హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (ఎంఓసీ) బ్యాంకు ఖాతాలను ఎంహెచ్ఏ స్తంభింపజేయలేదు


- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాలను స్తంభింపజేయాలని మిషనరీస్ ఆఫ్ ఛారిటీయే స్వయంగా ఎస్‌బీఐకి అభ్యర్థన పంపినట్లు సమాచార

- ప్రతికూల ఇన్‌పుట్‌ల కారణంగా ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం ఎఫ్‌సీఆర్ఏ కింద పునరుద్ధరణ దరఖాస్తు తిరస్కర‌ణ‌

- పునరుద్ధరణ తిరస్కరణను సమీక్షించడానికి మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నుండి ఎటువంటి అభ్యర్థన / పునర్విమర్శ దరఖాస్తు స్వీకరించబడలేదు

Posted On: 27 DEC 2021 6:07PM by PIB Hyderabad

దేశంలోని ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) కింద‌ మిషనరీస్ ఆఫ్ ఛారిటీల‌ (ఎంఓసీ)  ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ ద‌ర‌ఖాస్తు తిరస్కరించబడింది. ఎఫ్‌సీఆర్ఏ 2010 మరియు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రూల్స్(ఎఫ్‌సీఆర్ఆర్‌) 2011 ప్రకారం త‌గిన అర్హత షరతులను పాటించనందుకు గాను 25 డిసెంబర్ 2021న స‌ద‌రు ద‌ర‌ఖాస్తు తిరస్కరించబడింది.  ఈ పునరుద్ధరణ తిరస్కరణను సమీక్షించడానికి సంబంధించి మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (ఎంఓసీ) నుండి ఎటువంటి అభ్యర్థన / పునర్విమర్శ దరఖాస్తు ల‌భించ‌లేదు.  మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (ఎంఓసీ) రిజిస్ట్రేషన్ నంబర్ 147120001 ద్వారా ఎఫ్‌సీఆర్ఏ
కింద‌ నమోదు చేయబడింది. ఈ  రిజిస్ట్రేషన్ 31 అక్టోబర్ 2021 వరకు చెల్లుబాటులో ఉంది.  పునరుద్ధరణకు గాను  దరఖాస్తుల‌ పునరుద్ధరణ పెండింగ్‌లో ఉన్న ఇతర ఎఫ్‌సీఆర్ఏ అసోసియేషన్‌లతో పాటుగా చెల్లుబాటు అవుతుంది. వీటి  రిజిస్ట్రేషన్ 31 డిసెంబర్ 2021 వరకు పొడిగించబడింది. అయినప్పటికీ ఎంఓసీ యొక్క పునరుద్ధరణ దరఖాస్తును పరిశీల‌న స‌మ‌యంలో, కొన్ని ప్రతికూల ఇన్‌పుట్‌లు గమనించబడ్డాయి. రికార్డులో ఉన్న ఈ ఇన్‌పుట్‌ల పరిశీలనలో MoC యొక్క పునరుద్ధరణ దరఖాస్తు ఆమోదించబడలేదు. ఎంఓసీ యొక్క ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ 31 డిసెంబర్ 2021 వరకు చెల్లుబాటు అవుతుంది. షనరీస్ ఆఫ్ ఛారిటీకి (ఎంఓసీ) సంబంధించిన ఎలాంటి బ్యాంకు ఖాతాలను ఎంహెచ్ఏ స్తంభింపజేయలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాలను స్తంభింపజేయాలని ఎంఓసీయే ఎస్‌బీఐకి స్వయంగా త‌న అభ్యర్థన పంపినట్లు సమాచారం.

***


(Release ID: 1785691) Visitor Counter : 267