గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికలాంగులకు పెన్షన్, ఎక్స్.గ్రేషియా చెల్లింపు

Posted On: 01 DEC 2021 2:56PM by PIB Hyderabad

  ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పి.ఎం.జి.కె.వై.) పథకం కింద నిరుపేద ప్రజలకు సహాయ ప్యాకేజీ కింద రూ. లక్షా 70వేల కోట్లను ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జీవనోపాధి దెబ్బతిన్నవారి సహాయార్థం ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల/దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న జాతీయ సామాజిక సహాయ కార్యక్రమ (ఎన్.ఎస్.ఎ.పి.) లబ్ధిదారులకు ఈ ప్యాకేజీ కింద వెయ్యిరూపాయల చొప్పున (రూ. 500చొప్పున రెండు విడతలుగా) అందించేందుకు ఈ ప్యాకేజీని రూపొందించారు. వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రెండు విడతలుగా 2020 ఏప్రిల్, మే నెలల్లో మొత్తం రూ. 2,814.50కోట్లను విడుదల చేశారు. పి.ఎం.జి.కె.వై. కింద, ఎన్.ఎస్.ఎ.పి. పథకాల లబ్ధదారులైన 2.82కోట్లమందికి ఎక్స్.గ్రేషియాగా చెల్లించడానికి ఈ మొత్తాన్ని విడుదల చేశారు.  ఇందిరాగాంధీ జాతీయ అంగవైకల్య పెన్షన్ పథకం (ఐ.జి.ఎన్.డి.పి.ఎస్.) కింద 7.73 లక్షలమంది వికలాంగులైన లబ్ధిదారులకు రూ. 77.73కోట్లను ఈ ప్యాకేజీలో భాగంగానే విడుదల చేశారు.

  ఐ.జి.ఎన్.డి.పి.ఎస్. పథకం కింద పెన్షన్ ప్రయోజనం పొందిన లబ్ధిదారులకు సంబంధించి రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల వారీ వివరాలు ఈ దిగువన ఇచ్చిన అనుబంధంలో పొందుపరచబడి ఉన్నాయి.

  ఎన్.ఎస్.ఎ.పి. మార్గదర్శక సూత్రాలను అనుసరించి, తీవ్రమైన అంగవైకల్యం కలిగిఉండి, దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు చెందిన 18-79 సంవత్సరాల వ్యక్తులకు ఐ.జి.ఎన్.డి.పి.ఎస్. పథకం కింద పెన్షన్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు.

 

2021-22వ ఆర్థిక సంవత్సరానికి ఐ.జి.ఎన్.డి.పి.ఎస్. లబ్ధిదారుల వివరాలు

క్రమ సంఖ్య

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు

లబ్ధిదారుల సంఖ్య

1

ఆంధ్రప్రదేశ్

24,413

2

బీహార్

1,26,156

3

చత్తీస్.గఢ్

31,953

4

గోవా

466

5

గుజరాత్

20,557

6

హర్యానా

11,537

7

హిమాచల్ ప్రదేశ్

853

8

జార్ఖండ్

26,496

9

కర్ణాటక

43,639

10

కేరళ

29,935

11

మధ్యప్రదేశ్

99,924

12

మహారాష్ట్ర

8,870

13

ఒడిశా

85,805

14

పంజాబ్

5,656

15

రాజస్థాన్

30,502

16

తమిళనాడు

63,261

17

తెలంగాణ

17,448

18

ఉత్తర ప్రదేశ్

75,280

19

ఉత్తరాఖండ్

2,880

20

పశ్చిమ బెంగాల్

62,049

 

మొత్తం

7,67,680

ఈశాన్య రాష్ట్రాలు

 

 

21

అరుణాచల్ ప్రదేశ్

112

22

అస్సాం

18,916

23

మణిపూర్

1,007

24

మేఘాలయ

969

25

మిజోరాం

400

26

నాగాలాండ్

960

27

సిక్కిం

457

28

త్రిపుర

1,769

 

మొత్తం

24,590

కేంద్రపాలిత ప్రాంతాలు

 

 

29

అండమాన్ నికోబార్ దీవులు

2

30

చండీగఢ్

100

31

దాద్రా-నాగర్ హవేళీ,

డామన్-డయ్యూ

254

32

జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ

6,321

33

జమ్ము-కాశ్మీర్

2,426

34

లడఖ్

150

35

లక్షద్వీప్

51

36

పుదుచ్చేరి

1,259

 

మొత్తం

10,563

 

పూర్తి మొత్తం.

8,02,833

 

ఈ సమాచారాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కుమారి సాధ్వీ నిరంజన్ జ్యోతి నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో లోక్.సభకు తెలిపారు. ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వ సమాధానంలో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.

****


(Release ID: 1777023) Visitor Counter : 2188