ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19: అపోహాలూ వాస్తవాలూ


ఈసీ ఆర్పీ - II కింద కేంద్రం 26.14% నిధులు మాత్రమే విడుదల చేసిందన్న మీడియా వార్తలలో వాస్తవం లేదు
రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన నిధుల్లో కేంద్రం 50% విడుదల చేసింది

నిధుల విడుదల 2021 ఆగస్టు 24 న జరిగింది తప్ప వార్తలో పేర్కొన్నట్టు 2021 నవంబర్ కాదు

Posted On: 04 JAN 2022 6:29PM by PIB Hyderabad

ఈసీ ఆర్పీ - II కింద కేంద్రం 26.14% నిధులు మాత్రమే విడుదల చేసిందంటూ ఒక న్యూస్ చానల్ ఈ మధ్యనే ఒక వార్త ప్రసారం చేసింది. పైగా, కేంద్రం  ఆ నిధులను 2021 నవంబర్ నాటికి విడుదల చేసినట్టు, ఆమోదించిన నిధులలో 60% మేరకు రాష్ట్రాలు ఖర్చు చేసుకున్నట్టు కూడా అందులో చెప్పారు. ఈ వార్త సమాచార లోపంతో ప్రసారమైన తప్పుడు వార్త, తప్పుదారి పట్టించే వార్త.

భారత కోవిడ్ -19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్యవ్యవస్థ సంసిద్ధత పాకేజ్ – రెండో దశ (ఈసీ ఆర్పీ - II) ను కాబినెట్ 2021 జులై 8 న రూ. 23,123 కోట్లకు ఆమోదించింది. ఇందులో కేంద్ర వాటా రూ.15,000 కోట్లు,  రాష్ట్రాల వాటా రూ. 8,123 కోట్లు. దీన్ని 2021 జూలై  1 నుంచి 2022 మార్చి 31 వరకు అమలు చేయాల్సి ఉంది. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం.  

కోవిడ్-19 వలన ఎదురయ్యే ముప్పును నివారించటానికి, కనుక్కోవటానికి, దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితికి ప్రతిస్పందించటానికి వీలుగా జాతీయ ఆరోగ్య వ్యవస్థను  బలోపేతం చేయటానికి ఈ పథకాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.  ఈ పథకం కింద  రాష్ట్రాలు మొత్తం రూ. 20,308.70 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా అందులో రూ. 12,185.70 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు రూ.8,123 కోట్లు భరించాలి.  

ఈ పథకం ఆమోదం పొందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంది. కేంద్ర వాటాలో 15% మొత్తాన్ని 2021 జులై 22 న రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదలకేసింది. తద్వారా అవి వేగంగా  ఈసీ ఆర్పీ - II ప్రాథమిక కార్యకలాపాలు చేపట్టటానికి వెసులుబాటు కల్పించింది.  ఆ తరువాత కొద్ది కాలానికే ఆగస్టు నెలలో రెండో వాయిదా నిధులు విడుదలచేసింది. కేంద్ర వాటాలో 50శాతం అయిన రూ.. 6075.85 కోట్లను అప్పటికే జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) ద్వారా 2021 ఆగస్టు 24 నాటికి విడుదలచేసింది. రాష్ట్రాల వారీగా కేంద్ర వాటా విడుదల, ఖర్చు వివరాలను ఈ రోజువరకు ఈ క్రింది అనుబంధం -1 లో  చూడవచ్చు. ఇప్పటివరకూ 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఖర్చు రూ.  1,679.05 కోట్లు.  

ఆ న్యూస్ చానల్ వార్తలో అనేక తప్పులు దొర్లాయి.

  1. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన నిధులలో కేంద్రం 50% నిధులు విడుదల చేసింది తప్ప ఆ వార్తలో పేర్కొన్నట్టుగా 26.14% కాదు.
  2. నిధులన్నీ 2021 ఆగస్టు 24 లోగా విడుదలయ్యాయి తప్ప ఆ వార్తలో చెపపినట్టుగా 2021 నవంబర్ లో కాదు
  3. కేంద్రం అందించిన రూ. 6075.85 కోట్లలో రూ. 1679.05, కోట్లు (అంటే, 27.13%) మొత్తాన్ని రాష్ట్రాలు 2021 డిసెంబర్ 31 వరకు ఖర్చు చేశారే తప్ప ఆ వార్తలో పేర్కొన్నట్టుగా 60% కాదు.   

ఇప్పటికే విడుదల చేసిన నిధులలో కనీసమ్ 50% ఖర్చు చేయటంలో చూపే పురోగతి ఆధారంగా మిగిలిన నిధుల విడుదల జరుగుతుంది. ఇప్పటిదాకా ఐదు రాష్ట్రాలు 50% మించి ఖర్చు చేసినట్టు తెలియజేశాయి. త్వరగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం కోరుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి, రాష్ట్రాల ఆరోగ్యశాఖామంత్రులతోనూ,  కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతోనూ మూడు విడతాలు సమావేశాలు జరిపారు.  పురోగతిని, వ్యయాన్ని రోజువారీ ప్రాతిపదికన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తోంది.

 

 

 

 

అనుబంధం  I

ఈసీ ఆర్పీ - II ఆర్థిక పురోగతి (మూలం : ఎన్ హెచ్ ఎం –పి ఎం ఎస్ పోర్టల్) (2022 జనవరి 3 నాటికి )

సంఖ్య

రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం

ఆమోదించిన మొత్తం కోట్లలో

రాష్ట్రాల దగ్గర ఉన్న నిధులు కోట్లలో

ఖర్చు కోట్లలో

ఖర్చు %

 రాష్ట్ర వాటా విడుదల అవును/కాదు

1

2

3

4

5

6=5/4

8

1

అండమాన్, నికోబార్ దీవులు

14.23

7.11

0.00

0.00%

 సమాచారం లేదు

2

ఆంధ్ర ప్రదేశ్

662.09

348.26

66.88

19.20%

 అవును

3

అరుణాచల్ ప్రదేశ్

118.50

70.97

1.16

1.64%

 అవును

4

అస్సాం

657.03

387.48

1.47

0.38%

 అవును

5

బీహార్

1,368.70

860.72

160.62

18.66%

అవును

6

చండీగఢ్

5.68

2.84

0.79

27.77%

 సమాచారం లేదు

7

ఛత్తీస్ గఢ్

626.60

188.03

25.65

13.64%

 సమాచారం లేదు

8

దాద్రా నాగర్ హవేలి డామన్ డయ్యూ

9.38

4.76

0.82

17.17%

 సమాచారం లేదు

9

ఢిల్లీ

50.34

25.17

34.92

138.74%

అవును

10

గోవా

17.51

9.82

0.03

0.35%

అవును

11

గుజరాత్

661.99

323.98

78.94

24.37%

 అవును

12

హర్యానా

272.71

152.02

91.41

60.13%

అవును

13

హిమాచల్ ప్రదేశ్

203.87

120.29

11.95

9.94%

 అవును

14

జమ్ము కశ్మీర్

211.04

128.82

3.14

2.44%

 సమాచారం లేదు

15

జార్ఖండ్

569.81

319.45

0.00

0.00%

 అవును

16

కర్ణాటక

831.80

420.03

2.57

0.61%

 అవును

17

కేరళ

267.35

144.90

30.20

20.84%

 అవును

18

లద్దాఖ్ 

34.51

31.26

2.32

7.41%

 సమాచారం లేదు

19

లక్షదీవులు

1.50

0.50

0.00

0.00%

 సమాచారం లేదు

20

మధ్యప్రదేశ్

1,447.51

728.62

192.39

26.40%

అవును

21

మహారాష్ట్ర

1,294.69

683.98

2.22

0.32%

అవును

22

మణిపూర్

78.07

38.67

3.00

7.76%

సమాచారం లేదు

23

మేఘాలయ

79.65

42.37

1.42

3.34%

అవును

24

మిజోరం

44.30

1.66

0.00

0.00%

 సమాచారం లేదు

25

నాగాలాండ్

62.46

28.11

0.00

0.00%

 సమాచారం లేదు

26

ఒడిశా

807.33

430.98

55.09

12.78%

 అవును

27

పుదుచ్చేరి

7.18

4.52

0.84

18.52%

 అవును

28

పంజాబ్

330.94

165.73

144.93

87.45%

 అవును

29

రాజస్థాన్

1,472.28

708.33

34.00

4.80%

 అవును

30

సిక్కిం

18.80

9.98

0.00

0.00%

 అవును

31

తమిళనాడు

798.94

399.66

325.58

81.46%

 అవును

32

తెలంగాణ

456.08

229.34

42.83

18.68%

అవును

33

త్రిపుర

87.33

46.51

0.60

1.29%

అవును

34

ఉత్తరప్రదేశ్

2,690.07

939.94

87.05

9.26%

సమాచారం లేదు

35

ఉత్తరాఖండ్

254.78

135.86

8.54

6.28%

 అవును

36

పశ్చిమ  బెంగాల్

983.97

503.82

267.69

53.13%

 అవును

 

మొత్తం

17,499.00

8,644.49

1,679.05

19.42%

 

 

****



(Release ID: 1787547) Visitor Counter : 131