కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

సాంఘిక భద్రత సార్వత్రికీకరణను సాధించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 11 DEC 2021 3:38PM by PIB Hyderabad

కోవిడ్-19 సంక్షోభం నుండి కోలుకోడానికి ప్రపంచ వ్యాప్త కార్యాచరణపై త్రైపాక్షిక జాతీయ సంభాషణను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ సహకారంతో డిసెంబర్ 10న నిర్వహించింది. గ్లోబల్ కాల్ టు యాక్షన్ ఎ) సమ్మిళిత ఆర్థిక వృద్ధి మరియు ఉపాధికి సంబంధించిన నాలుగు ప్రాధాన్యతా రంగాలను చర్చించడం త్రైపాక్షిక సమావేశం లక్ష్యం; బి) కార్మికులందరికీ రక్షణ; సి) సార్వత్రిక సామాజిక రక్షణ; డి) సామాజిక సంభాషణ;. భారతదేశంలో పని మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల భవిష్యత్తు కోసం ఐఎల్ఓ శతాబ్ది ప్రకటన అమలుకు దోహదపడే కన్వర్జెన్స్ మరియు త్రైపాక్షిక చర్యలను ప్రోత్సహించడానికి ఈ సమావేశం ప్రణాళిక చేయడం జరిగింది.

 

 

 

ఈ సందర్భంగా తన ప్రధాన ఉపన్యాసంలో, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, దేశంలో విధాన రూపకల్పన మరియు అమలు కోసం త్రైపాక్షిక సామాజిక సంభాషణ, భవిష్యత్ విధానం ప్రాముఖ్యతపై ఉద్ఘాటించారు. సామర్ధ్యం పెంపుదల, నైపుణ్యాభివృద్ధి, వృత్తిపరమైన ఆవశ్యకతను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కార్మికుల భద్రత మరియు దేశం సమ్మిళిత, స్థితిస్థాపక, స్థిరమైన అభివృద్ధి కోసం గ్రీన్ ఉద్యోగాలు మరియు హరిత ఆర్థిక వ్యవస్థ వైపు పరివర్తనపై అయన మాట్లాడారు.

సాంఘిక భద్రత సార్వత్రికీకరణను సాధించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశలో తీసుకున్న ఒక ముఖ్యమైన అడుగు సాక్ష్యం-ఆధారిత విధాన రూపకల్పన.  అలాగే సామాజిక భద్రతను అందించడం కోసం అసంఘటిత రంగ కార్మికుల డేటాను సంగ్రహించడానికి ఇ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించడం అని శ్రీ యాదవ్ పేర్కొన్నారు. 
మంత్రిత్వ శాఖ లేబర్ బ్యూరో వలస కార్మికులు, గృహ కార్మికులు, రవాణా రంగ కార్మికులపై అఖిల భారత సర్వేలను చేపడుతోందని, ఇది కార్మికుల సంక్షేమం కోసం విధానాలను రూపొందించడంలో సహాయపడుతుందని మంత్రి తెలియజేశారు. ప్రభుత్వం మరియు సామాజిక భాగస్వాముల ఉమ్మడి ప్రయత్నాల ప్రాముఖ్యత, మెరుగైన పునరుద్ధరణ కోసం నిర్మాణాత్మక త్రైపాక్షిక సామాజిక సంభాషణలు కూడా ఈ సందర్బంగా ప్రస్తావించారు. 

రెండు ప్యానల్ చర్చలు కూడా నిర్వహించారు. 'యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వర్కర్స్' అనే అంశంపై జరిగిన మొదటి ప్యానెల్ చర్చకు ఎంఓఎల్ఈ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ అధ్యక్షత వహించారు, దీనిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి వినీతా సింఘాల్. మహారాష్ట్రకు చెందిన, సీనియర్ నిపుణుడు ప్రొఫెసర్ ప్రవీణ్ కుమార్ సిన్హా, డైరెక్టర్ జనరల్, ఫిక్కీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏఐఓఈ (యజమానుల ప్రతినిధి) మరియు  మనాలి షా, సేవా  జాతీయ కార్యదర్శి (వర్కర్స్ రిప్రజెంటేటివ్) ప్యానలిస్టులుగా పాల్గొన్నారు.

 

****



(Release ID: 1780626) Visitor Counter : 109