ప్రధాన మంత్రి కార్యాలయం
జవాద్ చక్రవాతాన్నిఎదుర్కోవడం కోసం సన్నద్ధత ను సమీక్షించడం కోసం జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికిఅధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
ప్రజలను సురక్షితం గా తరలించడానికి గాను అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలంటూ అధికారులనుఆదేశించిన ప్రధాన మంత్రి
అన్నిఅత్యవసర సేవల నిర్వహణ కు మరియు అంతరాయం గనక ఏర్పడే పక్షం లో ఆయా సేవల ను త్వరగాపునరుద్ధరించేందుకు జాగ్రత వహించవలసింది: ప్రధాన మంత్రి
చక్రవాతంప్రభావానికి వ్యతిరేకం గా ముందుచూపు తో నడుచుకోవడానికి సంబంధిత మంత్రిత్వ శాఖ లు మరియుఏజెన్సీ లు కలసి పనిచేస్తున్నాయి
పడవలు,చెట్ల ను నరికివేసే యంత్రాలు, దూరసంచార సామగ్రి వగైరాల తో కూడిన 29 బృందాల ను ఎన్డిఆర్ఎఫ్ ఈసరికే మోహరించింది; ఇంకొక 33 జట్లు తయారు గా ఉన్నాయి
సహాయం,వెతుకులాట ఇంకా రక్షణ కార్యకలాపాల కై నౌకల ను మరియు హెలికాప్టర్ లను భారతీయ కోస్తాతీర రక్షకదళం, నౌకాదళం రంగం లోకి దింపాయి
రంగ ప్రవేశంచేయడం కోసం వాయు సేన మరియు ఇంజీనియర్ టాస్క్ ఫోర్స్ యూనిట్ లు ఎదురుచూస్తున్నాయి
తూర్పుకోస్తాతీరం వెంబడి విపత్తు సహాయక బృందాలు మరియు వైద్య చికిత్స బృందాలు స్థిరం గాఉన్నాయి
Posted On:
02 DEC 2021 3:39PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సైక్లోన్ జవాద్ ఏర్పడే అవకాశం వల్ల తలెత్తే స్థితి ని ఎదుర్కోవడం కోసం రాష్ట్రాలు, కేంద్రం లోని మంత్రిత్వ శాఖలు మరియు సంబంధిత ఏజెన్సీస్ సన్నద్ధం అయ్యాయా అనేది సమీక్షించడానికి గాను ఈ రోజు న జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.
ప్రజల ను వారు నివసిస్తున్న చోట్ల నుంచి సురక్షితం గా ఖాళీ చేయించడానికై సాధ్యమైన అన్ని చర్యల ను తీసుకోవాలని అధికారుల ను ప్రధాన మంత్రి ఆదేశించారు. అలాగే విద్యుత్తు, టెలికమ్యూనికేశన్స్, ఆరోగ్యం, తాగునీరు వగైరా అత్యవసర సేవలు అన్నిటి ని సంబాళించేందుకు కూడా పూచీపడాలని, ఏదైనా అంతరాయం ఉత్పన్నం అయ్యే పక్షం లో ఆయా సేవల ను తక్షణం పూర్వస్థితి కి తీసుకురావాలని కూడా ఆయన ఆదేశాలిచ్చారు.
అత్యవసరమైనటువంటి మందులను, ఇతర సరఫరాల ను సరిపడేంత గా నిలవ చేసే జాగ్రతలు తీసుకోవలసిందిగాను, వాటిని నిరంతరాయంగా చేరేవేసేందుకు ప్రణాళిక ను రూపొందించవలసిందిగాను వారికి ఆయన ఆదేశాలు ఇచ్చారు. కంట్రోల్ రూము లు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండాలి అని కూడా ఆయన ఆదేశించారు.
బంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడన ప్రాంతం ముమ్మరించి సైక్లోన్ జవాద్ రూపం లోకి మారవచ్చని, అది 2021 డిసెంబర్ 4వ తేదీ శనివారం ఉదయం వేళ కు ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రాంత కోస్తాతీరం మరియు ఒడిశా ను సమీపించవచ్చని, అప్పటికి గంట కు 100 కిలోమీటర్ వేగం తో గాలి వీయవచ్చని భారతీయ వాతావరణ శాస్త్ర విభాగం (ఐఎమ్ డి) సమాచారాన్ని ఇచ్చింది. దీని వల్ల ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, ఇంకా పశ్చిమ బంగాల్ లలోని కోస్తాతీర ప్రాంత జిల్లాల లో భారీ వర్షపాతం ఉండవచ్చు. సంబంధిత రాష్ట్రాలన్నిటి కి ఐఎమ్ డి ముందుజాగ్రత ల తాలూకు తాజా లఘు వివరణ పత్రికల ను క్రమం తప్పక జారీ చేస్తున్నది.
స్థితి ని మరియు సన్నాహక చర్యలను గురించి కేబినెట్ సెక్రట్రి కోస్తా తీర రాష్ట్రాలన్నిటి ప్రధాన కార్యదర్శులతోను, సంబంధిత సెంట్రల్ మినిస్ట్రీస్ / ఏజెన్సీస్ తోను సమీక్ష జరిపారు.
హోం అఫైర్స్ మంత్రిత్వ శాఖ (ఎమ్ హెచ్ ఎ) స్థితి ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో/ కేంద్ర పాలిత ప్రాంతాలతో మరియు సెంట్రల్ ఏజెన్సీస్ తో సంప్రదింపులు జరుపుతున్నది. ఒకటో విడత ఎస్ డిఆర్ఎఫ్ ను ముందస్తు గా అన్ని రాష్ట్రాల కు ఎమ్ హెచ్ ఎ ఇప్పటికే విడుదల చేసింది. పడవ లు, చెట్ల ను నరికివేసే యంత్రాలు, దూరసంచార సామగ్రి వగైరాల తో కూడిన 29 బృందాల ను ఎన్ డిఆర్ఎఫ్ కొన్ని ప్రాంతాల లో మోహరించింది; అంతే కాక మరో 33 బృందాల ను సన్నద్ధపరచింది.
సహాయం, వెతుకులాట, రక్షణ సంబంధి కార్యకలాపాల కోసమని భారతీయ కోస్తా తీర రక్షక దళం, ఇంకా నౌకాదళం ఓడల ను మరియు హెలికాప్టర్ లను మోహరించాయి. పడవలతోను, రక్షణ సంబంధి సామగ్రితోను రంగంలోకి దిగడానికి వాయుసేన మరియు సైన్యం లోని ఇంజీనియర్ టాస్క్ ఫోర్స్ యూనిట్ లు సన్నద్ధం అయ్యాయి. నిఘా విమానాలు, హెలికాప్టర్ లు కోస్తాతీరం వెంబడి కాపు కాస్తున్నాయి. తూర్పు కోస్తా పొడవునా పలు స్థానాల లో విపత్తు సహాయక బృందాలు, వైద్యచికిత్స బృందాలు నిరీక్షిస్తున్నాయి.
అత్యవసర స్థితి లో ప్రతిస్పందించే వ్యవస్థల ను విద్యుత్తు మంత్రిత్వ శాఖ క్రియాశీలపరచింది. విద్యుత్తు సరఫరా ను వెంటనే పునరుద్ధరించడం కోసం ట్రాన్స్ ఫార్మర్ స్, డిజి సెట్స్ మొదలైన సామగ్రి ని తయారు గా ఉంచుతున్నది. కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ అన్ని టెలికమ్ టవర్స్ ను, ఎక్స్ చేంజ్ లను నిరంతరం పరిశీలనలో ఉంచుతున్నది. టెలికమ్ నెట్ వర్క్ స్తంభిస్తే గనక తత్సంబంధిత పునరుద్ధరణ పనుల ను చేపట్టడం కోసం పూర్తి గా సన్నద్ధమైంది. ప్రభావానికి లోను కాగల రాష్ట్రాల కు, కేంద్ర పాలిత ప్రాంతాల కు ఆరోగ్య రంగ సంబంధి సన్నద్ధత మరియు కోవిడ్ బాధిత ప్రాంతాల లో ప్రతిస్పందన ల విషయం లో సూచనల, సలహాల పత్రాన్ని ఆరోగ్యం- కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
ఓడరేవులు, శిపింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ అన్ని శిపింగ్ వెసల్స్ ను కూడగట్టడానికి చర్యలను తీసుకొంది; అత్యవసర స్థితి లో ఉపయోగపడేందుకు కొన్ని ఓడల ను కూడాను మోహరించింది. కోస్తాతీరానికి దగ్గరలో నెలకొన్న కెమికల్, పెట్రోకెమికల్ యూనిట్ ల వంటి పారిశ్రామిక సంస్థల ను అప్రమత్తంగా ఉంచవలసిందిగా రాష్ట్రాల ను సైతం కోరడమైంది.
హాని పొందగల ప్రదేశాల నుంచి ప్రజల ను సురక్షిత చోటుల కు తరలించడం కోసం స్టేట్ ఏజెన్సీల కు ఎన్ డిఆర్ఎఫ్ సాయపడుతున్నది. అంతేకాకుండా చక్రవాత స్థితి ని ఎలా ఎదుర్కోవచ్చో అనే విషయం పై సాముదాయక జాగృతి ప్రచార కార్యక్రమాలను కూడా అదే పని గా నిర్వహిస్తున్నది.
ప్రధాన మంత్రి కి ముఖ్య సలహాదారు, కేబినెట్ సెక్రట్రి, హోం సెక్రట్రి, ఎన్ డిఆర్ఎఫ్ డిజి లతో పాటు ఐఎమ్ డి డిజి కూడా ఈ సమావేశాని కి హాజరు అయ్యారు.
***
(Release ID: 1777377)
Visitor Counter : 258
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam