ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశంలో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం మరొక ముఖ్యమైన మైలురాయి ని దాటినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
06 DEC 2021 10:35AM by PIB Hyderabad
భారతదేశం లో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం మరొక ముఖ్యమైన మైలురాయి ని దాటినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశం జనాభా లో అర్హత కలిగిన వారిలో 50 శాతానికి పైగా టీకామందు ను ఇప్పించడం పూర్తి అయింది.
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానం గా తాను ఒక ట్వీట్ లో –
‘‘భారతదేశం లో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం లో మరొక ముఖ్యమైనటువంటి మైలురాయి ని అధిగమించడం జరిగింది. కోవిడ్ -19 కి వ్యతిరేకం గా సాగుతున్న పోరాటాన్ని పటిష్టపరచడం లో ఈ వేగ గతి ని ఇలాగే కొనసాగిస్తూ ముందుకు పోవడం ముఖ్యం.
అవును మరి, ముఖాని కి మాస్క్ ను పెట్టుకోవడం, ఒక వ్యక్తి కి మరొక వ్యక్తి కి నడుమ సురక్షిత దూరాన్ని పాటించడం సహా కోవిడ్ -19 సంబంధి ఇతర ప్రోటోకాల్స్ అన్నింటిని అనుసరిస్తూ ఉండవలసిందే.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1778374)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam