రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు, డిపిఎస్‌యుల ద్వారా దిగుమతులను తగ్గించేందుకు ఉప-వ్యవస్థలు/ కూర్పులు లేదా నిర్మాణాలు/ పరికరాల సానుకూల స్వదేశీకరణకు జాబితాను నోటిఫై చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ
Posted On:
29 DEC 2021 1:11PM by PIB Hyderabad
రక్షణ ఉత్పత్తి రంగంలో స్వావలంబన సాధించి, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల (డిపిఎస్‌యులు) దిగుమతులను కనిష్టం చేయడం కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఉప-వ్యవస్థలు/ కూర్పులు లేదా నిర్మాణాలు/ పరికరాల సానుకూల స్వదేశీకరణ జాబితాను రక్షణ ఉత్పత్తి విభాగం జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇప్పటికే దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న 2,500 దిగుమతి చేసుకున్న వస్తువులు, 351 దిగుమతి చేసుకునే వస్తువులు ఉన్నాయి. వీటిని రానున్న మూడేళ్ళలో దేశీయంగా తయారు చేయనున్నాయి. ఈ ఆత్మనిర్భర్ భారత్ చొరవ ప్రతి ఏడాది దాదాపు రూ. 3,000 కోట్లకు సమానమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయనుంది. ఈ వస్తువులకు సంబంధించిన వివరాలు శ్రీజన్ పోర్టల్ ((https://srijandefence.gov.in/DPSU%20Indigenization%20List.pdf) అన్న లింక్‌లో అందుబాటులో ఉన్నాయి. జాబితాలో సూచించిన కాలక్రమానంతరం వీటిని భారతీయ పరిశ్రమల నుంచి సేకరించనున్నారు.
ఆత్మనిర్భర్ అభియాన్ చొరవలో భాగంగా రక్షణ తయారీలో స్వావలంబనకు ఊతమిచ్చేందుకు సైనిక వ్యవహారాల శాఖ ఆయుధాలు/ వేదికలు/ వ్యవస్థలు/ యుద్ధ సామాగ్రి తదితరాలకు సంబంధించిన సానుకూల స్వదేశీకరణ జాబితాలను ఇప్పటికే నోటిఫై చేయడం జరిగింది.
***
(Release ID: 1786180)
Visitor Counter : 215