యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఆసియా క్రీడలకు సన్నాహకంగా విదేశాల్లో శిక్షణ ఇవ్వాలనే నావికుల ప్రతిపాదనను ఆమోదించిన - మిషన్ ఒలింపిక్ సెల్
Posted On:
14 DEC 2021 2:36PM by PIB Hyderabad
కీలక ముఖ్యాంశాలు :
* నలుగురు ఒలింపియన్ నావికుల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు 2.75 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి.
* నవంబర్ లో ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారుల అభివృద్ధి బృందానికి అందించిన మద్దతును సభ్యులు ఆమోదించారు.
వచ్చే ఏడాది చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడల నేపథ్యంలో విదేశాల్లో శిక్షణ పొంది పోటీ పడేందుకు నలుగురు నావికులు చేసిన ప్రతిపాదనలను ఇటీవల తిరిగి ఏర్పాటైన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మిషన్ ఒలింపిక్ విభాగం ఈ రోజు ఆమోదించింది. నలుగురు ఒలింపియన్ నావికుల నుంచి ఈ ప్రతిపాదనలకు 2.75 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఖర్చు కానుంది.
ఈ నిధులను నావికులు వరుణ్ ఠక్కర్, కె.సి. గణపతి (రూ. 1.34 కోట్లు); లేజర్ రేడియల్ స్పెషలిస్ట్ నేత్ర కుమనన్ (రూ. 90.58 లక్షలు); లేజర్ స్టాండర్డ్ ఏస్ విష్ణు శరవణన్ (రూ. 51.08 లక్షలు) ప్రయాణం, భోజనం, వసతి, కోచ్ ప్రవేశ రుసుము, కోచ్ బోట్ చార్టర్, ఆసియా క్రీడల వరకు కోచ్ జీతం కోసం ఉపయోగిస్తారు.
గతంలో, అత్యవసర ప్రాతిపదికన ఆమోదం పొందిన అనేక ఇతర ప్రతిపాదనలను కూడా మిషన్ ఒలింపిక్ సెల్ ధృవీకరించింది. వీటిలో, అమెరికాలోని చులావిస్టా లో తన ఆఫ్-సీజన్ శిక్షణ కోసం, ఒలింపిక్ క్రీడల్లో, జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతక విజేత నీరజ్ చోప్రా దాఖలు చేసిన ప్రతిపాదన; స్పెయిన్‌లో జరిగే బి.డబ్ల్యూ.ఎఫ్. ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో తన ఫిట్‌నెస్ ట్రైనర్ సేవలను వినియోగించుకోడానికి వీలుగా సహాయం కోసం, డిఫెండింగ్ మహిళా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ పి.వి. సింధు దాఖలు చేసిన ప్రతిపాదన కూడా ఉన్నాయి.
నవంబర్, డిసెంబర్ నెలల్లో ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారుల అభివృద్ధి బృందానికి అందించిన మద్దతును సభ్యులు ఆమోదించారు. శిఖా గౌతమ్, అశ్విని భట్, ప్రియాంషు, విష్ణు వర్ధన్, కృష్ణ ప్రసాద్, ఇషాన్, సాయి ప్రతీక్, పి. గాయత్రి, త్రీసా, తనీషా, రుతుపర్ణ, సమియా ఫరూఖీల ఎక్స్‌పోజర్ పర్యటనకు దాదాపు 45 లక్షల రూపాయలు ఖర్చయ్యింది.
వీటితో పాటు, అభినవ్ సాథే ఫీజు కోసం, ఏ.సి.టి.సి. నిధులు విడుదల చేసే వరకు, ఆయన్ని, భారత పురుషుల హాకీ జట్టుకు ఫిజియోథెరపిస్ట్ గా ఎం.ఓ.సి. ఆమోదించింది. అదేవిధంగా, ఎస్టోనియా, స్వీడన్, ఉక్రెయిన్‌లలో మూడు పోటీలకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అదితి భట్ కు 4.90 లక్షల రూపాయలు; స్పెయిన్ ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల కోసం లక్ష్య సేన్ కోచ్ మరియు ఫిజియోథెరపిస్ట్ కు 3 లక్షల రూపాయలు; మందుగుండు సామగ్రి మరియు మట్టితో తయారు చేసే లక్ష్యాల కోసం స్కీట్ షూటర్ గుర్జోత్ సింగ్ చేసిన అభ్యర్థనకు 2.23 లక్షల రూపాయలు విడుదల చేయడానికి కూడా మిషన్ ఒలింపిక్ సెల్ తన ఆమోదాన్ని తెలియజేసింది.
*****
(Release ID: 1781770)
Visitor Counter : 154