రక్షణ మంత్రిత్వ శాఖ
గోవా విముక్తి దిన వజ్రోత్సవ వేడుకలలో పాల్గొన్న భారతీయ నావికా దళం
నాడు పోస్టు చేయడమైనది:
20 DEC 2021 11:59AM by PIB Hyderabad
ప్రతి ఏడాదీ డిసెంబర్ 19న గోవా రాష్ట్రం విముక్తి దినోత్సవంగా జరుపుకుంటుంది. గోవా స్వాతంత్ర్యాన్ని సాధించి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా, 19 డిసెంబర్ 2021న పానాజీలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భ జ్ఞాపకార్ధం గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆజాద్ మైదాన్‌లోని అమరవీరుల స్మారకచిహ్నం (మార్టియర్స్ మెమోరియల్) పై పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలకు చెందిన 100మంది గార్డ్ ఆఫ్ ఆనర్‌ను చేస్తున్న సందర్భంగా వాద్యకారులు ది లాస్ట్ పోస్ట్ వాయించారు.
దీనితోపాటుగా, ప్రధానమంత్రి భారతీయ నావికాదళం, కోస్ట్‌గార్డ్, నావలతో పెరేడ్ ఆఫ్ సెయిల్స్ ను, అలాగే, పౌర ఏజెన్సీలు, భారతీయ నావికాదళపు విమానం ఫ్లైపాస్ట్‌ను మిరామర్ బీచ్ నుంచి తిలకించారు.
వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్, ఫ్లాగ్ కమాండింగ్- ఇన్-చీఫ్, వెస్టర్న్ నావల్ కమాండ్, రేర్ అడ్మిరల్ ఫిలిపోస్ జి పున్యుమూతిల్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ గోవా ఏరియాల సమక్షంలో భారతీయ నావికాదళం వజ్రోత్సవ కార్యక్రమాలను సమన్వయపరిచింది.
91R4.jpg)
4DVM.jpg)
***
(రిలీజ్ ఐడి: 1783447)
సందర్శకుల సూచీ సంఖ్య : : 146