నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హల్దియా డాక్ కాంప్లెక్స్‌లో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన శ్రీ శంతను ఠాకూర్


- సాటిలేని వేగంతో భారత జలమార్గాల‌ను విస్తరిస్తున్నాముః స‌హాయ మంత్రి

Posted On: 22 NOV 2021 9:35AM by PIB Hyderabad

కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌లోని  ఉన్న హల్దియా డాక్ కాంప్లెక్స్‌లో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూరి వివిధ‌ ప్రాజెక్టులను ప్రారంభించారు. మంత్రి ప్రారంభించిన వాటిలో  ఎ) మెరుగైన తుఫాను నీటిని బ‌య‌ట‌కు పంప‌డం & రోడ్ల విస్తరణ బి) 41000 చ‌.మీ. ప్రాంతాన్ని కార్గో హ్యాండ్లింగ్ ప్రాంతం చేర్చడం c) పోర్ట్ గెస్ట్ హౌస్‌ను ఆధుణీక‌రించ‌డం  & ల్యాండ్‌స్కేపింగ్ చేయడం  d) పోర్ట్ హాస్పిటల్‌లో కొత్త ఐసీయు & ఎమర్జెన్సీ వార్డ్ ఏర్పాటు వంటి వివిధ ప‌నులు ఉన్నాయి. ఈ ప‌నుల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి వెంట ఎంపీ శ్రీ దిబ్యేందు అధికారి, స్థానిక శాస‌న స‌భ్యుడు శ్రీమతి తపశి మండల్,  పోర్టు చైర్మన్ శ్రీ వినీత్ కుమార్ త‌దిత‌రులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ మన వేగానికి మరే దేశం సాటి చేయలేనంత వేగంగా భారత జలమార్గ వ్యవస్థలు విస్తరిస్తున్నామ‌న్నారు. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి అభివృద్ధి దార్శనికతను అమలుకు  కట్టుబడి ఉందని తెలిపారు.  ఈ రోజు హల్దియా డాక్ సందర్శన ప్రధానమంత్రి అందరి అభివృద్ధి దార్శనికతలో భాగంగా ఒక ముందడుగ‌ని తెలిపారు.

***


(Release ID: 1773956) Visitor Counter : 187