ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

143.15 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 64 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

98.40 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 9,195 కొత్త కేసులు నమోదు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 77,002

వారపు పాజిటివిటీ రేటు ( 0.68 శాతం ) గత 45 రోజులుగా 1 శాతం కంటే తక్కువ

Posted On: 29 DEC 2021 9:50AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 64,61,321 డోసులతో కలిపి, 143.15 కోట్ల డోసులను ( 1,43,15,35,641 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,52,69,126 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,87,197

రెండో డోసు

96,94,283

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,85,217

రెండో డోసు

1,68,62,710

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

49,64,04,904

రెండో డోసు

32,31,01,947

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,38,12,980

రెండో డోసు

14,80,52,758

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,09,96,702

రెండో డోసు

9,38,36,943

మొత్తం

1,43,15,35,641

 

గత 24 గంటల్లో 7,347 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,42,51,292 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.40 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 62వ రోజు కూడా 15,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 9,195 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 77,002. పాజిటివ్ కేసుల శాతం (0.22) కూడా 2020 మార్చి నుంచి కనిష్ట స్థాయి.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,67,612 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 67.52 కోట్లకు పైగా ( 67,52,46,143 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.68 శాతంగా ఉంది. గత 45 రోజులుగా 1 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.79 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 86 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా, 121 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****


(Release ID: 1786005) Visitor Counter : 191