ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
02 DEC 2021 9:08AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 124.96 కోట్ల డోసులను అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 99,763.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.29% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 98.35% కు చేరింది.
గత 24 గంటల్లో 8,548 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,40,37,054 కు పెరిగింది.
గత 24 గంటల్లో 9,765 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు (0.89%) గత 59 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు (0.85%) గత 18 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 64.35 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1777197)
Visitor Counter : 180