ లకు సంబంధించి 6 కేటగిరీలలో 26 ఈ గవర్నెన్స్ లు కార్యకలాపాల కింద ఈ అవార్డులు అందజేస్తారు. వీటిలో 12 స్వర్ణ పతకాలు, 13 రజత పతకాలు, 1 జ్యూరీ అవార్డు ఉన్నాయి. డిజిటల్ ఇన్నొవేషన్ కార్యక్రమం పరిపాలనకు సంబంధించి రాగల దశాబ్దంలో కీలకపాత్ర పోషించనుంది. అందువల్ల భవిష్యత్‌లో డిజిటల్ పాలనకు ఊతం ఇచ్చే సాంకేతికత, అంశాలపై సంభాషణ అవసరమవుతుంది. ఈ సదస్సు ఈ సాంకేతికతలకు సంబంధించి చర్చించేందుకు ఒక వేదిక కానుంది. ఇందుకు ఆయా రంగాలలోని ప్రముఖులను ఆహ్వానించి వారి విజ్ఞానాన్ని, వారి ఆలోచనలను ఈ అంశాలపై పంచుకునేట్టు చేయడం జరుగుతుంది. ఈ సదస్సు ప్లీనరీ సెషన్ లో ఆరు సబ్ థీమ్ లపై చర్చ జరుగుతుంది.
1. ఆత్మనిర్భర భారత్: ప్రజాసేవల సార్వత్రీకరణ
2. ఆవిష్కరణ: ప్లాట్ ఫార్మైజేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీలు
3. స్వర్ణ పతక విజేతల ప్రజెంటేషన్లు (కేంద్ర, రాష్ట్ర)
4. సుపరిపాలనకు సాంకేతిక చొరవ ద్వారా సులభతర జీవనం
5. గవర్నమెంట్ ప్రాసెస్ రీ ఇంజినీరింగ్, ప్రభుత్వ ప్రక్రియలలో పౌరులు పాల్గొనేట్టు చూడడం
6. ఇండియా టెకేడ్- డిజిటల్ ఆర్థిక వ్యవస్థ (డిజిటల్ చెల్లింపులు-పౌరులలో విశ్వాసం పాదుకొల్పడం)
ఈ అంశాలపై బ్రేకవుట్ సెషన్‌లు కూడా ఉంటాయి. 2021 యూనికార్న్ లు: ఆవిష్కరణల శక్తి ప్రదర్శన, జిల్లా స్థాయిలో డిజిటల్ ఎక్సలెన్స్, సీమ్‌లెస్, మానవ జోక్యం లేకుండా సాంకేతికత సహాయంతో ఎండ్ టు ఎండ్ సేవలు, ఈ-గవర్నెన్స్ నిరంతరాయంగా కొనసాగేట్టు చూడడం వంటి ఉత్తమ విధానాలు ఇందులో ఉన్నాయి. తెలంగాణా ప్రభుత్వం క్రియేటింగ్ ఎ టెక్నాలజీ ఇన్నొవేషన్ ఎకో సిస్టమ్ అనే అంశంపై ఒక బ్రేక్ అవుట్ సెషన్‌ను నిర్వహిస్తోంది. 2020-21 సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి లో ఈ గవర్నెన్సు అవార్డులు పొందినవారు ఈ రెండు సెషన్ లలో తమకు అవార్డు లభించేలా చేసిన కార్యకలాపాలు, చొరవపై ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఇ-గవర్నెన్స్ కార్యకలాపాలను మరింత ముందుకు వేగంగా తీసుకువెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే సివిల్ సర్వెంట్లు, పరిశ్రమ వర్గాలు, ఈ గవర్నెన్సుకు సంబంధించి ఎండ్ టు ఎండ్ సర్వీస్ డెలివరీ ని మెరుగు పరిచేందుకు వారు విజయవంతంగా చేపట్టిన చర్యలు తెలియ జేస్తున్నారు. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, ఐటి పరిశ్రమ వర్గాలు ఈ సదస్సులో వర్చువల్ విధానంలో పాల్గొననున్నారు. ఈ జాతీయ సదస్సుకు వ్యక్తిగతంగా హాజరవుతున్నవారు అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ ను పాటిస్తారు. ఈ సదస్సు సందర్బంగా ఈ గవర్నెన్సులో భారత దేశం సాధించిన విజయాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
దీనితోపాటు వాల్ ఆఫ్ ఫేమ్ , ఫోటో ఎగ్జిబిషన్‌ను గత ఏడాది అవార్డు విజేతల పై ఏర్పాటు చేయనున్నారు.
భారత ప్రభుత్వం నుంచి పాల్గొంటున్న కార్యదర్శులలో పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ ప్రకాష్ సాహ్ని, తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్‌లు కూడా ఈ సదస్సులో ప్రసంగిస్తారు. పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ ఎన్.బి.ఎస్ రాజ్‌పుత్ వందన సమర్పణ చేస్తారు.
***
(Release ID: 1788114)
Visitor Counter : 198