ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19: వాస్తవాలు vs అపోహలు


టీకా లక్ష్యాలను సాధించడంలో విఫలం అయ్యిందని వచ్చిన వార్తలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి

ప్రపంచంలో సాగుతున్న టీకా కార్యక్రమంలో భారతదేశ టీకా కార్యక్రమం అతిపెద్ద విజయవంతమైన కార్యక్రమం

Posted On: 02 JAN 2022 3:26PM by PIB Hyderabad

టీకా కార్యక్రమ లక్ష్యాలు సాధించడంలో భారతదేశం విఫలమయ్యిందంటూ ఇటీవల ఒక ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఓకే వార్తను ప్రచురించింది. ఈ వార్త వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ వార్తను ప్రచురించడం జరిగింది. కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇది అత్యంత విజయవంతమైన కార్యక్రమంగా గుర్తింపు పొందింది. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశం అమలు చేస్తున్న టీకా కార్యక్రమం అత్యంత విజయవంతంగా సాగుతోంది. జనాభా పరంగా పోల్చి చూసినా పాశ్చాత్య దేశాల జనాభా తక్కువగా ఉంది. 

భారతదేశంలో 2021 జనవరి 16న జాతీయ కోవిడ్ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఇంతవరకు అర్హులైన వారిలో 90% మంది ప్రజలకు  మొదటి డోసు, 65% మందికి రెండో డోసును వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశం అనేక మైలురాళ్లను దాటింది. తొమ్మిది నెలల అతి తక్కువ కాలంలో 100 కోట్ల డోసులను వేయడం జరిగింది. ఒకేరోజున 2.51 కోట్ల డోసులను వేసిన ఘనతను భారత్ సాధించింది. అనేక సందర్భాల్లో రోజుకు 1 కోటి డోస్‌లను అందించడం వంటి రికార్డులను భారత్ సాధించింది. 

ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో  అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 93.7 కోట్ల (ఆర్జీఐ ప్రకారం) అర్హత గల వయోజన ప్రజలకు కోవిడ్ టీకా వేసే కార్యక్రమంలో  మెరుగైన పని చేసింది.

అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో అమలు జరిగిన టీకా కార్యక్రమం వివరాలు:

దేశం

మొదటి   డోస్

రెండో డోస్ 

అమెరికా 

73.2%

61.5%

యూకే 

75.9%

69.5%

ఫ్రాన్స్

78.3%

73.2%

స్పెయిన్

84.7%

81%

భారతదేశం

90%

65%

అర్హత గల ప్రజలకు మొదటి డోస్ వేసిన అంశాన్ని పరిశీలిస్తే అమెరికాలో 73.2%యూకే లో 75.9% ఫ్రాన్స్ లో 78.3% స్పెయిన్ లో 84.7% మంది ప్రజలకు మాత్రమే మొదటి డోస్ వేయడం జరిగింది. కోవిడ్ -19 టీకా కార్యక్రమంలో ఇప్పటికే 90% మంది అర్హులకు మొదటి డోస్ వేయడం జరిగింది. 

అదేవిధంగారెండవ డోస్ రెండవ డోస్ వేసే అంశంలో కూడా ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ ముందంజలో ఉంది. అమెరికా  జనాభాలో 61.5% మాత్రమే రెండవ డోస్ తీసుకున్నారు. ,యూకే లో 69.5%, ఫ్రాన్స్ లో 73.2%  స్పెయిన్ లో 81% మంది ప్రజలకు రెండో డోస్ వేయండి జరిగింది. భారతదేశంలో  65% మంది అర్హత గల ప్రజలు  2  డోస్ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

ఇంతేకాకుండా, భారతదేశంలో 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు  అర్హత గల వారికి 100% మొదటి డోస్ వేసాయి. మూడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు  100% మందికి పూర్తి టీకా (1 , 2  డోసులు  రెండూ) వేసాయి. 

అర్హులైన ప్రజలందరికి టీకాలు వేయాలన్న లక్ష్యంతో 2021 నవంబర్ 3న కేంద్రం హర్ ఘర్ దస్తక్ పేరిట జాతీయ కోవిడ్-19 టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల్లో అవగాహన కల్పించిటీకాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంతో ప్రజల్లో అవగాహన పెరిగి టీకాలు తీకుసుంటున్న సంఖ్య పెరుగుతోంది. కార్యక్రమం ప్రారంభించిన తరువాత మొదటి డోస్ తీసుకున్న వారి సంఖ్య 11.6%రెండవ డోస్ తీసుకున్న వారి సంఖ్య 28.9% మేరకు పెరిగింది. 

ప్రపంచవ్యాప్త కోవిడ్-19 కేసుల పెరుగుదల, ఓమిక్రాన్ వేరియంట్‌ని గుర్తించి దానిని ' వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా గుర్తించడంతో కోవిడ్ -19 వర్కింగ్ గ్రూప్, “నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్, “స్టాండింగ్ టెక్నికల్ సైంటిఫిక్ కమిటీ" సలహాలు /సూచనలు మేరకు దేశంలో 15-18 మధ్య వయస్సు గల వారికి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో 2022 జనవరి 3 నుంచి ప్రారంభించడం జరుగుతుంది. 

కోవిడ్ -19కి వ్యతిరేకంగా భారతదేశ పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తూ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2021లో రెండు అదనపు వ్యాక్సిన్‌లకు ఆమోదం తెలిపాయి. వీటిలో బయోలాజికల్-అభివృద్ధి చేసిన  CORBEVAX వ్యాక్సిన్ మరియుఎస్ఐఐ అభివృద్ధి చేసిన  COVOVAX వ్యాక్సిన్ లకు  పరిమితం చేయబడిన ఉపయోగం కోసం ఆమోదం లభించింది.  దీంతో భారతదేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన   వ్యాక్సిన్‌ల సంఖ్య 8కి చేరుకుంది. 

 ***



(Release ID: 1787004) Visitor Counter : 310