నౌకారవాణా మంత్రిత్వ శాఖ

గోవాలోని మార్ముగావో పోర్ట్ ట్రస్ట్ లో రివర్ క్రూయిజ్ సర్వీస్ను ప్రారంభించిన సోనోవాల్

Posted On: 11 DEC 2021 5:39PM by PIB Hyderabad

కేంద్ర రేవులు,  షిప్పింగ్ , జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ రోజు గోవాలోని మార్ముగావో ఓడరేవులో రివర్ క్రూయిజ్ సేవలను ప్రారంభించారు. పర్యాటకులకు గోవా సంస్కృతి , చరిత్ర అనుభూతిని పూర్తిగా అందించడానికి రివర్ క్రూయిజ్ సేవలను వెంటనే ఎఫ్ ఆర్ పి డబుల్ డెక్ పడవలతో ప్రతిపాదిత అన్ని మార్గాల్లో ప్రారంభిస్తున్నట్టు సోనోవాల్ తెలిపారు. ఇది ఒక సాధారణ వినియోగదారు సదుపాయం మాత్రమే గాక పోర్ట్ లో లభ్యం అయ్యే బెర్తింగ్ ఫెసిలిటీ నుంచి ఎవరైనా కొత్త , ఇదే తరహా సర్వీస్ ని ప్రారంభించవచ్చు. గోవాలో ఇప్పటివరకు లేని ఈ అవకాశం నది , ద్వీప క్రూసింగ్ లో కొత్త వెంచర్ లను అన్వేషించడానికి దోహదపడుతుంది. ,గోవాలో అటువంటి అన్వేషించని వెంచర్ ను పొందడానికి ఇది ఒక ప్రత్యేక అవకాశం.

 

అంతర్జాతీయ ,దేశీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన క్రూయిజ్ టెర్మినల్ బెర్త్ ను, సౌత్ వెస్ట్ పోర్ట్ లిమిటెడ్ (ఎస్ డబ్ల్యుపిఎల్) అదానీ మోర్ముగావో పోర్ట్ ట్రస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఎమ్ పిటిపిఎల్) ద్వారా నిర్వహించే పి పి పి టెర్మినల్స్ తో సహా పోర్ట్ కార్యాచరణ ప్రాంతాలను కూడా మంత్రి సందర్శించారు.అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు.

 

వాటాదారులు ,స్థానిక నిర్వాహకులతో మంత్రి సమావేశం నిర్వహించారు, ఇది మంత్రిని  నేరుగా కలసి భారతదేశ పెరుగుతున్న సముద్ర రంగంపై తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవడానికి, తీర ప్రాంత ట్రాఫిక్ ను సమర్థవంతమైన మార్గంలో మెరుగుపరచడానికి , సముద్ర విధానాలు దాని మొత్తం వృద్ధికి ఎలా దోహదపడగలవన్న అంశాలను చర్చించడానికి ఉపయోగపడింది. ఎంపిటి ఎదుగుదలకు సమస్యలు సూచనలను వినడానికి ఓడరేవులో పనిచేస్తున్న యూనియన్లు , సంఘాలతో కూడా మంత్రి చర్చలు  నిర్వహించారు.

 

ఒక సేవా పరిశ్రమగా పోర్ట్ ఎక్సిమ్ , దేశీయ రంగానికి సౌకర్యాలను అందిస్తోంది. మోర్ముగావో పోర్ట్ ప్రత్యేకమైన ఓడరేవుగా ఉండటం ,బహుళ మోడల్ కనెక్టివిటీ, అద్భుతమైన కార్గో హ్యాండ్లింగ్ సౌకర్యాలు ,అధిక ఉత్పాదకత క్రమబద్ధీకరించబడిన పరిపాలన , అంకితభావం కలిగిన శ్రామిక శక్తి ఇవన్నీ ఈ నౌకాశ్రయాన్ని భారత ఉపఖండంలో అత్యంత సమర్థవంతమైన వాటిలో ఒకటిగా మార్చే దిశగా పురోగమింప చేస్తున్నాయి.

.

గోవాలో తన ఒక రోజు పర్యటన సందర్భంగా, వాణిజ్యం ,పరిశ్రమల అవసరాలను తీర్చడానికి ,దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడటానికి ఎంపిటి సామర్థ్యాన్ని పెంచడానికి మంత్రి సంబంధిత వాటాదారులతో చర్చిస్తారు. అన్ని కనెక్టివిటీ మార్గాలు జలమార్గాలు, వాయుమార్గాలు లేదా రైల్వేలను ఒకచోట చేర్చి, వాణిజ్య ప్రయోజనం కోసం ఐక్యంగా తమ పాత్రను పోషిస్తే, లేదా సరైన సమయంలో ప్రజలకు సౌకర్యాలను అందించడం కూడా జరిగితే అప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా బలోపేతం అవుతుంది.

 

రేవులు, షిప్పింగ్,, జలమార్గాల మంత్రిత్వ శాఖ సాగర్ మాల పథకం కింద గోవా రాష్ట్రంలో ఈ క్రింది పనులు జరుగుతున్నాయి.

 

I) డర్భత్, కోర్టాలిమ్-రసైమ్, ఓల్డ్ గోవా-దివార్, సాన్వోర్డెమ్, రిబాండర్, అల్డోనా బనాస్టారిమ్, పిల్గావ్, శిరోడా వద్ద రూ.73.04 కోట్లతో తొమ్మిది కాంక్రీట్ జెట్టీల నిర్మాణం.

 

II) నాలుగు ఫ్లోటింగ్ జెట్టీలు (కెప్టెన్ ఆఫ్ పోర్ట్స్ జెట్టీ, ఓల్డ్ గోవా జెట్టీ, ఫెర్రీ పాయింట్ జెట్టీ, చపోరా జెట్టీ) రూ.9.6 కోట్ల వ్యయంతో నిర్మాణం

 

సాగర మాల నిధుల ప్రాధాన్యత ప్రధానంగా జలమార్గాల కనెక్టివిటీని మెరుగుపరచడంపై దృష్టి సారించింది. ధమని రహదారులకు చివరి మైలు కనెక్టివిటీ, తద్వారా ప్రయాణీకులు మరియు కార్గో జలమార్గాల ద్వారా పెద్ద ఎత్తున ప్రయాణించవచ్చు మరియు రహదారిపై లోడ్ ను తగ్గించవచ్చు మరియు తద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

 

ప్రయాణీకులు ,సరుకులు పెద్ద ఎత్తున జలమార్గాల గుండా వెళ్లేందుకు ,రోడ్డు మార్గాలపై భారాన్ని తగ్గించి తద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా లోతట్టు ప్రాంతాలకు జలమార్గాల కనెక్టివిటీని ,ఆర్టీరియల్ రోడ్లకు చివరి మైలు అనుసంధానాన్ని మెరుగుపరచడంపై సాగరమాల నిధులను వెచ్చించేందుకు ప్రధానంగా దృష్టి సారించారు. సాగరమాల నిధులను  గోవాలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ రోప్‌వే అభివృద్ధికి కూడా ఖర్చు  చేయాలని ఉద్దేశించారు. ,దీని కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం పురోగతిలో ఉంది.

 

32 సంవత్సరాల పురాతన నౌకాశ్రయమైన మోర్ముగావ్ పోర్ట్, సంవత్సరాలుగా క్రమంగా విస్తరిస్తోంది, దేశక సేవ లో పెరుగుతున్న వాణిజ్యం డిమాండ్లను తీరుస్తోంది.

 

 

***



(Release ID: 1780549) Visitor Counter : 156