భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
వివిధ పథకాల సమాహార మైన సముద్ర సేవలు, మోడలింగ్, అనువర్తన, వనరులు, సాంకేతికత కు (O-SMART) సంబంధించిన పథక కొనసాగింపునకు కేబినెట్ అనుమతి
ఈ పథకం వ్యయం రూ 2177 కోట్ల రూపాయలు
Posted On:
24 NOV 2021 3:39PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ కు చెందిన వివిధ పథకాల సమాహారమైన సముద్ర సేవలు, మోడలింగ్, అనువర్తన, వనరులు , సాంకేతికత (O-SMART) కార్యక్రమాన్ని 2021-26 సంవత్సరానికి రూ 2, 177 కోట్ల రూపాయల వ్యయంతో కొనసాగింపునకు తగిన అనుమతి మంజూరు చేశారు.
ఈ పథకం కింద ఏడు ఉప పథకాలు ఉన్నాయి. అవి సముద్ర సాంకేతికత, సముద్ర మోడలింగ్, అడ్వయిజరీ సర్వీసులు (ఒఎం ఎ ఎస్), సముద్ర పరిశీలక నెట్ వర్క్ (ఒఒఎన్), సముద్ర నిర్జీవ వనరులు, సముద్ర జీవవనరులు, సముద్ర పర్యావరణం (ఎంఎల్ ఆర్ ఇ), కోస్తా పరిశోధన, నిర్వహణ, పరిశోధక నౌకల నిర్వహణ వంటివి ఉన్నాయి. ఈ ఉప పథకాలను స్వతంత్రంగా మంత్రిత్వశాఖకు చెందిన సంస్థలు అమలు చేస్తాయి. అవి నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(NIOT) చెన్నై, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫరరర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS), హైదరాబాద్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషన్ రిసెర్చ్ (NCPOR) గోవా, సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్, ఎకాలజీ (సిఎంఎల్ఆర్ఇ), కోచి, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రిసెర్చ్ (ఎన్ సిసిఆర్), చెన్నై తోపాటు పలు జాతీయ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. మంత్రిత్వశాఖకు చెందిన ఓషనోగ్రాఫిక్ , కోస్టల్ రిసెర్చ్ నౌకలు తగిన మద్దతు ను అందిస్తాయి.
భారతదేశంలోని మహాసముద్రాలకు సంబంధించిన పరిశోధన సాంకేతిక అభివృద్ధిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ (DoD) ప్రారంభించింది, ఇది 1981లో ఏర్పాటైంది.,తరువాత ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES)లో విలీనమై అప్పటి నుండి కొనసాగుతోంది.
సాంకేతిక అభివృద్ధి, సూచన సేవలు, ఫీల్డ్ ఇన్‌స్టలేషన్‌లు, అన్వేషణలు, సర్వే, జాతీయ ప్రయోజనాల కోసం సాంకేతిక ప్రదర్శనల ద్వారా సముద్ర శాస్త్ర పరిశోధనలో భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ చెప్పుకోదగిన స్థానాన్ని సాధించింది. ఒ-స్మార్ట్ పథకం సముద్రానికి సంబంధించిన వివిధ పరిశోధన కార్యకలాపాల సమాహారంగా చెప్పుకోవచ్చు. సముద్ర వాతావరణానకి సంబంధించిన ముందస్తు సూచనలు ఇవ్వడంతో పాటు మన మహాసముద్రాల తీరుతెన్నులను నిరంతరం పరిశీలించడం జరుగుతుంది. అలాగే ఇందుకు సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేయడం, సముద్ర వనరులను (జీవ, నిర్జీవ) జాగ్రత్తగా కాపాడడం,సముద్ర విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలను మరింత ముందుకు తీసుకుపోవడం వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ పథకం ద్వారా ఈ రంగంలో కీలక మైలురాళ్ళు సాధించడం జరిగింది. ఇందులో అత్యంత ముఖ్యమైనది, హిందూ మహాసముద్ర ప్రాంతంలో పాలీ మెటాలిక్ నోడ్యూల్స్ (PMN) , హైడ్రోథర్మల్ సల్ఫైడ్‌ల విషయమై సముద్ర గర్భ మైనింగ్‌పై విస్తృతమైన పరిశోధనలు చేయడం. అంతర్జాతీయ సముద్రగర్భ అథారిటీ (ISA) నుంచి ఈ విషయంలో మన దేశం ప్రత్యేక గుర్తింపు పొందింది.
లక్షద్వీప్ దీవులలో తక్కువ ఉష్ణోగ్రతల థర్మల్ డీశాలినేషన్ పద్దతిని ఉపయోగించి వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేయడం మరో ముఖ్యమైన విజయంగా చెప్పుకోవచ్చు. మన దేశ మహాసముద్ర సంబంధిత కార్యకలాపాలు ఇప్పుడు ఆర్కిటిక్ నుండి అంటార్కిటిక్ ప్రాంతం వరకు విస్తృత సముద్ర ప్రాంతానికి వ్యాప్తి చెందాయి. వీటిని ఉపగ్రహ ఆధారిత పరిశీలన ద్వారా పర్యవేక్షించడం జరుగుతోంది.
అంతర్జాతీయ సముద్ర పరిశీలక వ్యవస్థలో అంతర్ ప్రభుత్వ స్థాయిలో సముద్ర వ్యవహారాల అమలు విషయంలో ఇండియా నాయకత్వ పాత్ర పోషిస్తున్నది.
విస్తృత శ్రేణి పరిశీలన నెట్‌వర్క్‌ల ద్వారా ఓషనోగ్రాఫిక్ కమిషన్ హిందూ మహాసముద్రంలో పరిశీలనలు చేపడుతున్నది.ఈ పరిశీలనల నెట్ వర్క్ సముద్రానికి సంబంధించి విలువైన సమాచారాన్ని అందించడానికి ఉపకరిస్తుంది. మత్స్య సంపద అపారంగా ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో , కోస్తా ప్రాంతానికి తుపాన్లు, సునామీలకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు అందిచడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ సమాచారం ఆయా దేశాలకు ఉపయోగపడుతుంది. సునామీలు, తుపాన్లకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు చేసేందుకు హైదరాబాద్ లో ప్రత్యేక ఇన్‌కాయిస్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా భారతదేశానిక, హిందూ మహాసముద్ర దేశాలకు సమాచారం ఉపయోగపడుతుంది. ఇది యునెస్కో గుర్తింపు పొందింది. భారత ప్రత్యేక ఎకనమిక్ జోన్ (ఇఇజెడ్) వెంట విస్తృత సర్వే నిర్వహించడం, సముద్ర వనరుల గుర్తింపు, సముద్ర సంబంధిత అడ్వయిజరీ సేవలు, నావిగేషన్ తదితరాలను అందించడం దీనిద్వారా జరుగుతుంది. ఇఇజెడ్‌లు. సముద్ర గర్భ ప్రాంతంలో జీవజాలం స్థితిగతులు గుర్తించి సముద్ర ప్రాంత జీవవైవిధ్యాన్ని కాపాడడడం దీని లక్ష్యం. సముద్ర తీర ప్రాంత జలాల తీరును పరిశీలించడంతోపాటు , తీర ప్రాంతంలో చోటు చేసుకునే మార్పులు, సముద్ర పర్యావరణ స్థితిగతులను భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ కూడా పర్యవేక్షిస్తుంది.
ఒస్మార్ట్ అనేది మల్టీ డిసిప్లినరీ పథకం. ప్రస్తుతం కొనసాగుతున్న పరిశోధన, సాంకేతికత అభివృద్ధి కార్యకలాపాలు దేశ సముద్ర పరిశోధన రంగంలో సామర్ధ్యాలనిర్మాణాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తుంది. ప్రస్తుత దశాబ్దాన్ని సుస్థిరాభివృద్ధికి సముద్ర విజ్ఞాన దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ పథకం కొనసాగింపు అంతర్జాతీయంగా సముద్రప్రాంత పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ పథకం కొనసాగింపు విస్తారమైన సముద్ర వనరులను సమర్ధవంతంగా పకడ్బందీగా ఉపయోగించడానికి, అలాగే నీలి ఆర్థిక వ్యవస్థపై జాతీయ విధాన పరిపుష్టికి గణనీయంగా దోహదం చేస్తుంది.
మహా సముద్రాలు, సముద్రాలు , సముద్ర వనరులను పరిరక్షించడానికి వాటిని నిరంతరాయంగా ఉపయోగించుకోవడానికి ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం-14 ను సాధించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తీరప్రాంత పరిశోధన , సముద్ర జీవవైవిధ్య కార్యకలాపాల ద్వారా వీటిని పరిశీలిస్తున్నారు.. దీనిద్వారా స్థూల దేశీయోత్పత్తికి చెప్పుకోదగిన రీతిలో చేయూతలభిస్తోంది.
సముద్ర సలహా సేవలు , సాంకేతికతలను అభివృద్ధి ద్వారా సముద్ర వాతావరణంతో ముడిపడినపలు రంగాలకు ప్రయోజనంకలుగుతోంది. ముఖ్యంగా దేశంలోని తీరప్రాంత రాష్ట్రాలకు ఇది ఎంతో ఉపకరిస్తోంది.
రాగల ఐదు సంవత్సరాలలో (2021-26) ఈ పథకం మరింత సమగ్ర కవరేజ్ ఇవ్వనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యకలాపాలను బలోపేతం చేయడం ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, వివిధ తీరప్రాంత ప్రజలకు ,స్టేక్ హోల్డర్లకు తగిన సూచనలు , హెచ్చరిక సేవలను అందించడం, సముద్ర జీవుల పరిరక్షణ వ్యూహం, జీవవైవిధ్యాన్ని అర్థం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను మరింత బలోపేతం చేయడం వంటి వాటికి ఇది తోడ్పడుతుంది. తీరప్రాంత ప్రక్రియలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది.
***
(Release ID: 1774718)
Visitor Counter : 217