శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశంలో SARS-CoV-2 డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా ChAdOx1 nCoV-19 (కోవీషీల్డ్) వ్యాక్సిన్ యొక్క ప్రభావం
Posted On:
30 NOV 2021 12:20PM by PIB Hyderabad
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్లకు పైగా మరణాలకు కారణమైన SARS-CoV-2 200 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసింది. SARS-CoV-2 వైరస్ యొక్క ఉత్పరివర్తన రూపాల్లో పెరుగుదల వ్యాక్సిన్ ప్రభావం గురించి ఆందోళనలకు దారి తీసింది. డెల్టా (B.1.617.2) రకం భారతదేశంలో ఇప్పటివరకు ఉన్న ప్రధాన జాతి. భారతదేశంలో వ్యాక్సిన్ కార్యక్రమంలో ఎక్కువగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ (ChAdOx1 nCoV-19) ఉపయోగిస్తున్నారు.
ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (THSTI) నేతృత్వంలోని భారతీయ పరిశోధకుల బహుళ సంస్థాగత బృందం భారతదేశంలో ఏప్రిల్ మరియు మే, 2021 మధ్య కాలంలో SARS-CoV-2 ఇన్ఫెక్షన్ పెరుగుదల సమయంలో కోవీషీల్డ్ వ్యాక్సిన్ వాస్తవ ప్రపంచం యొక్క ప్రభావాన్ని అంచనా వేసింది. ఈ రక్షణ ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ఆరోగ్యకరమైన టీకాలు వేసిన వ్యక్తుల్లో వేరియంట్‌లకు వ్యతిరేకంగా న్యూట్రలైజింగ్ యాక్టివిటీ మరియ కణస్థాయి రోగనిరోధక ప్రతిస్పందనలను కూడా అంచనా వేశారు.
"ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్" జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో 2379 ధృవీకరించబడిన SARS-CoV-2 ఇన్‌ఫెక్షన్ కేసులలో, 1981 నియంత్రించబడిన కేసుల కిందకు రాగా వాటి మధ్య పోలికను కలిగి ఉంది. పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులలో SARS-CoV-2 సంక్రమణకు వ్యతిరేకంగా టీకా ప్రభావం 63% ఉన్నట్లు కనుగొనబడింది. మితమైన-తీవ్రమైన వ్యాధికి వ్యతిరేకంగా పూర్తి టీకా యొక్క ప్రభావం 81% వద్ద చాలా ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా, డెల్టా వేరియంట్ మరియు వైల్డ్-టైప్ SARS-CoV-2 రెండింటికి వ్యతిరేకంగా స్పైక్-నిర్దిష్ట T-కణ ప్రతిస్పందనలు సంరక్షించబడిందని శాస్త్రవేత్తలు గమనించారు. ఇటువంటి సెల్యులార్ రోగనిరోధక రక్షణ వైరస్ వైవిధ్యాలకు వ్యతిరేకంగా క్షీణిస్తున్న హ్యూమరల్ రోగనిరోధక శక్తిని భర్తీ చేస్తుంది మరియు మోస్తరు నుండి తీవ్రమైన వ్యాధికి కారణమై; ఆసుపత్రిలో చేరవలసిన అవసరాన్ని నివారిస్తుంది. ఈ అధ్యయనం వాస్తవ ప్రపంచ వ్యాక్సిన్ ప్రభావం మరియు టీకాకు రోగనిరోధక ప్రతిస్పందనపై సమగ్ర డేటాను అందిస్తుంది, ఇది పాలసీకి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుంది.
***
(Release ID: 1776556)
Visitor Counter : 192