హోం మంత్రిత్వ శాఖ
భద్రతా సవాళ్ళపై ఉన్నతస్థాయి సమావేశం
Posted On:
03 JAN 2022 8:04PM by PIB Hyderabad
దేశంలో కొనసాగుతున్న ముప్పు పరిస్థితులు, ఉద్భవిస్తున్న భద్రతా సవాళ్ళను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించారు.
తీవ్రవాదం, అంతర్జాతీయ తీవ్రవాద గ్రూపులు, తీవ్రవాదులకు ఆర్థిక సహాయం, నార్కో టెర్రరిజం (చట్టవ్యతిరేకంగా మాదకద్రవ్యాల వ్యాపారంలో నిమగ్నమైన తీవ్రవాదం), వ్యవస్థీకృత నేరాలు- తీవ్రవాదుల సంబంధం, సైబర్ స్పేస్‌ను అక్రమ ఉపయోగం, విదేశీ తీవ్రవాదుల కదలికలతో ఏర్పడిన నిరంతర ముప్పును పట్టిచూపుతూ, కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల మధ్య మెరుగైన సహకారం, సమన్వయ అవసరాన్ని హోం మంత్రి నొక్కి చెప్పారు.
దేశంలోని భద్రతా ఏజెన్సీలు, ముఖ్యంగా కేంద్ర నిఘా సంస్థలు, సిఎపిఎఫ్‌లు, సాయుధ దళాల నిఘా విభాగాలు, రెవిన్యూ, ఆర్థిక నిఘా సంస్థల అధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల డిజిపిలు కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల మధ్య మెరుగైన సహకారం, సమన్వయాలతో, నిరంతరం పరివర్తన చెందుతున్న సిటి, భద్రతా సవాళ్ళను ఎదుర్కోవలసిన అవసరాన్ని హోం మంత్రి నొక్కి చెప్పారు
***
(Release ID: 1787271)
Visitor Counter : 217