ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎన్ సిసి దినం నాడుఎన్ సిసి కేడెట్స్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ఎన్ సిసి పూర్వవిద్యార్థుల సంఘాన్ని వర్ధిల్ల జేయవలసిందంటూ ఎన్ సిసి పూర్వ విద్యార్థుల కువిజ్ఞప్తి చేశారు

Posted On: 28 NOV 2021 5:12PM by PIB Hyderabad

ఎన్ సిసి దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్ సిసి కేడెట్స్ కు అభినందనలు తెలిపారు. భారతదేశం అంతటా ఉన్నటువంటి ఎన్ సిసి పూర్వ విద్యార్థులు ఎన్ సిసి పూర్వ విద్యార్థుల సంఘం యొక్క కార్యకలాపాల లో పాలుపంచుకొంటూ ఉండాలని, అంతేకాకుండా, వారి సమర్ధన ద్వారా ఆ సంఘాన్ని వర్ధిల్లేటట్లు చేయాలని శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘ఎన్ సిసి దినం సందర్భం లో ఇవే అభినందనలు. ఐకమత్యం మరియు క్రమశిక్షణ’.. ఈ ధ్యేయం ద్వారా ప్రేరణ ను పొందిన ఎన్ సిసి భారతదేశ యువతీ యువకుల కు వారి సిసలైన సామర్ధ్యాన్ని తెలుసుకోవడం కోసం, అలాగే దేశ నిర్మాణాని కి తోడ్పడం కోసం ఒక మహత్తరమైన అనుభవాన్ని ప్రసాదిస్తుంది. ఈ సంవత్సరం జనవరి లో జరిగిన ఎన్ సిసి ర్యాలీ లో నేను ఇచ్చిన ఉపన్యాసం ఇదుగో...

 

 

 

కొద్ది రోజుల క్రితం ‘రాష్ట్ర రక్షా సంపర్పణ్ పర్వ్’ ఝాంసీ లో జరిగినప్పుడు ఎన్ సిసి పూర్వ విద్యార్థుల సంఘం లో ఒకటో సభ్యుని గా నమోదు అయినటువంటి గౌరవం నాకు లభించింది. పూర్వ విద్యార్థుల సంఘాన్ని స్థాపించడం, ఎన్ సిసి తో అనుబంధం కలిగినటువంటి వారందరినీ ఒక చోటు కు తీసుకు వచ్చేటందుకు జరిగిన ఒక అభినందనీయమైనటువంటి ప్రయాస అని చెప్పాలి.

 

***


(Release ID: 1776119) Visitor Counter : 168