ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
30 DEC 2021 4:54PM by PIB Hyderabad
కేంద్ర బడ్జెట్ 2022-23 కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (శాసనసభ కలిగిన) ఆర్థిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశానికి గురువారం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, మంత్రులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (శాసనసభ కలిగిన), కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సంప్రదింపుల సమావేశానికి హాజరైన వారికి స్వాగతం పలుకుతూ, ఈ సమావేశ ప్రాముఖ్యతను కేంద్ర ఆర్థిక కార్యదర్శి వివరించారు. మహమ్మారి విజృంభించిన నెలల్లోరాష్ట్రాలకు మళ్ళీ మళ్ళీ రుణాలను అందిస్తూ, మూల ధన వ్యయానికి ప్రత్యేక తోడ్పాటును అందించి, రుణపరిమితులను పెంచడం ద్వారా తమ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక తోడ్పాటును అందించినందుకు అనేకమంది సమావేశంలో పాలుపంచుకున్న అనేకులు కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ ఉపన్యాసంలో జోడించేందుకు కేంద్ర ఆర్థికమంత్రికి భాగస్వాములు అనేక సూచనలు చేశారు. కేంద్ర బడ్జెట్ 2022-23 కోసం విలువైన సూచనలు, ఇన్‌పుట్లు ఇచ్చినందుకు పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతి ఒక్క ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు.
***
(Release ID: 1786435)
Visitor Counter : 164