కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టిసిఐఎస్ 2020-21లో ఆదాయం మరియు పన్ను తర్వాత మొత్తం వరుసగా రూ.17492.90 మిలియన్లు మరియు రూ.527.70 మిలియన్ల లాభాలను సాధించింది.
టెలికాం విభాగానికి రూ. 211.10 మిలియన్లు డివిడెండ్ చెల్లిస్తోంది.
Posted On:
31 DEC 2021 12:01PM by PIB Hyderabad
టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టిసిఐఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ కుమార్ రూ. 211.10 మిలియన్ల డివిడెండ్ చెక్కును టెలికమ్యూనికేషన్స్ విభాగం చైర్మన్ డిసిసి & సెక్రటరీ శ్రీ కె. రాజారామన్‌కు అందించారు.

టిసిఐఎల్ ప్రారంభం నుండి నిరంతరం లాభాలను ఆర్జించే కంపెనీగా ఉంది. టిసిఐఎల్ 2020-21 వరకు ప్రభుత్వానికి రూ.2678.60 మిలియన్లు చెల్లించింది. ఈక్విటీలో ప్రభుత్వ ప్రారంభ పెట్టుబడి రూ. 3 మిలియన్లు. 2015-16లో రూ.160 మిలియన్లు మరింతగా చేరాయి. కంపెనీ యొక్క గ్రూప్ మరియు స్వతంత్ర నెట్‌వర్త్ 31 మార్చి, 2021 నాటికి వరుసగా రూ.9595.1 మిలియన్ మరియు రూ.6111 మిలియన్లు.
2020-21లో టిసిఐఎల్ స్వతంత్ర రాబడి మరియు పన్ను తర్వాత లాభం వరుసగా రూ.17492.90 మిలియన్ మరియు రూ.527.70 మిలియన్లను సాధించింది.
ఆగష్టు, 1978లో టిసిఐఎల్ స్థాపించబడింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద పనిచేసే మినీ రత్న కేటగిరీ - I స్టేటస్ కంపెనీ. భారత ప్రభుత్వం తన వాటా మూలధనంలో 100% కలిగి ఉంది. టిసిఐఎల్ ఒక ప్రధాన ఇంజనీరింగ్ మరియు కన్సల్టెన్సీ కంపెనీ. టిసిఐఎల్ భారతదేశంతో పాటు విదేశాలలో అన్నిరకాల టెలికమ్యూనికేషన్స్, ఐటీ మరియు పౌర నిర్మాణ రంగాలలో ప్రాజెక్ట్‌లను చేపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో టిసిఐఎల్ ప్రాజెక్ట్‌లను అమలు చేసింది.
కంపెనీ యొక్క ఓవర్సీస్ కార్యకలాపాలు కువైట్, సౌదీ అరేబియా, ఒమన్, మారిషస్, నేపాల్ మొదలైన వాటితో పాటు పాన్ ఆఫ్రికా ఈ-విద్యా భారతి &ఆరోగ్య భారతి నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌తో పాటు 15 కంటే ఎక్కువ ఆఫ్రికన్ దేశాలు మరియు మరిన్ని ఆఫ్రికన్ దేశాలు చేరే అవకాశం ఉంది.
కంపెనీ అధిక విలువ కలిగిన ప్రభుత్వ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, డిఫెన్స్, నేవీ ఓఎఫ్‌సి ప్రాజెక్ట్‌లు, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్, తెలంగాణ ఫైబర్, బిబిఎన్‌ఎల్ విశాట్ మరియు ఎక్‌లవ్యస్కూల్ కోసం గ్రామీణ ఐసిటీ వంటిభారతదేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లను చేపడుతోంది.
***
(Release ID: 1786700)
Visitor Counter : 239