ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆదాయ‌ప‌న్ను శాఖ కొత్త ఈ ఫైలింగ్ పోర్ట‌ల్‌లో 2021 డిసెంబ‌ర్ 31 నాటికి 5.89 కోట్ల ఆదాయ‌ప‌న్ను రిటర్నులు దాఖ‌లు

Posted On: 01 JAN 2022 2:40PM by PIB Hyderabad

ఆదాయ‌ప‌న్ను శాఖ‌కు చెందిన కొత్త ఈ ఫైలింగ్ పోర్ట‌ల్ లో  ఆదాయ‌ప‌న్ను రిట‌ర్ను దాఖ‌లు కు సంబంధించి,  పొడిగించిన  గ‌డువు తేదీ అయిన 2021 డిసెంబ‌ర్ 31 నాటికి సుమారు 5.89 కోట్ల ఆదాయ‌ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌ల‌య్యాయి. 31-12-2021 తేదీన 46.11 ల‌క్ష‌ల‌కుపైగా ఆదాయ‌ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌ల‌య్యాయి. ప‌న్ను చెల్లింపుదారులు సుల‌భంగా పోర్ట‌ల్ ద్వారా ఐటిఆర్ లు దాఖ‌లు చేసేందుకు వీలుగా , ప‌న్ను చెల్లింపుదారులు చేసిన 16,850 టెలిఫోన్ కాల్స్‌కు స‌మాధానాలు ఇవ్వ‌డం జ‌రిగింది. అలాగే 1467 చాట్ ల‌కు హెల్ప్ డెస్క్ స్పందించ‌డం జ‌రిగింది. దీనికి తోడు, డిపార్ట‌మెంట్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌న్ను చెల్లింపుదారులకు , ప్రొఫెష‌న‌ల్స్‌కు అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా అందుబాటులో ఉంటున్న‌ది. డిసెంబ‌ర్ 31 , 2021 న ఒక్క‌రోజే ప‌న్ను చెల్లింపుదారులు, ప్రొఫెష‌నల్స్ నుంచి వ‌చ్చి న 230 ట్వీట్ల‌కు స్పందించ‌డం జ‌రిగింది.
2021-22 ఆదాయ‌ప‌న్ను సంవ‌త్స‌రానికి 31 డిసెంబ‌ర్ నాటికి దాఖ‌లైన 5.89 కోట్ల ఆదాయ‌ప‌న్ను రిట‌ర్నుల‌లో 49.6 శాతం ఐటిఆర్ 1 (2.92 కోట్లు) , 9.3 శాతం ఐటిఆర్ 2 (54.8 ల‌క్ష‌లు), 12.1 శాతం ఐటిఆర్ 3 (71.05 ల‌క్ష‌లు), 27.2 శాతంఐటిఆర్ -4 (1.60 కోట్లు), 1.3 శాతం ఐటిఆర్ 5 ( 7.66 ల‌క్ష‌లు), ఐటిఆర్ 6 (2.58 ల‌క్ష‌లు), ఐటిఆర్ 7 (0.67 ల‌క్ష‌లు) గా ఉన్నాయి. ఈ ఐటిఆర్ ల‌లో 45.7 శాతం పైగా ఐటిఆర్ లు ఆన్ లైన్ ఐటిఆర్ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకుని  పోర్ట‌ల్ లోదాఖ‌లైన‌వి. మిగిలిన‌వి ఆఫ్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా అప్ లోడ్ చేసిన‌వి.

 2021 జ‌న‌వ‌రి 10 ( ఆదాయ‌ప‌న్ను సంవ‌త్స‌రం 2020-21కి పొడిగించిన గ‌డువు)తో పోల్చి చూసిన‌పుడు, మొత్తం దాఖ‌లైన ఐటిఆర్ లు 5.95 కోట్లు. 2021 జ‌న‌వ‌రి 10 న  చివ‌రి రోజు దాఖ‌లైన ఐటిఆర్ లు 31.05 ల‌క్ష‌లు కాగా ఈ సంవ‌త్స‌రం గ‌డువు చివ‌రి రోజు దాఖ‌లైన ఐటిఆర్ లు 46.11 ల‌క్ష‌లు.
 
ఆదాయ‌ప‌న్ను చెల్లింపు రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డంలో ప‌న్ను చెల్లింపు దారులు, టాక్స్ ప్రొఫెష‌న‌ల్స్‌, ఇత‌రుల‌ పాత్ర‌ను ఆదాయ‌ప‌న్ను శాఖ అభినందించింది. వారంద‌రి కృషితో ఇది సాధ్య‌మైంద‌ని తెలిపింది. అంద‌రూ సుల‌భ‌మైన ప‌న్ను చెల్లింపు అనుభ‌వాన్ని పొందేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేయ‌నున్న‌ట్టు ఆదాయ‌ప‌న్ను శాఖ పున‌రుద్ఘాటించింది..

***


(Release ID: 1786801) Visitor Counter : 212