మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పిఎం-యువ మెంటర్‌షిప్‌ పథకం కింద ఎంపికైన 75 మంది రచయితలను ప్రకటించిన నేషనల్ బుక్ ట్రస్ట్‌

Posted On: 25 DEC 2021 6:14PM by PIB Hyderabad

విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా పిఎం-యువ మెంటర్‌షిప్ పథకం కింద ‘నేషనల్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై నిర్వహించిన అఖిల-భారత పోటీ ఫలితాలను ఈరోజు ప్రకటించింది. ఈ  పథకంలో భాగంగా 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న యువ రచయితల కోసం స్కాలర్‌షిప్-కమ్-మెంటర్‌షిప్ స్కీమ్ కోసం ఈ పోటీ ద్వారా 75 మంది రచయితలను ఎంపిక చేయాలి.

మైగవ్‌ మరియు నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వేదికల ద్వారా 1 జూన్ నుండి 31 జూలై 2021 వరకూ అఖిల భారత పోటీ నిర్వహించబడింది. 22 అధికారిక భాషలు మరియు ఇంగ్లీషులో దాదాపు 16000 ఎంట్రీలు భారతీయ డయాస్పోరా కమ్యూనిటీ నుండి కొన్ని సహా దేశవ్యాప్తంగా అందాయి. అన్ని పుస్తక ప్రతిపాదనలు నిపుణులతో కూడిన బహుళ ప్యానెల్‌లచే చదవబడ్డాయి మరియు మూడు దశల్లో పరిశీలన జరిగాయి.

31 జనవరి 2021 నాటి తన మన్ కీ బాత్ ప్రసంగంలో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవచ్చు: “మన యువ స్నేహితులు ఆయా ప్రాంతాలకు చెందిన మన స్వాతంత్ర్య సమరయోధులు, వారితో సంబంధం ఉన్న సంఘటనలు మరియు స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన పరాక్రమాల గురించి వ్రాయమని పిలుపును ఇస్తున్నాను" ఈ నేపథ్యంలో అనంతరం యువ రచయితల కోసం పిఎం యువ మెంటర్‌షిప్ పథకాన్ని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియాతో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ప్రారంభించింది.

ఎంపికైన 75 మంది రచయితలలో 38 మంది పురుషులు మరియు 37 మంది స్త్రీలు. ఇంకా, ఇద్దరు 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.అలాగే 15-20 సంవత్సరాల వయస్సు గల రచయితలు 16 మంది, 21-25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 32 మంది మరియు 25 మంది రచయితలు 26-30 సంవత్సరాల వయస్సు గలవారు.

ఎంపికైన రచయితలు ఆరు నెలల పాటు మెంటార్‌షిప్‌కు అర్హత సాధిస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా  ఇందులో వారికి ప్రముఖ రచయితలు మరియు నేషనల్ బుక్ ట్రస్ట్‌కు చెందిన సంపాదకీయ బృందం మార్గదర్శకత్వంలో వారి పుస్తక ప్రతిపాదనలను పూర్తి స్థాయి పుస్తకాలుగా అభివృద్ధి చేయడానికి పరిశోధన మరియు సంపాదకీయ మద్దతు అందించబడుతుంది.  వారి ప్రచురించిన పుస్తకాలు తర్వాత ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడతాయి.

మెంటర్‌షిప్ సమయంలో ఎంపికైన రచయితలు ఆరు నెలల కాలానికి నెలకు ₹50,000 స్కాలర్‌షిప్‌ను అందుకుంటారు. ఇంకా, వారి పుస్తకాల విజయవంతమైన ప్రచురణలపై రచయితలకు 10% రాయల్టీ చెల్లించబడుతుంది.

 

image.png

 

image.png

 

image.png

 

గమనిక: ఈ జాబితా అక్షర క్రమంలో అమర్చబడింది.చూపించబడిన సీరియల్ నెంబర్‌ ర్యాంకులు కాదు.

***



(Release ID: 1785249) Visitor Counter : 236