సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సుపరిపాలన దినోత్సవం 2021 డిసెంబర్ 25న సుపరిపాలన సూచికను విడుదల చేసిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


2021లో తమ జిజిఐ స్కోర్ ను మెరుగుపరచుకున్న20 రాష్ట్రాలు

58 సూచికలతో కూడిన మొత్తం జాబితాలో అగ్రస్థానంలో గుజరాత్. తరువాతి స్థానాలను పొందిన మహారాష్ట్ర, గోవా

2019-20 మధ్య కాలంలో జిజిఐ సూచికల్లో 8.9% వృద్ధి సాధించిన ఉత్తరప్రదేశ్

2019-20 మధ్య కాలంలో జిజిఐ సూచికల్లో 3.7% వృద్ధి సాధించిన జమ్మూ కాశ్మీర్

కేంద్రపాలిత ప్రాంతాల సమగ్ర జాబితాలో అగ్రస్థానంలో ఢిల్లీ

Posted On: 25 DEC 2021 5:21PM by PIB Hyderabad

పరిపాలనా సంస్కరణలు,ప్రజా సమస్యల శాఖ రూపొందించిన సుపరిపాలన సూచీ 2021 ని కేంద్ర హోం,సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీ లోని  విజ్ఞాన్     భవన్ లో విడుదల చేశారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో శ్రీ షా ఈ సూచీని విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి దేశ ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న సుపరిపాలనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల నుంచి సాగిస్తున్నదని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల భారత ప్రజల విశ్వాసం 2014 నుంచి పెరిగిందని శ్రీ షా పేర్కొన్నారు.అభివృద్ధి పథకాల ఫలితాలు  మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందుతున్నాయని అన్నారు. 

గత ఏడు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని శ్రీ షా అన్నారు. దేశంలో పారదర్శకంగా సాగుతున్న సుపరిపాలనకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. 

కార్యక్రమంలో మాట్లాడిన సిబ్బందిప్రజా ఫిర్యాదులుపెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రజలకు అవసరమైన పాలనకు ప్రాధాన్యత ఇస్తూ శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో  కేంద్ర ప్రభుత్వం  పని చేస్తున్నదని అన్నారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును అంచనా వేసేందుకు సుపరిపాలన సూచి దోహదపడుతుందని మంత్రి అన్నారు. 

పది రంగాలకు సంబంధించి 58 సూచికల ఆధారంగా సుపరిపాలన సూచిక (జిజిఐ) 2021 ని రూపొందించారు.  1) వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, 2) వాణిజ్యం , పరిశ్రమలు, 3) మానవ వనరుల అభివృద్ధి, 4) ప్రజారోగ్యం, 5.) ప్రజా సౌకర్యాలు,మౌలిక సదుపాయాలు  6) ఆర్థిక పాలన, 7) సాంఘిక సంక్షేమఅభివృద్ధి, 8) న్యాయ , ప్రజా భద్రత, 9) పర్యావరణం మరియు 10) పౌర-కేంద్రీకృత పాలన రంగాలను సుపరిపాలన సూచిక 2020-21 ను రూపొందించడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను నాలుగు తరగతులుగా విభజించి సుపరిపాలన సూచిక 2020-21 ను సిద్ధం చేశారు. (i) ఇతర రాష్ట్రాలు-గ్రూప్ ఏ  (ii)ఇతర రాష్ట్రాలు-గ్రూప్ బి (iii) ఈశాన్య, కొండ రాష్ట్రాలు (iv) కేంద్రపాలిత ప్రాంతాల వారీగా సూచిక సిద్దమయ్యింది. 

 గుజరాత్మహారాష్ట్ర మరియు గోవా 10 రంగాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన కాంపోజిట్ ర్యాంక్ స్కోర్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి.  జిజిఐ 2019 సూచికలతో పోల్చి చూస్తే జిజిఐ 2021లో గుజరాత్ 12.3 శాతం, గోవా 24.7 శాతం వృద్ధిని  నమోదు చేశాయి. ఆర్థిక పాలనమానవ వనరుల అభివృద్ధిపబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు యుటిలిటీస్సాంఘిక సంక్షేమం మరియు అభివృద్ధిన్యాయవ్యవస్థ మరియు ప్రజా భద్రత తో సహా 10 రంగాలలో 5 రంగాల్లో గుజరాత్ మెరుగైన  పనితీరు కనబరిచింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగంమానవ వనరుల అభివృద్ధిప్రజా సౌకర్యాలు, మౌలిక రంగం సాంఘిక సంక్షేమం మరియు అభివృద్ధి రంగాల్లో  మహారాష్ట్ర  పనితీరు మెరుగుపడింది. వ్యవసాయం మరియు దాని  అనుబంధ రంగాలువాణిజ్యం మరియు పరిశ్రమలు,  ప్రజా సౌకర్యాలు, మౌలిక రంగంఆర్థిక పాలనసాంఘిక సంక్షేమం మరియు అభివృద్ధి మరియు పర్యావరణంలో గోవా మెరుగైన  పనితీరు కనబరిచింది.

జిజిఐ 2019 తో పోల్చి చూస్తే జిజిఐ 2021 లో  ఉత్తరప్రదేశ్ 8.9% వృద్ధిని సాధించింది. ఇతర  రంగాలలో ఉత్తరప్రదేశ్  వాణిజ్యం  పరిశ్రమల విభాగంలో అగ్రస్థానాన్ని పొందింది. సాంఘిక సంక్షేమం, అభివృద్ధి మరియు న్యాయ వ్యవస్థ, ప్రజా భద్రత రంగాలలో ఉత్తరప్రదేశ్ వృద్ధి సాధించింది.  ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తో సహా పౌర కేంద్రీకృత పాలన లో కూడా ఉత్తరప్రదేశ్ పనితీరు మెరుగుపడింది. 

జిజిఐ 2019 తో పోల్చి చూస్తే జిజిఐ 2021 లో  ఝార్ఖండ్12.6% వృద్ధిని సాధించింది. పది రంగాల్లో ఏడు రంగాల్లో ఝార్ఖండ్ వృద్ధి సాధించింది. జిజిఐ 2019 తో పోల్చి చూస్తే జిజిఐ 2021 లో  రాజస్థాన్ 1.7% వృద్ధిని సాధించింది. న్యాయ వ్యవస్థ మరియు  ప్రజా భద్రత  , పర్యావరణం,  పౌర-కేంద్రీకృత పాలన రంగాల జాబితాలో   ఇతర రాష్ట్రాల (గ్రూప్ బి ) విభాగంలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. 

ఈశాన్య ప్రాంతాలుకొండ ప్రాంతాల విభాగంలో జిజిఐ 2019 తో పోల్చి చూస్తే జిజిఐ 2021 లో మిజోరాం 10.4%, జమ్మూకాశ్మీర్ 3.7%  ఝార్ఖండ్ 12.6% వృద్ధిని సాధించాయి.  వాణిజ్యం మరియు పరిశ్రమలు, మానవ వనరుల అభివృద్ధిఆర్థిక పాలన, ప్రజారోగ్య రంగాల్లో మిజోరాం  పనితీరు మెరుగు పడింది.  వాణిజ్యం పరిశ్రమల విభాగంలో పనితీరును మెరుగు పరచుకున్న జమ్మూ కాశ్మీర్   వ్యవసాయం,దాని  అనుబంధ రంగం ప్రజా సౌకర్యాలు, మౌలిక రంగం, న్యాయ వ్యవస్థ మరియు   ప్రజా భద్రత   రంగాలలో ఎక్కువ మార్కులు సాధించింది. 

 కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో జిజిఐ 2019 తో పోల్చి చూస్తే జిజిఐ 2021 లో  14 శాతం వృద్ధి సాధించిన  ఢిల్లీ కాంపోజిట్ ర్యాంక్‌లో అగ్రస్థానంలో ఉంది. వ్యవసాయం ,దాని  అనుబంధ రంగాలు, వాణిజ్యం పరిశ్రమలు ప్రజా సౌకర్యాలు, మౌలిక రంగం, సాంఘిక సంక్షేమం అభివృద్ధి రంగాల్లో ఢిల్లీ మెరుగైన పనితీరు కనబరిచింది.

జిజిఐ 2019 తో పోల్చి చూస్తే జిజిఐ 2021 లో 20 రాష్ట్రాలు తమ పనితీరును మెరుగు పరుచుకున్నాయి. రంగాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటి లేదా అంతకు మించిన సూచికల్లో తమ పనితీరును గణనీయంగా మెరుగు పరచుకున్నాయని సూచిక తెలియజేస్తోంది. సమగ్ర మార్కుల జాబితాలో రాష్ట్రాలు సాధించిన మార్కుల మధ్య ఎక్కువ వ్యత్యాసం లేదు. దీనితో దేశంలో అన్ని రాష్ట్రాల్లో పరిపాలన సానుకూల దిశలో సాగుతున్నదని తెలుస్తోంది. 

సమగ్ర ర్యాంకుల జాబితాలో రంగాల వారీగా అగ్ర స్థానం సాధించిన రాష్ట్రాల వివరాలు:

 

రంగాలు

గ్రూప్  

గ్రూప్ బి

ఈశాన్య కొండ ప్రాంత రాష్ట్రాలు  

యుటి

వ్యవసాయంఅనుబంధ రంగం

ఆంధ్రప్రదేశ్

మధ్యప్రదేశ్

మిజోరం

డి అండ్ ఎన్  హవేలీ

వాణిజ్యం మరియు పరిశ్రమ

తెలంగాణ

ఉత్తర ప్రదేశ్

జమ్మూ కాశ్మీర్ 

డామన్  డయ్యూ

మానవ వనరుల అభివృద్ధి

పంజాబ్

ఒడిశా

హిమాచల్ ప్రదేశ్

చండీగఢ్

ప్రజారోగ్యం

కేరళ

పశ్చిమ బెంగాల్

మిజోరం

అండమాన్ నికోబార్ దీవులు  

 ప్రజా సౌకర్యాలు,మౌలిక సదుపాయాలు

గోవా

బీహార్

హిమాచల్ ప్రదేశ్

అండమాన్ నికోబార్ దీవులు

ఆర్థిక పాలన

గుజరాత్

ఒడిశా

త్రిపుర

ఢిల్లీ

సాంఘిక సంక్షేమం మరియు అభివృద్ధి

తెలంగాణ

ఛత్తీస్‌గఢ్

సిక్కిం

డి అండ్ ఎన్  హవేలీ

న్యాయ వ్యవస్థ మరియు ప్రజా భద్రత

తమిళనాడు

రాజస్థాన్

నాగాలాండ్

చండీగఢ్

పర్యావరణం

కేరళ

రాజస్థాన్

మణిపూర్

డామన్, డయ్యూ

పౌర-కేంద్రీకృత పాలన 

హర్యానా

రాజస్థాన్

ఉత్తరాఖండ్

ఢిల్లీ

మిశ్రమ

గుజరాత్

మధ్యప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

ఢిల్లీ

 

ఇప్పటికే ఉన్న పరిమాణాత్మక సూచికలతో పాటు అదనపు ప్రక్రియ మరియు ఇన్‌పుట్ ఆధారిత సూచికలు  జిజిఐ   20202-21 లో చేర్చడం జరిగింది. పాలన సాగుతున్న తీరును సమగ్రంగా అధ్యయనం చేయాలన్న లక్ష్యంతో  అదనపు రంగాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.  జిజిఐ   2020-21 నివేదిక రూపకల్పనలో  గుణాత్మక అంశాలు చేర్చడంకొత్త సూచికలను చేర్చడం మరియు సూచికను రూపొందించడానికి అవసరమైన సమాచారాన్ని  అందుబాటులో ఉంచడం వంటి అంశాల ఆధారంగా కార్యాచరణ కార్యక్రమం రూపొందింది. 
సుపరిపాలన సూచిక  2021 నివేదిక www.darpg.gov.inలో అందుబాటులో ఉంటుంది.

 

***



(Release ID: 1785212) Visitor Counter : 935