భారత ఎన్నికల సంఘం

'ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్' (ఐడీఈఏ) సలహాదారుల బోర్డులో చేరిన మాజీ సీఈసీ శ్రీ సునీల్ అరోరా

Posted On: 07 DEC 2021 2:37PM by PIB Hyderabad

'ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్' (ఐడీఈఊ)  సలహాదారుల బోర్డులో చేరడానికి  భారత మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ శ్రీ సునీల్ అరోరాను ఐడీఈఏ సలహాదారుల బోర్డులో ఆహ్వానించబడ్డారు. శ్రీ సునీల్ అరోరా గొప్ప నాయకత్వ అనుభవాన్ని, విజ్ఞానాన్ని మరియు నైపుణ్యాలు అంతర్జాతీయ సంస్థ యొక్క పనికి గణనీయంగా తోడ్పడుతాయి.
శ్రీ సునీల్ అరోరా అనేక రకాల నేపథ్యాల నుండి ప్రముఖ వ్యక్తులు, నిపుణులైన 15-సభ్యుల సలహాదారుల బోర్డు ద్వారా ఇన్‌స్టిట్యూట్‌కు తోడ్పాటు అందుతుంది. 'ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్' (ఇంటర్నేషనల్ ఐడీఈఏ), 1995లో స్థాపించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ప్రజాస్వామ్యానికి మద్దతు ఇచ్చే లక్ష్యంతో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఏర్పాటు చేశారు. ఇది ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. అంతర్జాతీయ ఐడీఈఊ  ప్రస్తుతం 34 సభ్య దేశాలను కలిగి ఉంది, ఇందులో అన్ని ఖండాల నుండి పెద్ద మరియు చిన్న, పాత మరియు కొత్త ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి. ఐడీఈఏ
వ్యవస్థాపక సభ్యులలో భారతదేశం ఒకటి. శ్రీ సునీల్ అరోరా 2 డిసెంబర్ 2018 నుండి ఏప్రిల్ 12, 2021 వరకు భారతదేశ 23వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా వ్య‌వ‌హ‌రించారు. శ్రీ అరోరా 1 సెప్టెంబర్ 2017న భారత ఎన్నికల కమిషనర్‌గా ఈసీఐలో చేరారు.
ఈసీఐలో శ్రీ సునీల్ అరోరా 42 నెలలకు పైగా ప‌ని చేశారు. ఈయ‌న పదవీ కాలంలో భాగంగా ఉన్న.. 2019లో 17వ లోక్‌సభకు సాధారణ ఎన్నిక‌లు జ‌రిగాయి.  24 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నికలు, ద్వైవార్షిక ఎన్నికలు కూడా చాలా  విజయవంతంగా నిర్వహించ‌బ‌డినాయి. శ్రీ అరోరా, 1980 బ్యాచ్ 'ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్' (ఐఏఎస్ ) అధికారి, ఇంతకు ముందు భారత ప్రభుత్వం & రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ కీలక విభాగాలకు నాయకత్వం వహించారు. శ్రీ సునీల్ అరోరా నాయకత్వంలో ఈసీఐ తన డిజిటల్ ప్రోగ్రామ్‌కు 930 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఓటర్లతో కూడిన ఏకీకృత డేటాబేస్‌ను త‌యారు చేశారు. దేశవ్యాప్తంగా హెల్ప్‌లైన్ 1950ని సృష్టించడం ద్వారా పెద్ద తోడ్పాటును అందించింది. పౌరుల  జాగృతికి గాను సహాయపడే మరో సాంకేతిక ఆవిష్కరణ - సీవిజిల్‌ యాప్ ఒక గొప్ప సాధనంగా మారింది, ఇది మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులను నివేదించడానికి ఎన్నికలకు వెళ్లే ప్రాంతాల్లోని పౌరులను అనుమతిస్తుంది. సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగులు తమ ఇండ్ల‌ నుండి ఓటు వేయడానికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడంలో శ్రీ అరోరా చూపిన‌ వ్యక్తిగత చొరవ చాలా ప్రశంసించనీయ‌మైంది. ఎన్నికలను అందుబాటులోకి తీసుకురావడానికి మరియు అందరినీ కలుపుకొని పోయేలా హామీ ఇవ్వబడిన కనీస సౌకర్యాలక‌ల్ప‌న‌తో పాటుగా పోలింగ్ స్టేషన్‌లను గ్రౌండ్ ఫ్లోర్‌కు మార్చినట్లు కూడా ఆయన హామీ ఇచ్చారు.
ఎలక్ట్రానికల్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్లు తమ పోస్టింగ్ స్థలం నుండి ఓటు వేయడానికి ఉపయోగకరమైన సదుపాయంగా కూడా ఆవిషృత‌మైంది. ఎన్నికల నిర్వహణ సంస్థల మధ్య జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని మరింత లోతుగా మరియు బలోపేతం చేయాలని ఈసీఐ గట్టిగా విశ్వసిస్తుంది. శ్రీ సునీల్ అరోరా హయాంలో అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ (ఏడ‌బ్ల్యుఈబీ) మరియు ఫోరమ్ ఆఫ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ బాడీస్ ఆఫ్ సౌత్ ఏషియా (ఎఫ్ఈఎంబీఓఎస్ఏ) చైర్మన్‌గా పనిచేసినప్పుడు, ఈసీఐ సామర్థ్య నిర్మాణాన్ని మరింత మెరుగుపరిచేలా చేసింది. క్యుమెంటేషన్, పరిశోధన మరియు శిక్షణ కోసం న్యూ ఢిల్లీ న‌గ‌రంలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో సభ్యుని ఈఎంబీల మధ్య ఉత్తమ అభ్యాసాలు మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఏ-వెబ్‌ కేంద్రం ఏర్పాటు చేయబడింది;
                                                           

****



(Release ID: 1779676) Visitor Counter : 106