మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

దేశంలో మొట్టమొదటి ఐవీఎఫ్ లేగ‌ దూడను ఉత్పత్తి చేసిన ఐవీఎఫ్‌ కేంద్రాన్ని సందర్శించిన శ్రీ ప‌రుషోత్తం రూపాలా


- ఐవీఎఫ్‌ సాంకేతికత ద్వారా దూడల ఉత్పత్తికి సంబంధించి స్థిరమైన నమూనా, ఆదాయ ఉత్పత్తిలో గ‌ల అపార అవకాశాలను గురించి ప్ర‌ధానంగా వ్యాఖ్యానించిన మంత్రి

Posted On: 24 DEC 2021 1:09PM by PIB Hyderabad

కేంద్ర మ‌త్స్య‌ , పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పరుఫోత్తమ్ రూపాలా ఈరోజు జేకే ట్రస్ట్ బోవెజెజిక్స్ పూణేని సందర్శించారు. ఈ  ఐవీఎఫ్‌ కేంద్రం దేశంలోనే మొట్టమొదటి ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిలో లేగ దూడను ఉత్పత్తి చేసింది.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “డాక్టర్ విజయపత్ సింఘానియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ ఇన్ లైవ్‌స్టాక్‌లో సాహివాల్ జాతి ఆవు నుండి ఓసైట్‌లను వెలికితీసే ప్రక్రియను ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించింద‌ని అన్నారు.


ఈ సందర్భంగా శ్రీ రూపాల అభినందనలు తెలిపారు. 100 మరియు 125 దూడలను ఉత్పత్తి చేసిన "సమాధి" మరియు "గౌరీ" సాహివాల్ తల్లి ఆవులను బ్రీడింగ్ కోసం ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిలో కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.  వీటిని క‌ల‌ప‌డం వ‌ల్ల  ఉత్ప‌త్తి అయిన ఒక్కో దూడను రూ. 1 లక్ష వ‌ర‌కు విక్ర‌యించిన‌ట్టుగా తెలిపారు. ఈ రెండు తల్లి ఆవుల వ‌ల‌న‌ జేకే బోవాజెనిక్స్‌ ఒక సంవత్సరంలో సుమారు రూ. కోటి ఆదాయాన్ని ల‌భించిన‌ట్టుగా త‌న‌కు తెలియ‌జేయ‌డ‌మైంద‌ని అన్నారు. ఐవీఎప్‌ సాంకేతికత ద్వారా దూడల ఉత్పత్తి,  స్థిరమైన నమూనా మరియు ఆదాయ ఉత్పత్తి విధానంలో ఎంతో అపారమైన అవకాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. జేకే బోవా జెనిక్స్ అనేది జేకే ట్రస్ట్ యొక్క చొరవ. ఎంపిక చేసిన దేశీయ పశువుల జాతులపై దృష్టి సారించి జన్యుపరంగా ఉన్నతమైన ఆవులు మరియు గేదె   ల సంఖ్య‌ను పెంచేందుకు ట్రస్ట్ ఐవీఎఫ్‌ మరియు ఈటీ  టెక్నాలజీలను ప్రవేశపెట్టింది.                      

 


                                                                               

***



(Release ID: 1784861) Visitor Counter : 200