గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గిరిజన జీవన శైలికి చెందిన హస్తకళలు,వంటకాలు, సాంస్కృతిక వారసత్వానికి అద్దంపట్టిన జనజాతీయ గౌరవ్ దివస్ వారోత్సవాలు
Posted On:
20 NOV 2021 12:25PM by PIB Hyderabad
భారతదేశ గిరిజన సముదాయాలకు అంకితం చేసిన వారోత్సవాలు భిన్న గిరిజన సంస్కృతులకు అద్దంపడుతున్నాయి. నవంబర్ 15న ప్రారంభమై దేశవ్యాప్తంగా ఉత్సాహంతో, ఉల్లాసంతో కొనసాగుతున్నాయి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రధాన మంత్రి ప్రారంభించిన జనజాతీయ గౌరవ దివస్ ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. నవంబర్ 15న చారిత్రిక గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాదీ జనజాతీయ గౌరవ దివస్ జరుపుకుంటారు. మన స్వాతంత్ర్య సమరంలో నేటి వరకూ వెలుగులోకి రాకుండా మరుగునపడిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడి వారసత్వాన్ని గౌరవించుకునేందుకు నవంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవాలలో 13 రాష్ట్రాలు, న్యూఢిల్లీలో ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. భగవాన్ బిర్సా ముండా మనుమడు అయిన సుఖ్‌రాం ముండా దిల్లీ హాట్‌లో జాతీయ గిరిజన ఉత్సవమైన ఆదిమహోత్సవ్‌ను ప్రారంభించారు. ఇది నవంబర్ 30 వరకు కొనసాగనుంది. ఈ ఉత్సవంలో భిన్న గిరిజన సముదాయాలకు చెందిన గిరజన హస్తకళలు, వంటకాల వైభవం ప్రదర్శితమవుతోంది. దాదాపు 200కు పైగా స్టాళ్ళతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో భారత దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళల కళాకారుల ఉత్పత్తులైన- చేతితో నేసిన కాటన్, పట్టు వస్త్రాలు, చేతితో చేసిన ఆభరణాలు, అద్భుతమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి.
సంప్రదాయ గిరిజన హస్తకళలు, ఆహారం, మూలికల అమ్మకాలు, ప్రదర్శన, అమ్మకాలతో 5రోజుల ఉత్సవాన్ని అహ్మదాబాద్ హాట్‌లో గుజరాత్ రాష్ట్రం ప్రారంభించింది. ఈ ఉత్సవాలను గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి నరేష్ పటేల్, గిరిజనాభివృద్ధి శాఖ సహాయ మంత్రి నిమిషాబెన్ సుథార్ ప్రారంభించారు. ఈ ఉత్సవంలో సంప్రదాయ గిరిజన కళలు, హస్తకళలు, సేంద్రీయ ఆహార పదార్ధాలు (ఆర్గానిక్ ఫుడ్), గిరిజన మూలికలు, వైద్య విజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన రాష్ట్ర గిరిజన జానపదులకు, నగరవాసులకు మధ్య సంభాషణలకు సమావేశస్థలంగా నిలిచింది. ఈ కార్యక్రమం గిరిజన సుసంపన్న సంస్కృతికి, వారి ఐక్యతకు ప్రతిఫలించే సంప్రదాయ గిరిజన నృత్యాల ప్రదర్శనలతో సాగింది.
మణిపూర్ గిరిజన వ్యవహారాలు, కొండలు శాఖ పరిధిలోని ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నవంబర్ 16-18, 2021వరకు గిరిజన కళలు & చిత్రలేఖనాల మూడు రోజుల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను, పోఈలను నిర్వహించింది. ఇంఫాల్ ఆర్ట్ కాలేజీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మణిపూర్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి లఖోగిన్ హోకిప్ ప్రారంభించారు. గిరిజన సమాజాలకు చెందిన యువత సృజనాత్మక నైపుణ్యాలను, వ్యక్తిత్వాలను, ఆత్మవిశ్వాసాన్ని, మానసిక, ఊహాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహించారు.
ఇద్దరు చారిత్రిక స్వాతంత్ర్య సమరయోధులు రామ్‌జీ గోండ్, కొమరం భీమ్ పై తెలంగాణ డాక్యుమెంటరీల పరంపరను తెలంగాణ విడుదల చేసింది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులు పాల్గొన్నవిశేష కార్యక్రమిది.
గిరిజన హస్తకళాకారులకు మెరుగైన ఆర్థిక అవకాశాలను, ఇతర గిరిజన హస్తకళాకారులతో అంతర్ సాంస్కృతిక సంభాషణలకు వేదికను కల్పించేందుకు ఛత్తీస్‌గఢ్ నవంబర్ 15- 17 వరకు రెండు రోజుల గిరిజన హస్తకళల మేళాను నిర్వహించింది. మేళాకు వచ్చిన ప్రజలు భారీ ఎత్తున ఉత్సహంగా, ఉల్లాసంగా గిరిజన హస్తకళాకారులతో సంభాషించడం కనిపించింది. గిరిజన సంప్రదాయ కళలు, హస్తకళలను పరిరక్షించి, ప్రోత్సహించి, ప్రచారం చేయాలన్న 3-పిల లక్ష్యంతో ఈ మేళా నిర్వహించారు. గిరిజన హస్తకళాకారుల ఉత్పత్తుల వాణిజ్య సాధ్యత కోసం చేసిన కృషి వారి స్వీయ సాధికారత భావాన్ని కలిగించాయి.
జమ్ముకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో గొప్ప వేడుకలతో జనజాతీయ గౌరవ్ దివస్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భిన్న ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు. జమ్ము లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సింహా జమ్ములో జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కేంద్రపాలిత ప్రాంతంలో 20 భిన్న జిల్లాలలో ఉత్సవాలను డివిజనల్ కమిషనర్లు, డిఎంలు నిర్వహించారు. అన్ని విద్యా సంస్థలు, ఎన్జీవోలు భిన్న రకాల కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా జన జాతీయ దివస్‌ను జరుపుకున్నాయి.
గిరిజన ప్రాంతాలలో జిపిడిపి తయారీ కోసం రెండు రోజుల సామర్ధ్య నిర్మాణ కార్యక్రమాన్ని, ఎన్‌టిఆర్ఐ, ఢిల్లీ సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు.
సుసంపన్నమైన సంస్కృతిని కలిగిన అండమాన్, నికోబార్ ద్వీప సముదాయంలో కూడా జరవా తెగల వారసత్వ వైభవాన్ని కళాసంపదను ప్రదర్శించేందుకు జరవా తెగల సాంస్కృతిక కార్యక్రమాన్ని నవంబర్ 16న నిర్వహించింది.
ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గిరిజన సమాజాలు వివిధ రంగాలలో తమకున్న ప్రతిభను ప్రదర్శించేందుకు వేదికను అందించడమేకాక, వారి సర్వతోముఖాభివృద్ధికి రోడ్ మాప్‌ను రూపొందించేందుకు ఉద్దేశించినవి.
***
(Release ID: 1773560)
Visitor Counter : 180