హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గిరిజన స్వాతంత్ర్య సమయయోధుల స్మారకార్థం మ్యూజియం!


రాణీ గాయిదైన్ల్యూ పేరిట మణిపూర్.లో నిర్మాణం...
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అమిత్ షా భూమిపూజ...

రేపటి తరాలకు దేశభక్తి భావనను, సమరయోధుల స్ఫూర్తిని
ఈ మ్యూజియం కలిగిస్తుందన్న కేంద్రహోమ్ మంత్రి..

గిరిజనుల సేవల గౌరవార్థం, బిర్సా ముండా జయంతిని
జనజాతీయ గౌరవ దివస్.గా పాటించాలని మోదీ నిర్ణయం..

గిరిజనుల అభ్యున్నతే మోదీ ప్రభుత్వ ధ్యేయం..
ఏకలవ్య పాఠశాలలు,
ఎం.ఎస్.పి.పై అటవీ ఉత్పత్తుల కొనుగోలు,
తదితర అభివృద్ధి పనులు చేపట్టిన మోదీ ప్రభుత్వం..

ఆజాదీ అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో
ప్రజల ముందు ప్రధాని 3 లక్ష్యాలు.

స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాన్ని
స్మరించేందుకు ఇదే తరుణం..
మోదీ సారథ్యంలో ప్రపంచ దేశాల సరసన గర్వంగా
నిలబడగలిగిన భారతదేశం..
జాతీయ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం..

దేశవైభవాన్ని నిలబెట్టడం,
దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే
75ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల లక్ష్యం...

75ఏళ్లనుంచి వందేళ్ల మధ్య మనకు ఉత్తమ కాలం..
వందేళ్ల స్వాతంత్ర్యం ముగిసేసరికి ప్రపంచ దేశాల్లో
దేశానికి సముచిత స్థానంకోసంప్రజలు ప్రతినబూనాలి..



బ్రిటిషా పాలకులపై పోరుతో జాతీయ పతాకాన్ని

Posted On: 22 NOV 2021 6:52PM by PIB Hyderabad

మణిపూర్.లో ఒకప్పుడు సాయుధ మూకలు భయోత్పాతాన్ని వ్యాప్తి చేసేవి. ఇలాంటి కార్యకలాపాల్లో చాలా సార్లు,. అప్పటి ప్రభుత్వాలకు కూడా ప్రమేయం ఉండేది. అయితే, ఇపుడు బీరేన్ సింగ్ నాయకత్వంలో మణిపూర్ శాంతి భద్రతలు చాలా వెల్లివిరుస్తున్నాయి.  

గత ఐదేళ్లలో నరేంద్ర మోదీ, బీరేన్ సింగ్ చేపట్టిన అభివృద్ధి పనులు మణిపూర్.పై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. 70ఏళ్ల మణిపూర్.లో గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణిపూర్.లో మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం భారీ స్థాయి పనులు జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అండగా నిలిచాయని మణిపూర్ రాష్ట్రంలోని కొండకోనల గ్రామాలు తొలిసారిగా భావిస్తున్నాయి.

   ఈ నేపథ్యంలో, మణిపూర్.లో నిర్మించ తలపెట్టిన రాణి గాయిదైన్ల్యూ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంకు కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 22న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భూమిపూజ చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా, పలువురు ప్రముఖులు కూడా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

   ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,  రాణీమాత గాయిదైన్ల్యూ పేరిట ఆమె స్వారకార్థం నిర్మించే  మ్యూజియం భూమిపూజలో పాల్గొనడం తనకు దక్కిన అదృష్టమని, పరమ పవిత్రమైన ఈ కార్యక్రమం ద్వారా, మన స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తి, దేశభక్తి, వారందించిన సేవల గురించి రాబోయే తరాలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. మణిపూర్ కు చెందిన పలువురు స్వాతంత్ర్య యోధులు బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటుచేసి పోరాటం జరిపారని, మన దేశానికే గర్వకారణంగా వారు నిలిచారని అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో అప్పటి మణిపూర్ మహారాజు కుల్చంద్ర సింగ్, ఆయన అనుయాయులు, బ్రిటిష్ పాలకుల నిరంబంధానికి గురయ్యాయరని, అండమాన్ నికోబార్ దీవుల్లోని హారీట్ పర్వతంపై వారు ఐదేళ్లు కారాగార శిక్షను అనుభవించారని అన్నారు. మహారాజా కుల్చంద్ర సింగ్ స్వాతంత్ర్య సమరంలో ఎంతో ధైర్యసాహసాలతో పాల్గొని, బ్రిటిష్ పాలకులపై ఈశాన్య ప్రాంతంలో యుద్ధం సాగించారన్నారు. మహారాజా కుల్చంద్ర సింగ్.తో పాటుగా, మణిపూర్.కు చెందిన స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించేందుకు హారీట్ పర్వతాన్ని మణిపూర్ పర్వతంగా నామకరణం చేశామని అన్నారు. కేవలం మణిపూర్ రాష్ట్రానికే కాక, ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ ప్రధాన ఆకర్షణగా ఈ గిరిజన మ్యూజియం నిలుస్తుందని, మన గిరిజన సహోదరుల పోరాటమే లేకుంటే, మన స్వాతంత్ర్య సమరం అసంపూర్తిగా మిలిగిపోయేదని అమిత్ షా అన్నారు

   ఈ ఏడాది,.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు జరుగుతున్న సంవత్సరమని, ప్రతి ఏడాది నవంబరు 15వ తేదీన వచ్చే భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దివస్.గా నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల నిర్ణయించారని అమిత్ షా చెప్పారు.  దేశ సంస్కృతీ, స్వాతంత్య్రాల పరిరక్షణకోసం గిరిజన సమాజం అందించిన సేవలను ప్రస్తుతించేందుకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా గిరిజనుల గౌరవార్థం, ఈ ఏడాది నవంబరు 15నుంచి 22వ తేదీవరకూ ఆదివాసీ గౌరవ వారోత్సవాలు నిర్వహించినట్టు చెప్పారు.

.

   స్వాతంత్ర్య పోరాటంలో రాణీ గాయిదిన్ల్యూ అద్భుతమైన సేవలను అమిత్ షా గుర్తు చేసుకుంటూ ఆమెకు ఘననివాళులర్పించారు. ఆమె పోరాటంనుంచి తాము స్ఫూర్తిని పొందుతున్నామని, రానున్న తరాలకు కూడా ఆమె జీవితం స్ఫూర్తిదాయకమేనని అన్నారు. ఆమె జన్మతః రాణి కాదని, రాణి అనే బిరుదును ఆమెకు ఎవరూ ఇవ్వలేదని, అయితే, ఆమె స్వాతంత్ర్య సమరంలో ఆమె చూపిన తెగువను చూసి యావద్దేశం ఈరోజు ఆమెను రాణిగా సమున్నతంగా గౌరవిస్తోందని అన్నారు. ప్రభుత్వాలు బిరుదులు ప్రదానం చేసినపుడు, వాటిని కొన్నేళ్లలోనే మరిచిపోవచ్చని, ప్రజలే బిరుదులు అందిస్తే వాటిని యుగాలతరబడి స్వరించుకుంటూ ఉంటారని ఆయన అన్నారు. బాబా తిర్కా మాంఝీ, సిద్ధో కానూ, చాంద్ భైరవ్, తెలాంగా ఖాడియా, శంకర్ షా, రఘునాథ్ షా, సేథ్ భిఖారి గణపత్ రాయ్, ఉమ్రావ్ సింగ్ తికాయత్, విశ్వనాథ్ సహదేవ్, నీలాంబర్ పితంబర్, నారాయణ్ సింగ్, జత్రా ఉరాఁవ్, జాదో నాంగ్, రాజమోహన్ దేవి వంటి స్వాతంత్ర్య సమర యోధులు  బ్రిటిష్ పాలకులతో పలుసార్లు హోరా హోరీగా పోరాటం సలిపారని అన్నారు. ఈ సందర్బంగా భగవా బిర్సా ముండా ధైర్యసాహసాలను ఎవరూ మరచిపోజాలరని, భగవాన్ బిర్సా ముండాగా ఆయన దేశప్రజలందరికీ తెలుసని, అయితే,.. దేశ స్వాతంత్ర్యంకోసం గొంతెత్తిన తొలి యోధుడు ఆయనేనని అమిత్ షా అన్నారు.

   ఈ సంవత్సరం మనం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని, ఈ సందర్భంగా ప్రజల ముందు ప్రధాని మూడు లక్ష్యాలను ఉంచారని అమిత్ షా అన్నారు.

   దేశంకోసం ఎనలేని త్యాగాలు, స్వాతంత్ర్యంకోసం అలుపెరగని పోరాటం చేసిన సమర యోధులను స్మరించుకునేందుకు ఇదే తగిన తరుణమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఈ రోజున ఈ స్థాయిలో సగర్వంగా నిలిచిందంటే అందుకు వారి త్యాగాల పునాదులే కారణమని అన్నారు. ఆనాడు వారు త్యాగాలు చేయకపోతే, ఈనాడు దేశం ఈ స్థాయిలో ఉండేది కాదని అన్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుల గురించి ఇప్పటి తరానికి, రేపటి తరానికి గుర్తు చేసేందుకు, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు అమిత్ షా చెప్పారు.

   యువతరంలో దేశభక్తి భావనను, స్ఫూర్తిని నింపడం ప్రధాని కలలుగన్న రెండవ లక్ష్యమని అమిత్ షా అన్నారు. దేశ స్వాతంత్ర్యం తర్వాతనే మనం పుట్టామని, దేశ స్వాతంత్ర్యంకోసం మరణించే అవకాశం ఇప్పటి తరానికి, రాబోయే తరానికి ఉండబోదని, అయితే దేశంకోసం జీవించే అవకాశం మాత్రం వారికి ఉంటుందని అన్నారు. దేశాభివృద్ధితో మన జీవితం ముడివడి ఉందని, దేశానికి గొప్పపేరును, వైభవాన్ని తీసుకరావడం, దేశాన్ని ప్రగతి పథంలో పురోగమింపజేయడం మన బాధ్యతలని, అందుకే,..ఇపుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు నిర్వహించడం అవసరమని అమిత్ షా అన్నారు.

  ఇక ప్రధాని నిర్దేశించిన మూడవ లక్ష్యం ప్రకారం, స్వతంత్ర భారతదేశపు 75 సంవత్సరాలనుంచి వందేళ్ల మధ్యకాలం, ఎంతో ఉత్తమమైన కాలమని అమిత్ షా అన్నారు. వందేళ్ల స్వాతంత్ర్యం ముగిసే నాటికి,  ప్రపంచ దేశాల సమూహంలో భారతదేశానికి సముచిత స్థానం కల్పించేందుకు ప్రజలంతా ఇపుడు ప్రతినబూనాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

https://ci4.googleusercontent.com/proxy/FDia3HddEG3V5GUn4JZjgAEMtPbo0dNw1itIJ83XJxNXAw6U8KX2-beWwcrpEHnYE3NGBLP0OEqUwc3EDYNQanee83R38r9jPF9OPW4xwYMk09KxWLp15ssk4Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00366SS.jpg

  స్వాతంత్ర్య సమరయోధురాలు రాణీ గాయిదిన్ల్యూ మణిపూర్.లోని ఒక గ్రామంలో పుట్టారని, తన 13ఏళ్ల వయస్సులోనే జాదోనాంగ్ నాయకత్వంలో స్వాతంత్ర్య పోరాటంలో చేరారని అన్నారు. కేవలం రెండేళ్లలోనే బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన సమరయోధురాలుగా ఆమె రాటుదేలారని ఆయన అన్నారు. పోరాటంలో జాదోనాంగ్ ప్రాణత్యాగంతో వెంటనే స్వాతంత్ర్య ఉద్యమానికి ఆమె నాయకత్వ బాధ్యతలు స్వీకరించారన్నారు. ఎంతో జనాకర్షణ కలిగిన ఆమె నాయకత్వంలో బ్రిటిష్ పాలకులపై బీకరమైన పోరాటం జరిగిందన్నారు. --ఎక్కడో మారుమూల కొండల్లో ఉండే చిన్నారి బాలిక ప్రపంచంలోనే అతి పెద్దదైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసి పోరాడింది. దేశం ఈ రోజు ఆమె సేవలను గుర్తు చేసుకుంటోంది. ఆమె శత జయంతి సందర్భంగా రూ. 5, రూ. 100 విలువగల నాణాలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ఆమె త్యాగాలకు గుర్తింపుగా పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ప్రదానం చేశారు. భారతీయ తీరరక్షణ దళం 2016, అక్టోబరు 19న తమ గస్తీ నౌకకు ఆమె పేరుతో నామకరణం చేసి, ఆమెపట్ల గౌరవం చాటుకుంది.— అని అమిత్ షా అన్నారు.

  ఒక స్వాతంత్ర్య సమరయోధురాలి పేరిట దేశవ్యాప్తంగా మ్యూజియంలు ఏర్పాటు చేయడం సమాజాన్ని సమైక్యం చేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. స్వాతంత్ర్యంకోసం గిరిజన సమాజం చేసిన పోరాటాలు, వారి త్యాగాల గురించి, గిరిజన జనాభాలేని ప్రాంతాల వారికి తెలిసే అవకాశం ఉండదని, అందువల్లనే గిరిజన స్వాతంత్ర్య యోధుల గురించి తెలిసేలా తమ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో మ్యూజియంలను ఏర్పాటు చేస్తున్నట్టు 2016 ఆగస్టు 15న ప్రధానమంత్రి ప్రకటించారని అమిత్ షా చెప్పారు. త్యాగాలు చేయడంలో తమకంటే గిరిజనులు ముందున్నారని యువతరం తెలుసుకోవడానికి ఇది వీలు కలిస్తుందన్నారు. ఈ మ్యూజియంల నిర్మాణంకోసం ప్రభుత్వం రూ. 195కోట్లను కేటాయించిందని, రూ. 110కోట్ల మొత్తం ఇప్పటికే విడుదలైందని ఆయన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, చత్తీస్ గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఇలాంటి మ్యూజియంలు రాబోతున్నాయని ఆయన తెలిపారు. మణిపూర్.లో రూ. 15కోట్ల భారీ మొత్తంతో మ్యూజియం నిర్మితమవుతుందని, ఈ మ్యూజియం,.. ఈ శాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో దేశభక్తి స్ఫూర్తిని మరోసారి మేల్కొలుపుతుందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.

  గిరిజనుల అభ్యున్నతికోసం ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి.) కల్పించడంతో పాటుగా, గిరిజనుల అభివృద్ధికోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నాయకత్వం వల్ల గత ఐదేళ్లలో మణిపూర్.లో చాలా మార్పులు వచ్చాయని, రాష్ట్రంలో చాలా కాలం తర్వాత ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొంటోందని, ఈ రోజున మణిపూర్ రాష్ట్రం ప్రతి రంగంలో పురోగమిస్తోందని అన్నారు. చేసిన వాగ్దానాలన్నింటినీ రాష్ట్రప్రభుత్వం నెరవేర్చినందునే, మణిపూర్.లో ఇకపై సమ్మెలు, బంధ్.లు, హర్తాళ్లు ఉండబోవన్నారు. ఒక దశలో మణిపూర్.లో సాయుధ గ్రూపులు హింసాకాండను, భయోత్పాతాన్ని వ్యాప్తి చేసేవని, చాలా సందర్భాల్లో అప్పటి ప్రభుత్వాలకు కూడా వాటిలో ప్రమేయం ఉండేదని, అయితే, బీరేన్ సింగ్ ప్రభుత్వ హయాంలో క్రమంగా శాంతి భద్రతలు మెరుగుపడుతూ వస్తున్నాయని అన్నారు. నరేంద్ర మోదీ, బీరేన్ సింగ్ నాయకత్వంలో గత ఐదేళ్లలో సాధించిన అభివృద్ధి, గత 70ఏళ్లలో మణిపూర్ సాధించిన అభివృద్ధిని కూడా అధిగమించిందన్నారు. మణిపూర్.లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చోటుచేసుకున్నాయని, కొత్తగా క్రీడా విశ్వవిద్యాలయం నిర్మితమవుతోందని, కొత్త శాసనభాభవనం ఇప్పటికే సిద్ధమైందని అన్నారు. మణిపూర్.లో మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం ఎన్నో పనులు జరిగాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అండగా నిలుస్తున్నాయన్న భావన కొండప్రాంతాల ప్రజల్లో ఏర్పడిందని ఆయన అన్నారు. గతంలో మణిపూర్.లో వోట్లను మాత్రమే ప్రతి ఒక్కరూ కోరుకున్నారని, రాష్ట్రాభివృద్ధికోసం వారెవరూ ఏమాత్రం తపనపడలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కొండప్రాంతాల గ్రామాలకు విద్యుదీకరణ జరిగిందని అన్నారు. మణిపూర్.లో నివసించే ప్రతిఒక్కరి వైద్యం ఖర్చునూ రూ. 5లక్షల వరకూ నరేంద్ర మోదీ ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు. ప్రతి ఇంటికీ వంటగ్యాస్ సరఫరా అవుతోందని, మరుగుదొడ్లు నిర్మితమయ్యాయని, కొండప్రాంతాల్లో పాఠశాలలు కూడా నిర్మించారని, గ్రామాల మధ్య అనుసంధానంకోసం కృషి జరుగుతూ ఉందని అమిత్ షా అన్నారు.

 

****


(Release ID: 1774363) Visitor Counter : 237