విద్యుత్తు మంత్రిత్వ శాఖ

డిసెంబ‌ర్ నెల‌వ‌ర‌కు రూ. 40395.34 కోట్ల మూల‌ధ‌న వ్య‌యాన్ని వెచ్చించిన విద్యుత్ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని సిపిఎస్ఇలు


ఆర్థిక సంవ‌త్స‌రం 2020-21లో కాపెక్స్ వ్య‌యంతో పోలిస్తే ఇది 47% అధికం

ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22 కాపెక్స్ ల‌క్ష్యంలో స‌మిష్టిగా 80% సాధించిన సిపిఎస్ఇలు

Posted On: 06 JAN 2022 10:06AM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని సిపిఎస్ఇలు ఆర్థిక సంవ‌త్స‌రం 2021-2022లో డిసెంబ‌ర్ నెల వ‌ర‌కు రూ. 40395 కోట్ల మూల‌ద‌న వ్య‌యం (కాపెక్స్‌)ను వెచ్చించాయి.  ఆర్థిక సంవ‌త్స‌రం 2020-21లో ఇదే స‌మ‌యంలతో పోలిస్తే పొందిన వ్య‌యం 48% ఎక్కువ‌గా ఉంది. 
గ‌త ఏడాదితో పోలిస్తే  మంత్రిత్వ శాఖ కాపెక్స్ ప‌నితీరు చెప్పుకోద‌గిన స్థాయిలో మెరుగ్గా ఉంది. 
సిపిఎస్ఇలు అన్నీ స‌మిష్టిగా ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22 రూ. 50,690.52 కోట్ల‌ను, అంటే కాపెక్స్ ల‌క్ష్యంలో 80%ను చేరుకున్నాయ‌న్న‌ విష‌యం గ‌మ‌నార్హం. 
విద్యుత్ రంగ సిపిఎస్ఇల‌లో అత్యుత్త‌మ ప‌ని తీరు క‌లిగిన వాటిలో ప‌వ‌ర్ గ్రిడ్ (90.6%), ఎస్‌జెవిఎన్  (90.19%) ఎన్‌టిపిసి (86.5%), టిహెచ్‌డిసి (85.38%) ఉన్నాయి. 
విద్యుత్ రంగ ప్రాజెక్టుల మూలధ‌న వ్య‌యాల‌ను వేగ‌వంతం చేయ‌డంపై విద్యుత్ మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ప్రాజెక్టుల అమ‌లును అడ్డుకుంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు నిత్య ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌మీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. 

***
 



(Release ID: 1787991) Visitor Counter : 108