రక్షణ మంత్రిత్వ శాఖ
NCC తన 73వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది;
జాతీయ యుద్ధ స్మారక స్థలి వద్ద అమర వీరులకు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన జాతీయ బాలభట సంఘం (NCC) డైరెక్టర్ జనరల్
प्रविष्टि तिथि:
27 NOV 2021 2:27PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు
COVID-19 మహమ్మారి నియంత్రణకై కేటాయించిన మిషన్- ఎక్సర్సైజ్-యోగ్దాన్ ను NCC సమర్థవంతంగా అమలు చేసింది
‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ ‘ఫిట్ ఇండియా’ వంటి కార్యకలాపాలలో క్యాడెట్‌లు సహ NCC అధికారులు దేశానికే ఉదాహరణగా నిలిచారు.
సరిహద్దు జిల్లాలు, తీర ప్రాంత తాలూకాలలో లక్ష మంది క్యాడెట్‌లను అదనంగా పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం విజయవంతమైంది
NCC పూర్వ విద్యార్థుల సంఘం నవంబర్ 19, 2021న ఝాన్సీలో ప్రారంభించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సంస్థ ఐన జాతీయ బాలభట సంఘం లో మొదటి పూర్వ విద్యార్థిగా ప్రధాన మంత్రి చేరగా రక్షణ మంత్రి రెండవవ్యక్తి.
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), నవంబర్ 28, 2021న తన 73వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. నవంబర్ 27, 2021న న్యూ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఈ గంభీరమైన సందర్భాన్ని పురస్కరించుకుని, మొత్తం NCC సోదర వర్గం తరపున డైరెక్టర్ జనరల్ NCC, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్ అమరులైన వీరులకు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
కవాతులు, రక్తదాన శిబిరాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే క్యాడెట్‌లతో NCC వ్యవస్థాపకదినం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గడిచిన సంవత్సరంలో, COVID-19 మహమ్మారి వల్లఉత్పన్నమైన ఇబ్బందులను NCC విజయవంతంగా అధిగమించదమే కాకుండా కేటాయించిన లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసింది. మహమ్మారి కోవిడ్ నియంత్రణలో యోగదాన్ కార్యక్రమంలో వివిధ కార్యక్రమాల నిర్వహణలో క్యాడెట్‌ల సహకారానికి దేశమంతటా ప్రశంసలు లభించాయి.
‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ ‘ఫిట్ ఇండియా’ వంటి కార్యకలాపాలలో పాల్గొన్న క్యాడెట్లు మరియు అసోసియేట్ NCC అధికారులు నాయకత్వానికి ఉదాహరణగా నిలచారు. క్యాడెట్‌లు 'స్వచ్ఛతా అభియాన్', 'మెగా పొల్యూషన్ పఖ్వాడా'లో హృదయపూర్వకంగా పాల్గొన్నారు. 'డిజిటల్ అక్షరాస్యత', 'అంతర్జాతీయ యోగా దినోత్సవం', 'ట్రీ ప్లాంటేషన్' ఇంకా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ వంటి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారు.
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ పరిధిని దేశం సరిహద్దులు తీర ప్రాంతాలకు విస్తరించడానికి ఆగస్టు 15, 2020న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక పథకాన్ని ప్రకటించారు. ఆర్మీ, నేవీ యొక్క మూడు స్ట్రీమ్‌లలో మొత్తం లక్ష అదనపు క్యాడెట్ బలం పెరిగింది.
సరిహద్దు జిల్లాలు, తీర ప్రాంత తాలూకాలపై వైమానిక దళం దృష్టి సారించడం పూర్తయింది. ఈ సరిహద్దు తీర ప్రాంత జిల్లాల్లో ఎన్‌సిసి విస్తరణ వల్ల ఖచ్చితంగా ఈ ప్రాంత యువతను సాయుధ దళాల్లో చేరడానికి ఈ చర్య ప్రేరేపిస్తుంది. మన యువతలో సౌభ్రాతృత్వం, క్రమశిక్షణ, జాతీయ ఐక్యత, నిస్వార్థ సేవ విలువలు పెంపొందించడంలో దేశం NCC నిర్వహించే పాత్ర మీద ఆశావహంగా ఉంది.
నవంబర్ 19, 2021న ఝాన్సీలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి పూర్వ విద్యార్థుల సంఘాన్ని ప్రారంభించడం ఎన్‌సిసికి మరో హంగును చేర్చింది. శ్రీ నరేంద్ర మోదీ ఈ ప్రతిష్టాత్మక పూర్వ విద్యార్థుల సంఘం మొదటి సభ్యునిగా చేరారు. రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సంఘంలో రెండవ సభ్యులు.
NCC లో సేవలందించిన మాజీ , ప్రస్తుత క్యాడెట్‌లు అందరినీ ఈ సంఘం ఒకే తాటిపైకి తీసుకువస్తుంది. నిర్దేశించిన లక్ష్యసాధనకు లక్ష్యాలను మెరుగుపరచే ఉమ్మడి ప్రయోజనం కోసం సమాజ అభివృద్ధిలో సంఘం సమర్థవంతంగా పాల్గొంటుంది.
NCC బహుముఖ కార్యకలాపాలు విభిన్నమైన పనులతో యువత స్వీయ-అభివృద్ధి కై ప్రత్యేక అవకాశాలను అందిస్తుంది. చాలా మంది క్యాడెట్‌లు క్రీడలు, సాహస రంగాలలో తమ అద్భుతమైన విజయాలు సాధించడం ద్వారా దేశం గర్వించదగిన పనులు చేసారు. నేటి యువతను రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే దిశగా NCC తన అవిరళ కృషి కొనసాగిస్తోంది.
***
(रिलीज़ आईडी: 1775729)
आगंतुक पटल : 211