రక్షణ మంత్రిత్వ శాఖ
ఖతార్ పర్యటనకు బయలుదేరిన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్
Posted On:
08 DEC 2021 9:12AM by PIB Hyderabad
వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ లెఫ్టెనెంట్ జనరల్ సిపి మొహంతీ రెండు రోజుల పర్యటన - 08 నుంచి 09 డిసెంబర్ 2021 కోసం ఖతార్ బయలుదేరి వెళ్ళారు. ఈ పర్యటన సందర్భంగా ఖతారీ భద్రతా సంస్థల సీనియర్ అధికారులతో ఖతారీ భద్రతా సంస్థల సీనియర్ అధికారులతో బహళ సమావేశాల ద్వారా భారత్, ఖతార్ రాజ్యాల మధ్య గల అద్భుతమైన రక్షణ సహకారాన్ని వైస్ చీఫ్ మరింత ముందుకు తీసుకువెడతారు.
విసిఒఎస్ రక్షణ వ్యవహారాల ఎంఒఎస్‌ను, ఖతార్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఖతార్ ఎమిరి లాండ్ ఫోర్సెస్ (క్యూఇఎల్ ఎఫ్) కమాండర్‌ను, అహ్మద్ బిన్ మొహమ్మద్ మిలిటరీ కాలేజీ కమాండెంట్‌ను కలిసి, పరస్పర ప్రయోజనం కలిగిన అంశాలపై ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోనున్నారు. ఖతార్ ఎమిరి లాండ్ ఫోర్సెస్ కేంద్ర కార్యాలయాన్ని, అహ్మద్ బిన్ మొహమ్మద్ మిలిటరీ కాలేజీకి, అమీరి గార్డ్ కేంద్ర కార్యలయానికి కూడా వైస్ చీఫ్ వెళ్ళనున్నారు. ప్రముఖ ఖతారీ రక్షణ పరిశ్రమల సీనియర్ నాయకత్వంతో ఆయన సంభాషణలు అన్నది ఆయన పర్యటనలో కీలకాంశం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది.
***
(Release ID: 1779269)
Visitor Counter : 170