విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీఈఈ 31వ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్, నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్స్ అవార్డులను ప్రకటించింది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం నాడు అవార్డులు అందజేయనున్నారు.

దేశం తక్కువ కార్బన్ ఫూట్ప్రింట్ వ్యూహానికి దోహదపడుతున్న అన్వేషకులను, పరిశోధకులను సత్కరిస్తారు.

400 మందికిపైగా దరఖాస్తుదారులకు పలు రంగాలలో విస్తృత భాగస్వామ్యం ఉంది.

Posted On: 04 DEC 2021 1:38PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా  నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ (ఎన్ఈసీఏ) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకున్న పారిశ్రామిక యూనిట్లు, సంస్థలు  సంస్థల ప్రయత్నాలను ఈ సందర్భంగా ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న అవార్డులను అందజేస్తారు. ఈ సంవత్సరం, నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డ్స్ (ఎన్ఈఈఐఏ) పేరుతో మరో అవార్డు కూడా ఇస్తారు.  ఈ సంవత్సరం "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా ఎన్ఈసీఏ,  ఎన్ఈఈఐఏ అవార్డుల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్,  నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డ్స్ అవార్డు గ్రహీతలను 14 డిసెంబర్ 2021న జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రముఖులు సత్కరిస్తారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంతోపాటు అసాధారణ విజయాలు సాధించినందుకు  వివిధ రంగాలకు చెందిన  యూనిట్లకు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను ఇస్తారు. ఎన్ఈసీఏ (2021) అవార్డులను  పరిశ్రమ, రవాణా, భవనం, సంస్థ,  ఉపకరణాల కేటగిరీల్లో ఇస్తారు. వీటికోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. వీటిని 30 విభాగాలుగా విభజించారు. ఎన్ఈసీఏ 2021 అవార్డుల కోసం ముగింపు తేదీ వరకు మొత్తం 408 దరఖాస్తుదారులు అందాయి. 14 డిసెంబర్ 2021న నిర్వహించే నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ సందర్భంగా అవార్డులతో సత్కరిస్తారు. అవార్డు గ్రహీతలను పవర్ సెక్రటరీ అధ్యక్షతన నియమించిన అవార్డ్ కమిటీ ఖరారు చేసింది.

ఈ సంవత్సరం, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ (ఎన్ఈసీఏ) కాకుండా, విద్యుత్ మంత్రిత్వ శాఖ నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డ్ (ఎన్ఈఈఐఏ)ని కూడా ప్రారంభించింది. ఇది "ఇన్నోవేటివ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీస్"ని గుర్తించడానికి,  పరిశ్రమలు & రంగాలు తమ యూనిట్లలో వినూత్న ఇంధన సామర్థ్య ప్రయత్నాలను అభివృద్ధి చేసేలా ప్రోత్సహించడానికి, పోటీ భావాన్ని పెంచడానికి ఏర్పాటైన అవార్డు. కేటగిరీ ఏ (పరిశ్రమ, రవాణా, భవనం) & కేటగిరీ బీ (స్టూడెంట్స్ & రీసెర్చ్ స్కాలర్స్) నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు.. ఎన్ఈఈఐఏ 2021 పురస్కారాల కోసం చివరి తేదీ నాటికి మొత్తం149 మంది దరఖాస్తుదారులు అందజేశారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డ్ ..కొత్త సాంకేతికతలను, ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అవసరం. ఇంధన పొదుపు సామర్థ్యాన్ని సాధించడానికి  పరిశోధన & అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి కొత్త పద్ధతులను అమలు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది.  తక్కువ వ్యవధిలో గణనీయమైన మార్పులను తీసుకురావడానికి  కొత్త ఉపాధి అవకాశాల కోసం ఒక మార్గాన్ని సృష్టించగల సామర్థ్యం ఆవిష్కరణలకు  ఉంటుంది.

శక్తి సామర్థ్యం,  పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం వల్ల కార్బన్ ఉద్గారాల లక్ష్యాలను సాధించవచ్చు. ఇందుకోసం వివిధ భాగస్వాములు చేపట్టిన అటువంటి ప్రయత్నాలను గుర్తించాలి. పరివర్తనను వేగవంతం చేయడానికి ప్రోత్సహకాలు ఇవ్వాలి. దీని ఫలితాలు చివరికి భారతదేశం  జాతీయంగా నిర్ణయమైన చేయూతలు (ఎన్డీసీలు),  విస్తృత వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి దోహదం చేస్తాయి.

 

***

 


(Release ID: 1779670) Visitor Counter : 66