మంత్రిమండలి

భారతదేశంలో సెమీకండక్టర్స్ మరియు డిస్‌ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం ప్రోగ్రామ్‌ను ఆమోదించిన క్యాబినెట్


రూ.2,30,000 కోట్ల ప్రోత్సాహకాలు భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చడంతో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీకి సెమీకండక్టర్‌లతో పునాది బిల్డింగ్ బ్లాక్‌గా ఉంచుతాయి

భారతదేశంలో సెమీకండక్టర్స్ మరియు డిస్‌ప్లే తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి రూ.76000 కోట్లు (>10 బిలియన్ అమెరికన్‌ డాలర్లు)ఆమోదించబడింది

ఈ రంగాన్ని నడపడానికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) ఏర్పాటు

Posted On: 15 DEC 2021 4:00PM by PIB Hyderabad

ఆత్మనిర్భర్ భారత్ దృష్టిలో మరియు భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మరియు తయారీకి గ్లోబల్ హబ్‌గా నిలబెట్టడంలో, గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సుస్థిరమైన సెమీకండక్టర్ మరియు ప్రదర్శన పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం సెమీకండక్టర్స్ మరియు డిస్‌ప్లే తయారీ మరియు డిజైన్‌లోని కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా పోటీ ప్రోత్సాహక ప్యాకేజీని అందించడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఇది వ్యూహాత్మక ప్రాముఖ్యత మరియు ఆర్థిక స్వావలంబనే గాక ఈ రంగాలలో భారతదేశం యొక్క సాంకేతిక నాయకత్వానికి మార్గం సుగమం చేస్తుంది.

పరిశ్రమ 4.0 కింద డిజిటల్ పరివర్తనతదుపరి దశను నడిపించే ఆధునిక ఎలక్ట్రానిక్స్‌కు సెమీకండక్టర్లు మరియు డిస్‌ప్లేలు పునాది. సెమీకండక్టర్స్ మరియు డిస్‌ప్లే తయారీ అనేది చాలా సంక్లిష్టమైన మరియు సాంకేతిక-ఇంటెన్సివ్ రంగం. ఇందులో భారీ మూలధన పెట్టుబడులు, అధిక రిస్క్, సుదీర్ఘ కాలం మరియు తిరిగి చెల్లించే కాలాలు మరియు సాంకేతికతలో వేగవంతమైన మార్పులు ఉంటాయి. దీనికి ముఖ్యమైన మరియు స్థిరమైన పెట్టుబడులు అవసరం. క్యాపిటల్ సపోర్ట్ మరియు సాంకేతిక సహకారాన్ని సులభతరం చేయడం ద్వారా సెమీకండక్టర్ మరియు డిస్‌ప్లే తయారీకి ప్రోగ్రాం ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్‌ప్లే ఫ్యాబ్‌లు, కాంపౌండ్ సెమీకండక్టర్స్ / సిలికాన్ ఫోటోనిక్స్ / సెన్సార్‌లు (ఎంఈఎంఎస్‌ సహా) ఫ్యాబ్‌లు, సెమీకండక్టర్ ప్యాకేజింగ్ (ఎటిఎంపి/ఓసాట్ డిజైన్), సెమీకండక్టర్‌లలో నిమగ్నమై ఉన్న కంపెనీలు / కన్సార్టియాకు ఆకర్షణీయమైన ప్రోత్సాహక మద్దతును అందించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.


భారతదేశంలో సెమీకండక్టర్స్ మరియు డిస్‌ప్లే తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి క్రింది విస్తృత ప్రోత్సాహకాలు ఆమోదించబడ్డాయి:

సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు మరియు డిస్‌ప్లే ఫ్యాబ్‌లు: భారతదేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు మరియు డిస్‌ప్లే ఫ్యాబ్‌ల ఏర్పాటుకు సంబంధించిన పథకం అర్హులైన మరియు సాంకేతికతతో పాటు సామర్థ్యం ఉన్న దరఖాస్తుదారులకు పారి-పాసు ప్రాతిపదికన ప్రాజెక్ట్ వ్యయంలో 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. అటువంటి అధిక మూలధన మరియు వనరుల ప్రోత్సాహక ప్రాజెక్టులను అమలు చేయడానికి దాన్ని వినియోగించాలు. కనీసం రెండు గ్రీన్‌ఫీల్డ్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు మరియు రెండు డిస్‌ప్లే ఫ్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులను ఆమోదించడానికి భూమి, సెమీకండక్టర్ గ్రేడ్ నీరు, అధిక నాణ్యత గల శక్తి, లాజిస్టిక్స్ మరియు రీసెర్చ్ ఎకోసిస్టమ్ పరంగా అవసరమైన మౌలిక సదుపాయాలతో హైటెక్ క్లస్టర్‌లను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుంది.

సెమీ కండక్టర్ లాబొరేటరీ (ఎస్‌సిఎల్): సెమీ కండక్టర్ లాబొరేటరీ (ఎస్‌సిఎల్) ఆధునీకరణ మరియు వాణిజ్యీకరణ కోసం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలు తీసుకోవడానినికి కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదించింది. బ్రౌన్‌ఫీల్డ్ ఫ్యాబ్ సదుపాయాన్ని ఆధునీకరించడానికి కమర్షియల్ ఫ్యాబ్ భాగస్వామితో ఎస్‌సిఎల్ యొక్క జాయింట్ వెంచర్‌ను ఎంఈఐటివై అన్వేషిస్తుంది.

కాంపౌండ్ సెమీకండక్టర్స్ / సిలికాన్ ఫోటోనిక్స్ / సెన్సార్లు (ఎంఈఎంఎస్‌తో సహా) ఫ్యాబ్స్ మరియు సెమీకండక్టర్ ఎటిఎంపి/ఓసాట్ యూనిట్లు: కాంపౌండ్ సెమీకండక్టర్స్ / సిలికాన్ ఫోటోనిక్స్ / సెన్సార్ల ఏర్పాటు కోసం పథకం (ఎంఈఎంఎస్‌తో సహా) భారతదేశంలో ఫ్యాబ్స్ మరియు సెమీకండక్టర్ ఏటిఎంపి /ఓసాట్ సౌకర్యాలను విస్తరించాలి. ఆమోదించబడిన యూనిట్లకు మూలధన వ్యయంలో 30% అందిస్తారు. కాంపౌండ్ సెమీకండక్టర్స్ మరియు సెమీకండక్టర్ ప్యాకేజింగ్  కనీసం 15 యూనిట్లు ఈ పథకం కింద ప్రభుత్వ మద్దతుతో స్థాపించబడతాయని భావిస్తున్నారు.

సెమీకండక్టర్ డిజైన్ కంపెనీలు: డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డిఎల్‌ఐ) స్కీమ్ అర్హత వ్యయంలో 50% వరకు ఉత్పత్తి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్‌ను మరియు ఐదేళ్లపాటు నికర అమ్మకాలపై 6% - 4% ప్రోడక్ట్ డిప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్‌ను పొడిగిస్తుంది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు (ఐసీలు), చిప్‌సెట్‌లు, సిస్టం ఆన్ చిప్స్ (ఎస్‌ఓసిఎస్‌), సిస్టమ్స్ & ఐపీ కోర్లు మరియు సెమీకండక్టర్ లింక్డ్ డిజైన్‌ల కోసం సెమీకండక్టర్ డిజైన్‌కు చెందిన 100 దేశీయ కంపెనీలకు మద్దతు అందించబడుతుంది మరియు రానున్న ఐదేళ్లలో రూ.1500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ సాధించగల 20 కంటే తక్కువ కంపెనీల వృద్ధిని సులభతరం చేస్తుంది.

భారతదేశ సెమీకండక్టర్ మిషన్: స్థిరమైన సెమీకండక్టర్లు మరియు ప్రదర్శన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయడానికి, ప్రత్యేకమైన మరియు స్వతంత్ర 'ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)' ఏర్పాటు చేయబడుతుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్‌కు సెమీకండక్టర్ మరియు డిస్‌ప్లే పరిశ్రమలో ప్రపంచ నిపుణులు నాయకత్వం వహిస్తారు. సెమీకండక్టర్స్ మరియు డిస్‌ప్లే ఎకోసిస్టమ్‌పై పథకాలను సమర్థవంతంగా మరియు సజావుగా అమలు చేయడానికి ఇది నోడల్ ఏజెన్సీగా పని చేస్తుంది.


సెమీకండక్టర్స్ మరియు ఎలక్ట్రానిక్స్ కోసం సమగ్ర ఆర్థిక మద్దతు

భారతదేశంలో రూ.76,000 కోట్ల (>10 బిలియన్ అమెరికన్ డాలర్లు) వ్యయంతో సెమీకండక్టర్స్ మరియు డిస్‌ప్లే తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన ప్రోగ్రామ్ ఆమోదంతో ఎలక్ట్రానిక్ భాగాలు, సబ్-అసెంబ్లీలతో సహా సరఫరా గొలుసులోని ప్రతి భాగానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. రూ.55,392 కోట్ల (7.5 బిలియన్ యూఎస్‌డి) ప్రోత్సాహక మద్దతు పిఎల్‌ఐ కింద లార్జెస్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పిఎల్‌ఐ కోసం ఐటీ హార్డ్‌వేర్,ఎస్‌పిఈసిఎస్‌ స్కీమ్ మరియు మోడిఫైడ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ల (ఈఎంసి2.0) పథకం కింద ఆమోదించబడింది. వీటితో పాటు ఏసీసీ బ్యాటరీ, ఆటో భాగాలు, టెలికాం & నెట్‌వర్కింగ్ ఉత్పత్తులు, సోలార్ పివి మాడ్యూల్స్ మరియు వైట్ గూడ్స్‌తో కూడిన అనుబంధ రంగాలకు రూ.98,000 కోట్ల (యూఎస్‌డి13 బిలియన్లు) పిఎల్‌ఐ ప్రోత్సాహకాలు ఆమోదించబడ్డాయి. భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీకి సెమీకండక్టర్లతో పునాది బిల్డింగ్ బ్లాక్‌గా ఉంచడానికి మొత్తంగా భారత ప్రభుత్వం రూ. 2,30,000 కోట్లు (యూఎస్‌డి 30 బిలియన్లు) కేటాయిస్తుంది.

ప్రస్తుత భౌగోళిక రాజకీయ దృష్టాంతంలో సెమీకండక్టర్స్ మరియు డిస్‌ప్లేల విశ్వసనీయ మూలాలు వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి మరియు క్లిష్టమైన సమాచార మౌలిక సదుపాయాల భద్రతకు కీలకం. ఆమోదించబడిన కార్యక్రమం ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది మరియు భారతదేశం యొక్క డిజిటల్ సార్వభౌమత్వాన్ని నిర్ధారించడానికి దేశీయ సామర్థ్యాలను పెంచుతుంది. ఇది దేశం యొక్క జనాభా డివిడెండ్‌ను ఉపయోగించుకోవడానికి అత్యంత నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.

సెమీకండక్టర్ మరియు డిస్‌ప్లే ఎకోసిస్టమ్ అభివృద్ధి గ్లోబల్ వాల్యూ చైన్‌కి లోతైన ఏకీకరణతో ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో గుణకార ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ కార్యక్రమం ఎలక్ట్రానిక్స్ తయారీలో అధిక దేశీయ విలువ జోడింపును ప్రోత్సహిస్తుంది మరియు 2025 నాటికి 1 ట్రిలియన్ యూఎస్‌డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు  5 ట్రిలియన్ యూఎస్‌ డాలర్ల జీడీపిని సాధించడానికి గణనీయంగా దోహదం చేస్తుంది.


 

****(Release ID: 1781960) Visitor Counter : 400