గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మహాత్మా గాంధీ నరేగా కింద ఉపాధి కల్పనకు సంబంధించి వార్తలపై వివరణ

प्रविष्टि तिथि: 21 DEC 2021 10:52AM by PIB Hyderabad

మహాత్మా గాంధీ ఎన్‌ఆర్‌ఇజిఎస్- నరేగా కింద ఉపాధి హామీ సంబంధించిన డిసెంబర్ నెల మొదటి 17 రోజుల డేటా అత్యంత తక్కువగా ఉందని పేర్కొంటూ కొన్ని వార్తలు ప్రచురితమయ్యాయి. మహాత్మా గాంధీ నరేగా అనేది డిమాండ్ ఆధారిత పథకం. అటువంటి పోలిక, చట్టం స్ఫూర్తికి అనుగుణంగా లేదని స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు లబ్ధిదారుల డిమాండ్ మేరకు 261 కోట్ల కంటే ఎక్కువ పనిదినాలు కల్పించడం అయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో మొత్తం 175 కోట్లకు పైగా పనిదినాలు కల్పించడం అయింది.  అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో 276 కోట్ల కంటే ఎక్కువ పని దినాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదే కాలంలో 255 కోట్ల కంటే ఎక్కువ పనిదినాలు కల్పించడం జరిగింది. 

నిర్దిష్ట నెలలో చేసిన పని ఆ నెలలో పూరించిన మస్టర్ రోల్ - ఎంఆర్ తో లెక్కిస్తారు. పథకం డేటా నమోదు కోసం 7 రోజుల విండోను అనుమతిస్తుంది. అందువలన, డిసెంబర్ పూర్తి డేటా సాధారణంగా తదుపరి నెల10 రోజులలో అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా, మొదటి 17 రోజుల డేటా ఆధారంగా ఒక పోలిక డిసెంబర్ నెలలో ఒక చిన్న భిన్నం సమయంలో రూపొందించబడిన పనిదినాలు పరిగణనలోకి తీసుకుంటుంది. చట్టంలోని నిబంధన ప్రకారం, డిసెంబర్ 2021 నెల చివరి వారంలో పూర్తయ్యే పనులకు సంబంధించిన డేటా ఎంట్రీ 2022 జనవరి 2వ వారంలో ప్రతిబింబిస్తుంది. నవంబర్‌లో, 2019 మొత్తంగా 16.92 కోట్ల పనిదినాలు కల్పించడం అయింది, గత సంవత్సరం ఇదే నెలలో 23 కోట్లకు పైగా పనిదినాలు,  2021 నవంబర్ నెలలో 22 కోట్లకు పైగా పనిదినాలు కల్పించడం అయింది.

వేతనం మరియు మెటీరియల్ కోసం నిధుల విడుదల నిరంతర ప్రక్రియ. బడ్జెట్ అంచనా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల కేటాయింపులో 18% ఎక్కువ పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు/యూటీలలో పథకం అమలు కోసం ఇప్పటివరకు రూ.74,388 కోట్ల కంటే ఎక్కువ నిధులు విడుదలయ్యాయి.

అదనపు నిధులు అవసరమైనప్పుడు, నిధులను అందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి ఇస్తారు. ఇటీవల, ఆర్థిక మంత్రిత్వ శాఖ తాత్కాలిక చర్యగా మహాత్మా గాంధీ నరేగా కోసం రూ.10,000 కోట్ల అదనపు నిధులను కేటాయించింది. ఇంకా, సవరించిన అంచనాల దశలో డిమాండ్‌ను అంచనా వేసిన తర్వాత కేటాయింపులు చేయవచ్చు. చట్టంలోని నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తించే మార్గదర్శకాల ప్రకారం, పథకం పటిష్టంగా అమలు చేయడానికి, అమలుకు వేతనం, మెటీరియల్  చెల్లింపులకు నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. .

*****


(रिलीज़ आईडी: 1784041) आगंतुक पटल : 267
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil