విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కేఎఫ్‌డబ్ల్యు డెవలప్‌మెంట్ బ్యాంక్‌తో ఆర్ఈసీ ఒప్పందం
- విద్యుత్, మరియు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడమే లక్ష్యంగా ఒప్పందం
Posted On:
23 DEC 2021 2:38PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్ధిక వ్యవహారాల విభాగం మంజూరు చేసిన ఆమోదం మేరకు భారత - జర్మనీ ద్వైపాక్షిక భాగస్వామ్యం కింద 169.5 మిలియన్ల డాలర్ల ఓడీఏ టర్మ్ లోన్‌ను పొందడం కోసం.. కేఎఫ్‌డబ్ల్యు డెవలప్‌మెంట్ బ్యాంక్‌తో ఆర్ఈసీ లిమిటెడ్ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశం తీసుకొనే ఓడీఏలోన్ ద్వారా వచ్చే ఆదాయాలు పోటీ వడ్డీ రేట్లలో భారతదేశంలో వినూత్నమైన సోలార్ పీవీ టెక్నాలజీ ఆధారితమైన ప్రాజెక్ట్‌ల అవసరాలకు పాక్షిక ఫైనాన్సింగ్ కోసం ఉపయోగించబడతాయి. ఇది విద్యుత్ రంగంలోని సంస్థల ఫైనాన్సింగ్ కోసం ఆర్ఈసీ లిమిటెడ్, కేఎఫ్‌డబ్ల్యు మధ్య సంతకం చేయబడిన ఐదో రుణ తోడ్పాటు ఒప్పందం.పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌ల ఆర్థిక సాయానికి సంబంధించిన మూడో క్రెడిట్ లైన్. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆర్ఈసీ తన విధానాలను నిరంతరం పునర్నిర్మిస్తోంది. రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలో ప్రైవేట్ మరియు పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌లను పెంచడం మరియు సమర్థవంతమైన మార్గాలను రూపొందించే ఆర్థిక పరిష్కారాలు, వ్యవస్థలను ఆర్‌ఈసీ అభివృద్ధి చేస్తుంది. దీనికి నిదర్శనంగా ఆర్ఈసీ కార్పొరేషన్ నిధులు సమకూరుస్తున్న అన్ని విభాగాలలో పునరుత్పాదక ఇంధన రంగానికి ఆర్ఈసీ అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణం అందిస్తుంది.
***
(Release ID: 1784675)