పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్‌లో నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ


26 నవంబర్ 2021 ఉదయం 11 గంటల నుంచి పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుంచి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రత్యక్ష ప్రసారం

కార్యక్రమానికి నాయకత్వం వహించనున్న రాష్ట్రపతి

కార్యక్రమంలో పాల్గోనున్న ఉపరాష్ట్రపతి,ప్రధానమంత్రి, స్పీకర్, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రముఖులు

కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ తమ ప్రాంతాల నుంచి 26.11.2021న రాజ్యాంగ పీఠికను చదవవచ్చు

కార్యక్రమంలో ఎక్కువమంది పాల్గొనేలా చూడటానికి రెండు పోర్టల్‌లను అభివృద్ధి చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

23 భాషలలో (22 అధికారిక భాషలు మరియు ఇంగ్లీష్) “ ఆన్‌లైన్ లోరాజ్యాంగ పీఠిక పఠనం” కోసం ఒక పోర్టల్

“రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై ఆన్‌లైన్ క్విజ్” కోసం రెండవ పోర్టల్ ( mpa.nic.in/constitution-day)

ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పాల్గొని సర్టిఫికెట్ పొందవచ్చు

రాజ్యాంగ పీఠికను చదవడానికి అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ పోర్టల్” (mpa.nic.in/constitution-day) 23 భాషలలో (22 అధికారిక భాషలు మరియు ఇంగ్లీష్) 26 నవంబర్ 2021 నుంచి అందుబాటులో ఉంటుంది

కార్యక్రమ వివరాలను వెల్లడించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్ర

Posted On: 23 NOV 2021 2:06PM by PIB Hyderabad

 భారతదేశం 75 సంవత్సరాల కాలంలో సాధించిన ప్రగతి,  దేశ చరిత్ర, సంస్కృతి మరియు అద్భుతమైన చరిత్రను ప్రదర్శించి  స్మరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్‌లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. కార్యక్రమ వివరాలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ వి మురళీధరన్, కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ మీడియాకు వివరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 2021నవంబర్  26 న  నిర్వహించనున్న   సంవిధాన్ దివస్ వివరాలను  ఈరోజు (23 నవంబర్ 2021) నేషనల్ మీడియా సెంటర్‌లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. 

రాష్ట్రపతి నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమాన్ని 2021 నవంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని శ్రీ జోషి తెలిపారు. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి,ప్రధానమంత్రి, స్పీకర్, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. కార్యక్రమాన్నిసంసద్ టీవీ /డీడీ / ఇతర టీవీ ఛానెల్‌లు మరియు ఆన్‌లైన్ పోర్టళ్లు ప్రత్యక్షంగా ప్రసారం చేస్తాయి.

కార్యక్రమంలో తొలుత రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ప్రసంగం తరువాత రాష్ట్రపతితో కలిసి జాతి మొత్తం రాజ్యాంగ పీఠికను  చదువుతుంది. 

కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ప్రజలతో సహా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లు, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలు , పాఠశాలలు/కళాశాలలు/విశ్వవిద్యాలయాలు/సంస్థలు, బార్ కౌన్సిల్‌లు తదితర రంగాలకు చెందిన వారు తమ తమ ప్రాంతాల నుంచి రాష్ట్రపతితో కలిసి  26.11. 2021న రాజ్యాంగ పీఠిక చదువుతారు. 

రేడియో/టీవీ/సామజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ రాష్ట్రపతితో కలిసి రాజ్యాంగ పీఠిక చదవడానికి వివిధ రంగాలకు చెందిన వారు  ముందుకు రావాలని శ్రీ జోషి పిలుపు ఇచ్చారు. 

రాజ్యాంగ పీఠిక పఠన కార్యక్రమాన్ని ప్రజల కార్యక్రమంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యక్రమంలో పాల్గొనేలా చూడడానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ రెండు పోస్టర్లను  అభివృద్ధి చేసింది. “రాజ్యాంగ పీఠిక  ఆన్‌లైన్ పఠనం” లో 23 భాషలలో (22 అధికారిక భాషలు మరియు ఇంగ్లీష్) పాల్గోవడానికి, “రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై ఆన్‌లైన్ క్విజ్”  లలో  mpa.nic.in/constitution-day ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పాల్గొని   సర్టిఫికేట్‌లను పొందవచ్చునని మంత్రి వివరించారు. 

23 భాషలలో (22 అధికారిక భాషలు మరియు ఇంగ్లీష్) “రాజ్యాంగ పీఠిక చదవడానికి రూపొందించిన  ఆన్‌లైన్ పోర్టల్” mpa.nic.in/constitution-day  26 నవంబర్ 2021 నుంచి అందుబాటులో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.  ఎవరైనా ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుని  23 భాషల్లో దేనిలోనైనా రాజ్యాంగ పీఠిక  చదివి సర్టిఫికెట్ పొందవచ్చునని వివరించారు. 

పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ జై ప్రకాష్ లఖివాల్ ఈ పోర్టల్‌లోని పీఠిక కోసం ఫ్రేమ్‌ను రూపొందించారు, దేశంలోని అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల   కళల అంశాలు ప్రతిబింబించే విధంగా దీనిని రూపొందించారు . ఈ డిజైన్ సర్టిఫికేట్‌లపై కూడా ఉంటుంది. 

“రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై ఆన్‌లైన్ క్విజ్” (mpa.nic.in/constitution-day) పోర్టల్‌ను  రాష్ట్రపతి 26 నవంబర్, 2021న సెంట్రల్ హాల్ లో ప్రారంభిస్తారు.  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడడానికి క్విజ్ ను డిజిటల్ విధానంలో సులువైన ప్రశ్నలతో రూపొందించారు. ప్రాథమిక హక్కులు,  భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంశాలపై ఈ ప్రశ్నలు ఉంటాయి. ఎవరైనా ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు.  అతని/ఆమె పేరు, టెలిఫోన్ నంబర్, వయస్సు వివరాలతో   పేరును నమోదు చేసుకోవచ్చు. పాల్గొనే వారందరికీ  పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందిస్తారు. ఒకే మొబైల్ నంబర్‌లో బహుళ రిజిస్ట్రేషన్‌లు ఉండవచ్చు. 1000 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది.  ప్రతిసారీ 5 ప్రశ్నలు వస్తాయి. వీటికి పాల్గొంటున్న వారు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. పాల్గొనేవారు అతని/ఆమె సమాధానం ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసుకోవచ్చు. జ్ఞానాన్ని పరీక్షించటానికి కాకుండా భారత రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక విలువలను ప్రాచుర్యం చేయాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ క్విజ్ లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్లను ఇస్తారు. ప్రపంచ వ్యాపితంగా అన్ని దేశాల నుంచి సీనియర్ సిటిజన్ లతో సహా ఎక్కువ మంది కార్యక్రమంలో పాల్గొనేలా చూడడానికి క్విజ్ ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించడం జరుగుతుంది. 

 రాష్ట్రపతి, ప్రధానమంత్రి తో కలిసి ఎక్కువ మంది ప్రజలు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే కార్యక్రమంలో పాల్గోవాలని ప్రజలకు మంత్రి పిలుపు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను, సర్టిఫికెట్ అందుకుంటున్న సమయంలో తీసుకునే ఫోటోలను   #SamvidhanDiwas, Facebook @MOPAIndia, Twitter @mpa_india,  Instagram @min_mopaని ట్యాగ్ చేయడం ద్వారా పంపాలని ఆయన కోరారు. 

2010లో గుజరాత్ ముఖ్యమంత్రిగా  ప్రధానమంత్రి గుజరాత్‌లో “సంవిధాన్ గౌరవ్ యాత్ర” ను తొలిసారిగా నిర్వహించారని మంత్రి వివరించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని  2015 నుంచి  26 నవంబర్‌ను రాజ్యాంగ దినోత్సవంగా పాటించడం జరుగుతున్నదని పేర్కొన్నారు.

రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమంగా గుర్తించి దీనిలో పాల్గొని సర్టిఫికేట్‌లను సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ పంచుకోవాలని మంత్రి కోరారు.  


(Release ID: 1774278) Visitor Counter : 670