విద్యుత్తు మంత్రిత్వ శాఖ
'గృహ విద్యుత్ వినియోగ ఆడిట్ పై సర్టిఫికేట్ కోర్స్' ను ప్రారంభించిన బీఈఈ
ఉత్సాహంగా సాగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
అంతిమంగా ఈ కార్యక్రమాల వల్ల వినియోగదారులకు విద్యుత్ బిల్లులు క్రమేణ తగ్గి, కార్బన్ ఉద్గారాల ప్రభావం కూడా తగ్గుతుంది.
Posted On:
09 DEC 2021 12:06PM by PIB Hyderabad
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) "జాతీయ ఇంధన పొదుపు వారోత్సవం: 8 నుండి 14 డిసెంబర్ 2021"లో "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" కింద 'చాల చెప్పుకోదగ్గ వారం'గా జరుపుకుంటున్న సందర్భంలో గృహ విద్యుత్ వినియోగంపై "హోమ్ ఎనర్జీ ఆడిట్ (హెచ్ఈఏ)పై సర్టిఫికేషన్ కోర్సు" ని నిన్న వర్చ్యువల్ గా ప్రారంభించింది.
హోమ్ ఎనర్జీ ఆడిట్ (హెచ్ఈఏ) అనేది ఇంట్లోని వివిధ విద్యుత్ వినియోగ పరికరాలు, ఉపకరణాల సముచితమైన ఉపయోగం, పరిమాణీకరణ, ధృవీకరణ, పర్యవేక్షణ, విశ్లేషణ, శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సాధ్యమయ్యే పరిష్కారాలు, సిఫార్సులతో కూడిన సాంకేతిక నివేదికను సమర్పిస్తుంది. శక్తి వినియోగాన్ని తగ్గించడానికి ఖర్చు-ప్రయోజన విశ్లేషణ మరియు కార్యాచరణ ప్రణాళికతో. ఇది అంతిమంగా విద్యుత్ బిల్లులు మరియు వినియోగదారుల కార్బన్ తగ్గడానికి దారి తీస్తుంది.
సర్టిఫికేషన్ కార్యక్రమం ఇంజినీరింగ్/డిప్లొమా కళాశాలల విద్యార్థులలో విద్యుత్ ఆడిట్, ఇంధన సామర్థ్యం, పరిరక్షణ ప్రాముఖ్యత, ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తుంది. ఇది ఇంధన పొదుపు, వాతావరణ మార్పులను తగ్గించడం, సుస్థిర అభివృద్ధి రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
* వినియోగదారు (ల) అవసరాల ఆధారంగా గృహ విద్యుత్ ఆడిట్‌లను నిర్వహించడానికి నిపుణులను గుర్తించడం;
* గృహ వినియోగదారులకు సంబంధిత ఎస్డిఏ సర్టిఫైడ్ హోమ్ ఎనర్జీ ఆడిట్ (ల) ద్వారా హోమ్ ఎనర్జీ ఆడిట్ నిర్వహిస్తారు;
* ఇంజినీరింగ్/డిప్లొమా/ఐటీఐ విద్యార్థులు, ఇంధన నిపుణులు, పరిశ్రమ భాగస్వాములలో ఇంధన ఆడిటింగ్, విద్యుత్ పొదుపు, ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి సమాచారం, అవగాహన పెంచడం.
ఈ చొరవకు కేరళ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సెంటర్- మెంటార్ ఎస్డిఏగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, డామన్ & డయ్యూ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, సిక్కిం, తెలంగాణ అనే ఇతర 11 ఎస్డిఏలు తమ రాష్ట్రాల్లోని సంబంధిత వాటాదారుల కోసం హెచ్ఈఏ సర్టిఫికేషన్ కోర్సును అమలు చేయడానికి తమ సుముఖతను వ్యక్తం చేశాయి. సర్టిఫికేషన్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఎస్డిఏ అర్హత పొందిన విద్యార్థులు/ సిబ్బందికి సర్టిఫికేట్‌ను అందజేస్తుంది.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సెక్రటరీ శ్రీ ఆర్.కె.రాయ్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ జాయింట్ డైరెక్టర్ శ్రీ అభిషేక్ శర్మ స్వాగత ప్రసంగం, కార్యక్రమ సంక్షిప్త ప్రసంగం చేశారు.
కేరళలోని ఎనర్జీ మేనేజ్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. హరికుమార్ “ఓవర్‌వ్యూ & వే ఫార్వర్డ్ ఫర్ సర్టిఫికేషన్ కోర్స్ ఆన్ హోమ్ ఎనర్జీ ఆడిట్” అనే అంశంపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజినీరింగ్ / డిప్లొమా కాలేజీల వైస్ ఛాన్సలర్లు, చైర్‌పర్సన్‌లు, మేనేజింగ్ డైరెక్టర్లు, ఫ్యాకల్టీలు మరియు విద్యార్థులు మరియు అన్ని స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీల (ఎస్‌డిఎ) అధికారులు కూడా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 50 కళాశాలలు/ఇన్‌స్టిట్యూట్‌ల నుండి 300 మందికి పైగా విద్యార్థులు వెబ్‌నార్‌లో పాల్గొన్నారు.
***
(Release ID: 1779884)
Visitor Counter : 227