పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రయాణ సౌలభ్యం రూపొందించిన ఎయిర్ సువిధ పోర్టల్‌ వినియోగాన్ని తప్పనిసరి చేసిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ


అంతర్జాతీయ ప్రయాణీకులకు అవాంతరాలు లేని, క్యూ లేని మరియు సౌకర్యవంతమైన విమాన ప్రయాణాన్ని అందించనున్న ఎయిర్ సువిధ పోర్టల్

2021 డిసెంబర్ 1 నుంచి 05 వ తేదీ వరకు ఎయిర్ సువిధ పోర్టల్ వినియోగించుకున్న 2,51,210 మంది ప్రయాణికులు

2020 ఆగస్టు నుంచి ఇంతవరకు ఎయిర్ సువిధ పోర్టల్ సేవలు పొందిన కోటికి పైగా ప్రయాణికులు

Posted On: 07 DEC 2021 12:21PM by PIB Hyderabad

భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు సాఫీగా ప్రయాణించేలా చూడడానికి  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  ఎయిర్ సువిధ పోర్టల్‌ వినియోగాన్ని   తప్పనిసరి చేశాయి. మానవ ప్రమేయం లేకుండా వివరాలను ప్రకటించడానికి వీలుగా ఎయిర్ సువిధ పోర్టల్‌ ని రూపొందించారు. 2020 ఆగస్టు నుంచి పనిచేస్తున్న ఎయిర్ సువిధ పోర్టల్‌ లో 2021 నవంబర్ లో అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం జారీ అయిన నూతన మార్గదర్శకాలను కూడా పొందుపరచడం జరిగింది. భారతదేశానికి విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల కోసం సౌకర్యం  ఎయిర్ సువిధ పోర్టల్‌ రూపొందింది. అంతర్జాతీయ ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలన్న లక్ష్యంతో   పౌర విమానయాన శాఖ  ఈ పోర్టల్ ను అభివృద్ధి చేసింది. 

దీని ద్వారా ప్రయాణికులు తమ పర్యటన వివరాలు, బస, ఆర్టీ పీసీఆర్ , టీకా లాంటి వివరాలను అందించవచ్చు. దీనివల్ల ప్రయాణికులు వివరాలను అధికారులు  సులువుగా తెలుసుకోగలుగుతారు. భారతదేశానికి విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు అవాంతరాలు లేనిక్యూ లేని మరియు సౌకర్యవంతమైన విమాన ప్రయాణాన్నిఅందించాలన్న లక్ష్యంతోఎయిర్ సువిధ పోర్టల్‌ ని రూపొందించారు. 2021 నవంబర్ 30 వ తేదీన జారీ అయిన మార్గదర్శకాలను దీనిలో పొందుపరచడంతో 2021 డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి అయిదవ తేదీ వరకు పోర్టల్ తో 2,51,210 మంది ప్రయాణికులు ప్రయోజనం పొందారు. 2020 ఆగస్టు లో పోర్టల్ ప్రారంభం అయ్యింది. దాదాపు కోటికి పైగా విదేశీ ప్రయాణికులు పోర్టల్ సేవలు వినియోగించుకున్నారు.   

కోవిడ్-19 ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్న ఉద్దేశంతో ఎయిర్ సువిధ పోర్టల్ లో కల్పించిన మినహాయింపు ఫారం లను ఉపసంహరించడం జరిగింది. విదేశాల నుంచి భారతదేశానికి వస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికుడు తన వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.  ప్రయాణం ప్రారంభించే ముందు తమ ప్రస్తుత ఆరోగ్య స్థితి తో పాటు  పాస్‌పోర్ట్ కాపీబయలుదేరిన 72 గంటలలోపు నిర్వహించిన పరీక్షల  పీసీఆర్     నెగిటివ్ సర్టిఫికెట్, టీకా సర్టిఫికేట్ ను ఎయిర్ సువిధ పోర్టల్ లో తప్పనిసరిగా  పొందుపరచాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ కోసం ఈ-మెయిల్ ద్వారా అందిన సమాచార నకలు సరిపోతుంది. దీనిని  విమానాశ్రయ ప్రజారోగ్య కేంద్రంలో తనిఖీ చేస్తారు. 

ప్రయాణీకులకు మరియు ఆరోగ్య/రాష్ట్ర అధికారుల సౌకర్యం కోసం ఎయిర్ సువిధ లో పొందుపరచిన తాజా అంశాలు 

·         'రిస్క్‌లో ఉన్నదేశాల నుంచి  అన్ని దరఖాస్తులు   మరియు రెడ్ బ్యాండ్‌తో గుర్తించబడతాయి. మిగిలిన  దరఖాస్తులు  ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీనివల్ల వచ్చిన ప్రయాణీకులను సులువుగా వేరు చేసి పరిశీలించడానికి వీలవుతుంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితాను    అప్‌డేట్ చేయబడింది.

·         'రిస్క్‌లో ఉన్నఅప్లికేషన్‌లను గుర్తించడానికి   గత 14 రోజులలో సందర్శించిన దేశాల వివరాలను  కూడా అప్లికేషన్ పరిగణనలోకి తీసుకుంటుంది.  బహుళ-ఎంపిక డ్రాప్-డౌన్ ఎంపికను ప్రామాణికం చేసే విధంగా ఇది  రూపొందించబడింది.

·         పోర్టల్ ప్రారంభంలో తాజా మార్గదర్శకాలతో  పాటు తరచుగా అడిగే ప్రశ్నల జాబితా మరియు కస్టమర్ కేర్ లింక్‌ని పొందుపరచడం జరిగింది. 

·         'రిస్క్‌లో ఉన్నదేశాల నుంచి వస్తున్న  ప్రయాణీకులు వచ్చిన వెంటనే  పరీక్ష చేయించుకోవడానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎస్ డీ ఎఫ్ ను సమర్పించిన తర్వాత  ప్రయాణీకులకు సంబంధిత పరీక్ష సౌకర్యానికి లింక్ అందించబడుతుంది.

రిస్క్ లో ఉన్న దేశాల నుంచి/ మీదుగా వస్తున్న అంతర్జాతీయ  ప్రయాణీకులు ఈ కింది చర్యలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. 

• ఎయిర్ సువిధ పోర్టల్‌లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాలి 

•  ఆర్టీ పీసీఆర్ నెగటివ్   నివేదికను అప్‌లోడ్ చేయాలి  (ప్రయాణానికి ముందు 72 గంటల లోపు నిర్వహించబడుతుంది)

• చేరుకునే విమానాశ్రయంలో పోస్ట్ రాక కోవిడ్-19 పరీక్ష (స్వీయ చెల్లింపు)

• 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్,

• 8వ రోజున తిరిగి పరీక్ష చేయించుకోవాలి. ఫలితం నెగిటివ్ గా  ఉంటే, తదుపరి రోజుల పాటు స్వీయ-ఆరోగ్య పర్యవేక్షణలో ఉండాలి  

ఈ కింది దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు  కొన్ని అదనపు నిబంధనలను (రిస్క్ లో ఉన్న దేశాల నుంచి వచ్చే వారు ప్రయాణానికి ముందు పరీక్ష )  పాటించాల్సి ఉంటుంది.

1. యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా యూరప్‌లోని దేశాలు

2. దక్షిణాఫ్రికా

3. బ్రెజిల్

4. బోట్స్వానా

5. చైనా

6. ఘనా

7. మారిషస్

8. న్యూజిలాండ్

9. జింబాబ్వే

10. సింగపూర్

11. టాంజానియా

12. హాంకాంగ్

13. ఇజ్రాయెల్

ఎయిర్ సువిధ పోర్టల్ లింక్: https://www.newdelhiairport.in/airsuvidha/apho-registration

మరిన్ని వివరాల కోసం  https://bit.ly/NewTravelGuidelinesOct2021సందర్శించండి

***


(Release ID: 1778810) Visitor Counter : 213