ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
07 DEC 2021 9:18AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 128.76 కోట్ల డోసులను అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 95,014; ఇది 554 రోజుల కనిష్ట స్థాయి.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.27% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 98.36% కు చేరింది.
గత 24 గంటల్లో 10,004 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,40,79,612 కు పెరిగింది.
గత 24 గంటల్లో 6,822 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు (0.63%) గత 64 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు (0.78%) గత 23 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 64.94 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1778790)
Visitor Counter : 153