ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మెస్స‌ర్స్‌ ఓడోకెమ్ ఇండస్ట్రీస్ కేసు విషయంలో బహుళ ఊహాజనిత మీడియా నివేదికలను తిరస్కరించిన డీజీజీఐ

Posted On: 30 DEC 2021 2:30PM by PIB Hyderabad

మెస్స‌ర్స్‌ ఓడోకెమ్ ఇండస్ట్రీస్, కన్నౌజ్- పెర్ఫ్యూమరీ సమ్మేళనాల తయారీదారు - మరియు దాని యజమాని శ్రీ పీయూష్ జైన్ విషయ‌మై  'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్' (డీజీజీఐ) ద్వారా కొనసాగుతున్న విచార‌ణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ప్రాంతాల నుంచి మొత్తం రూ.197.49 కోట్ల మేర న‌గ‌దు, 23 కిలోల బంగారం, అధిక విలువ‌ వస్తువులు రికవరీ చేయబడ్డాయ‌ని.. డీజీజీఐ రికవరీ చేసిన నగదును తయారీ యూనిట్ టర్నోవర్‌గా పరిగణించాలని నిర్ణయించాల‌ని, ప్రతిపాదిస్తున్నట్లు మీడియాలో  నివేదిక‌లు  వచ్చాయి. శ్రీ పీయూష్ జైన్ తన ప‌న్ను ఎగ‌వేత‌ను అంగీకరించిన తర్వాత, డీజీజీఐ ఆమోదంతో మొత్తం రూ.52 కోట్ల మొత్తంను పన్ను బకాయిలుగా జమ చేసినట్లు కూడా కొన్ని త‌ర‌హా మీడియాలలో వ‌చ్చిన రిపోర్టులు తెలిపాయి. ఈ విధంగా శ్రీ పీయూష్ జైన్ నిక్షేపణ శాఖ అంగీకరించినట్లు మరియు తదనుగుణంగా పన్ను బాధ్యతను ఖరారు చేసినట్లుగా రిపోర్ట్‌ రూపొందించబడింది. మీడియాలో వ‌చ్చిన ఈ త‌రహా నివేదికలు నిరాధార‌మైన  పూర్తిగా ఊహాజనితమైనవి మరియు ఈ త‌ర‌హా రిపోర్టులు విచార‌ణ పార్టీకి వ్యతిరేకంగా నిర్దిష్ట నిఘా ఆధారంగా అత్యంత వృత్తిపరమైన పద్ధతిలో జరుగుతున్న దర్యాప్తుల సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయ‌ని విచార‌ణ వ‌ర్గాలు తెలిపాయి. ఇది ఇలా ఉండ‌గా..  ఈ కేసులో తదుప‌రి విచార‌ణ కొన‌సాగుతున్నందున‌ మెస్స‌ర్స్  పీయూష్ జైన్ నివాసం, ఫ్యాక్టరీ ప్రాంగణంలో ల‌భించిన న‌గ‌దును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సేఫ్ కస్టడీలో కేసు ఆస్తిగా ఉంచబడిందని విచార‌ణ అధికారుల ద్వారా స్పష్టం చేయబడింది. మెస్స‌ర్స్‌ ఓడోకెమ్ ఇండస్ట్రీస్ పన్ను బాధ్యతలను విడుదల చేయడానికి స్వాధీనం చేసుకున్న డబ్బు నుండి పన్ను బకాయిలను డిపాజిట్ చేయలేదు మరియు వారి పన్ను బాధ్యతలు ఇంకా నిర్ణయించబడలేదు. దీనికి తోడు  శ్రీ పీయూష్ జైన్ వెలువ‌రించిన స్వచ్ఛంద సమర్పణలు, కొనసాగుతున్న పరిశోధనలకు సంబంధించిన అంశం, డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకున్న నగదు యెక్క‌ మూలం మరియు మెస్స‌ర్స్  ఓడోకెమ్ ఇండస్ట్రీస్ లేదా దర్యాప్తులో పాల్గొన్న ఇతర పార్టీల యొక్క క‌చ్చితమైన పన్ను బాధ్యతలపై త‌గిన స్ప‌ష్ట‌త లేదు. సోదాల సమయంలో వివిధ ప్రాంగణాల నుండి సేకరించిన సాక్ష్యాధారాల మదింపు మరియు తదుపరి పరిశోధనల ఫలితాల ఆధారంగా.విచార‌ణ ప్ర‌క‌రా ఏదైనా చ‌ర్య‌ తీసుకోబడుతుంది. నేరాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడం మరియు రికార్డులో అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా శ్రీ పీయూష్ జైన్‌ సీజీఎస్‌టీ చట్టంలోని సెక్షన్ 132 కింద సూచించిన నేరాల కింద 26.12.2021న అరెస్టు చేయబడ్డారు,  27.12.2021న సంబంధిత‌ కోర్టు ముందు హాజరుపరిచారు. గౌరవ న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది.

***


(Release ID: 1786547) Visitor Counter : 181