విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కేంద్ర విద్యుత్, ఎన్ ఆర్ ఇ శాఖ మంత్రి శ్రీ ఆర్ .కె. సింగ్ రాష్ట్రాలతో ప్రణాళిక, పర్యవేక్షణ సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు.
భవిష్యత్‌కు సిద్ధమైన, ఆధునిక విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు మా లక్ష్యం. ఇది పోటీనిచ్చేదిగా, ఆచరణీయమైనదిగా ఉంటుంది : శ్రీ ఆర్.కె.సింగ్
విద్యుత్ రంగంలో రాష్ట్రాలు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలి : శ్రీ ఆర్.కె.సింగ్
పి.ఎం. కుసుమ్, రూఫ్ టాప్ సోలార్, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత, మరింత మెరుగుపరిచిన పంపిణీ పథకంపై రాష్ట్రాల వారీగా సమీక్ష నిర్వహించిన మంత్రి
Posted On:
18 DEC 2021 11:46AM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్, ఎన్ .ఆర్. ఇ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అదనపు ప్రధాన కార్యదర్శులు, విద్యుత్, ఇంధన విభాగాల ప్రిన్సిపుల్ సెక్రటరీలు ,సిపిఎస్‌యుల సిఎండిలు, ఎండీలతో 2021 డిసెంబర్ 17న సమీక్ష, ప్రణాళిక, అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్ గుర్జార్, ఎం.ఎన్.ఆర్.ఇ శాఖ సహాయమంత్రి శ్రీ భగవంత్ ఖుబాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్ శాఖ కార్యదర్శి, ఎం.ఎన్.ఆర్.ఇ కార్యదర్శి, ఉభయ మంత్రిత్వశాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ కేంద్ర మంత్రి ఆర్.కె.సింగ్, ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ఎంతో ముందుకు తీసుకువచ్చిందని అన్నారు. దేశం ప్రస్తుతం విద్యుత్ మిగులు కలిగిఉందని అన్నారు. దేశం మొత్తాన్ని ఒక గ్రిడ్‌గా అనుసంధానం చేశామని , పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు. ఈ చర్యలు గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ అందుబాటును 22 గంటలకు పెంచిందని, పట్టణ ప్రాంతాలలో ఇది 23.5 గంటలకు చేరిందన్నారు. తదుపరి దశలో దీనిని నిరంతరాయ విద్యుత్ సరఫరాకు , చవకధరలో విద్యుత్ అందుబాటుకు వీలు కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు.
భారత ఆర్ధిక వ్యవస్థకు విద్యుత్ అందుబాటు అత్యావశ్యకమని , దేశ ప్రజలకు ప్రపంచశ్రేణి సేవలు, సదుపాయాలు అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పర్యావరణాన్ని అందించేందుకు, ఈ రంగం అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మరింత హరిత ఇంధనం దిశగా ఇంధన రంగాన్ని పరివర్తన దిశగా తీసుకువెళుతున్నట్టు మంత్రి తెలిపారు. పిఎం- కుసుమ్ పథకం ప్రయోజనాలు ఎన్నో రకాలుగా ఉన్నాయని అన్నారు. ప్రధానంంగా ఇవి అదనపు రాబడి, రైతులకు చవక విద్యుత్ వంటివి ఇందులో ప్రధానమైనవని అన్నారు. రాష్ట్రప్రభుత్వాలు తగ్గింపు సబ్సిడీ భారంతో ఎంతో ప్రయోజనం పొందుతాయని అన్నారు. ఇది పర్యావరణానికి మేలు చేస్తుదన్నారు. రాష్ట్రాల వారీగా అమలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారు. పర్యావరణ హితకరమైన విధానంలో తగినంత విద్యుత్ సరఫరా కు సంబంధించి ఈ సమావేశంలో మరింత దృష్టి పెట్టడం జరిగింది.
జన్కో ల బకాయిలు పెరిగిపోతున్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. డిస్కమ్‌లు తక్షణం నష్టాలను తగ్గంచే చర్యలను చేపట్టాలని, సరైన మీటర్,బిల్లింగ్ ఇంధన లెక్కలు ఉండే లా చూసుకోవాలని సూచించారు. సంబంధిత రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించే సబ్సిడీలకు తగిన లెక్కలు ఉండేలా చూడాలని, డిస్కమ్‌లకు చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు.
వినియోగదారులకు 24 గంటలూ నిరంతరాయ విద్యుత్ సరఫరాలకు నిర్వహణా పరంగా సమర్ధమైన, ఆర్ధిక పరంగా తగిన విద్యుత్ పంపిణీ వ్యవస్థ అవసరమని మంత్రి అన్నారు. ఈ లక్ష్య సాదనకు ప్రభుత్వం ఇటీవల సవరించిన పంపిణీ రంగ పథకాన్ని ప్రారంభించినట్టుతెలిపారు. దీని మొత్తం పెట్టుబడి 3.0 లక్షల కోట్ల రుపాయలుగా ఆయన తెలిపారు. ఈ పథకం కింద ఎటి, సి నష్టాలను 12నుంచి 15 శాతానికి తగ్గించవచ్చని ఎసిఎస్- ఎపిఆర్ మధ్యతేడాను దేశవ్యాప్త స్థాయలో 2024-25 నాటికి తొలగించవచ్చని అన్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు, డిస్కమ్‌లు పురోగతిసాధిస్తున్నాయని, స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం కార్యాచరణ, డిపిఆర్‌లు సిద్దం అవుతున్నాయని అన్నారు.
విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్‌జార్ సౌభాగ్య పథకం , డిడియుజిజెవై కింద నూరు శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు రాష్ట్రాలు అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ప్రగతి సాధనకు విద్యుత్ కీలకమని ఆయన అన్నారు. మెరుగుపరిచిన పంపిణీ రంగ పథకం పైసమీక్ష నిర్వహిస్తూ ఆయన విద్యుత్ వాల్యూ చెయిన్‌లో డిస్కమ్‌లు వినియోగదారులకు నోడల్ పాయింట్లుగా ఉంటాయన్నారు.అందువల్ల ఇవి ఎంతో కీలకమని చెప్పారు.
డిస్కమ్‌ల ఆర్థిక స్థితి మెరుగుపడడంవల్ల మొత్తంగా విద్యుత్ రంగంలోకి పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వస్తాయి. అలాగే వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరాతోపాటు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి.
***
(Release ID: 1783188)
Visitor Counter : 127