ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వాక్సిన్ల ఎగుమతి
Posted On:
07 DEC 2021 3:49PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 150 దేశాలకు పైగా కోవిడ్ -19 సంబంధిత మందులను, ఇతర సహాయాన్ని భారత్ సరఫరా చేసింది.
వాక్సిన్ మైత్రి కార్యక్రమం 2021లో ప్రారంభమైనప్పటి నుంచీ, భారతదేశం 29 నవంబర్ 2021వరకు గ్రాంట్, వాణిజ్య ఎగుమతి లేదా కోవాక్స్ ద్వారా 94 దేశాలకు , 2 ఐరాస సంస్థలకు 723.435 డోసుల కోవిడ్ వాక్సిన్ ను సరఫరా చేసింది.
రెండవ వేవ్ సమయంలో కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో, 50కు పైగా దేశాల నుంచి కోవిడ్ సంబంధిత పరికరాలు, మందుల రూపంలో మద్దతు లభించింది. ఇందులో విదేశీ ప్రభుత్వాలు సహా, ప్రైవేటు కంపెనీలు, విదేశాలలోని భారతీయ అసోసియేషన్లు, తదితరాలు ఉన్నాయి.
ఈ విషయాలను రాజ్యసభలో మంగళవారం నాడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1778947)
Visitor Counter : 165