గనుల మంత్రిత్వ శాఖ
కీలక, వ్యూహాత్మక ఖనిజ అవసరాలలో స్వావలంబన సాధించేందుకు కృష్టి
మూల దేశాలుగా ఉండనున్న ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బొలీవియా, చిలీ
Posted On:
03 JAN 2022 3:13PM by PIB Hyderabad
దేశ ఖనిజ భద్రత హామీకి, కీలకమైన, ఖనిజ రంగంలో స్వావలంబనను సాధించేందుకు గనుల మంత్రిత్వ శాఖ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (ఎన్ఎఎల్‌సిఒ), హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సిఎల్), మినరల్ ఎక్సప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఇసిఎల్) భాగస్వామ్యంతో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కెఎబిఎల్) అన్న పేరుతో జాయింట్ వెంచర్ కంపెనీని సృష్టించింది. లిథియం, కోబాల్ట్ తదితర కీలకమైన, వ్యూహాత్మక స్వభావం కలిగిన విదేశీ ఖనిజ ఆస్తులను గుర్తించడం, కొనుగోలు చేయడం కెఎబిఎల్ విధి. ఆత్మనిర్భర్ భారత్ మరింత పుంజుకునులే చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం కీలకమైన ఇ- మొబిలిటీ, పునరావృత ఇంధనం, వైద్యం, ఎయిరోస్పేస్, విమానయాన తదితర రంగాల అవసరాలను తీర్చనుంది.
నియమిత అధ్యయనం, ఎంపిక ప్రమాణాల ఆధారంగా, విదేశాలలో ఖనిజ ఆస్తుల సేకరణ అవకాశాలను అన్వేషించడానికి ఎంపిక చేసిన మూలదేశాలను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు కెఎబిఎల్ కీలక, వ్యూహాత్మక ఖనిజాలు కలిగిన ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బొలీవియా, చిలీ వంఇ మూల దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. భావి ఖనిజ విస్తీర్ణానికి సంబంధించి తగిన శ్రద్ధ, పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడానికి ప్రాథమికంగా ప్రభుత్వ యాజమాన్య సంస్థలతో సమాచారాన్ని పంచుకోవడానికి ఆ దేశాల్లో సంబంధిత రాయబార కార్యాలయాలు, భారతీయ సంస్థలు ప్రాథమిక అనుసంధానకర్తలుగా ఉన్నాయి.
***
(Release ID: 1787261)
Visitor Counter : 188