సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కెలెడియోస్కోప్ ప్యాకేజ్ ప్రకటించిన IFFI, ప్రదర్శితం కానున్న 11 చిత్రాలు

Posted On: 18 NOV 2021 1:48PM by PIB Hyderabad

52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రకటించిన కెలెడియోస్కోప్ ఫెస్టివల్‌కి 11 చిత్రాలు ఎంపికయ్యాయి. వాటి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

1.      బ్యాడ్ లక్ బ్యాంకింగ్ లేదా లూనీ పోర్న్

దర్శకుడు; రాడు జేడ్/రొమేనియా, లక్జెంబర్గ్, క్రయోషియా, జెచ్, రిపబ్లిక్/ రొమేనియన్

సారాంశం; ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో ఒక వ్యక్తి ఓ మహిళ మాస్కులు ధరించి సెక్స్‌లో పాల్గొంటారు. అయితే అందులోని మహిళని ఎవరనేది అందరూ గుర్తించారు. ఆమె ఒక ఉపాధ్యాయురాలు. చెప్పాలంటే రోల్ మోడల్‌గా ఉండాల్సిన వ్యక్తి. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమాజంలో ఆమెకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. పరిశుభ్రంగా ఉన్న ప్రవర్తనలు, అబద్ధపు రాజకీయాలు, మతోన్మాదాలు, వింతైన కుట్రపూరిత సిద్ధాంతాలు.. అన్నింటి మధ్యా ఆమె సతమతమవుతుంది. ఈ చర్చ క్రమంగా త్రికోణంలోకి మారుతుంది. పోర్నోగ్రఫీ, ఏకాభిప్రాయంతో కూడిన సెక్స్ మరియు ఇంకా చాలా వాటి గురించి ఇందులో చర్చిస్తారు.

2.      బ్రైటన్ 4th

దర్శకుడు; లెవన్ కొగువష్విలి, జార్జియా, రష్యా, బల్గేరియా, మొనాకో, యూఎస్ఏ, జార్జియన్

సారాంశం; మాజీ రెజ్లర్ ఛాంపియన్ అయిన ఖాకీ కథ ఇది. కుటుంబం మీద ఉన్న ప్రేమతో బ్లిస్సీ నుంచి బ్రూక్లిన్‌లోని బ్రైటన్ బీచ్ వద్ద ఉన్న తన కొడుకుని చూడడం కోసం అతని ప్రయాణం ప్రారంభమవుతుంది. అయితే ఖాకీ నమ్ముతున్నట్లుగా అతను మెడిసిన్ చదవడు. స్థానికంగా ఉన్న ఒక మాస్ నాయకుడి వద్ద గ్యాంబ్లింగ్ ఆడిన అప్పు తీర్చడానికి ఓ సంస్థలో పని చేస్తుంటాడు. ఖాకీ తన కొడుక్కి సహాయం చేయాలని భావిస్తాడు..

3.      కంపార్ట్‌మెంట్ నెం.6

దర్శకుడు; జుహో కౌస్మెనన్, ఫిన్‌లాండ్, జర్మనీ, ఇస్టోనియా, రష్యా, ఫిన్నిష్, రష్యన్

సారాంశం; ఒక యువ ఫిన్నిష్ మహిళ మర్మాంక్ వద్ద ఉన్న విమానాశ్రయానికి వెళ్లడానికి మాస్కోలో ఒక ట్రైన్ ఎక్కుతుంది. అందులో ఒక నిగూఢమైన ప్రేమ వ్యవహారం నుంచి బయటపడుతుంది. ఒక రష్యన్ మైనర్‌తో చిన్న స్లీపింగ్ కార్‌ని పంచుకోవాల్సి వచ్చిన ఆమె తనతో కలిసి సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేయాల్సి వస్తుంది. ఊహించని ఒక ఘటన కారణంగా కంపార్ట్‌మెంట్ నెం.6లో ఉన్న వారు మానవ సంబంధాల కోసం వారి సొంత కోరికలు తీర్చుకోవాల్సి వస్తుంది.

4.      ఫెదర్స్

దర్శకుడు; ఒమర్ ఈఐ జొహైరీ, ఫ్రాన్స్, ఈజిప్ట్, ది నెదర్లాండ్స్, గ్రీస్, అరబిక్

సారాంశం; ఒక చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో ప్రదర్శించిన ఇంద్రజాల ట్రిక్ బెడిసి కొట్టడంతో ఆ కుటంబానికి సంబంధించిన తండ్రి కోడిగా మారిపోతాడు. ఈ క్రమంలో తన పూర్తి జీవితాన్ని భర్తని, పిల్లల్ని చూసుకోవడానికే అంకితం చేసిన ఓ తల్లి ఇప్పుడు తెర ముందుకు వచ్చి తన కుటుంబ బాధ్యతలను చూసుకోవాల్సి వస్తుంది. తన భర్తను తిరిగి మామూలుగా మార్చడానికి ఆ భూమిని, నేలని ఏకం చేసే విధంగా ప్రయత్నాలను సైతం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె కూడా పూర్తిగా పరివర్తన చెందుతుంది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న యాధృచ్ఛిక మరియు ఆకస్మిక పరిస్థితులను తెర మీదే చూడాలి.

5.      ఐ యామ్ యువర్ మ్యాన్

దర్శకుడు; మరియా శ్రేడర్, జర్మనీ, జర్మన్

సారాంశం; బెర్లిన్‌లో ఉన్న ప్రముఖ పెర్గమన్ మ్యూజియంలో శాస్త్రవేత్తగా పని చేస్తుంద అల్మా. ఆమె చదువుకు అవసరమైన నిధులు సమీకరించునేందుకు ఒక అద్భుతమైన ప్రయోగంలో పాల్గొనేందుకు అంగీకరిస్తుంది. ఈ క్రమంలో ఆమె మూడు వారాల పాటూ ఒక హ్యూమనాయిడ్ రోబోతో కలిసి నివసించాల్సి ఉంటుంది. కృత్రిమ మేథస్సు ద్వారా రూపొందించబడిన ఈ రోబోని ఆమె జీవిత భాగస్వామిగా భావించాలి. అలా తయారైన రోబో పేరే టామ్. మానవ రూపంలో ఉన్న ఈ యంత్రం ఆమెని సంతోషపెట్టడానికి ప్రేమ, వాంఛ మరియు మనుషులకు ఉండే స్వభావాలకు అనుగుణంగా మారే విధంగా ఉంటుంది. వీరిద్దరి విషాద గాథే ఈ చిత్రం.

6.      రెడ్ రాకెట్

దర్శకుడు; శాన్ బేకర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంగ్లిష్

సారాంశం; రచయిత – దర్శకుడు అయిన శాన్ బేకర్ (ది ఫ్లోరిడా ప్రాజెక్ట్, టాంజరీన్) నుంచి వచ్చిన సాహసోపేతమైన ఈ సినిమాలో సైమన్ రెక్స్ మాగ్నెటిక్ లైవ్ – వైర్‌గా పెర్ఫార్మ్ చేసిన ఈ చిత్రం ఒక చీకటి, మానవతా కోణంతో ముడిపడింది. ఇది ఓ ఊరు అతి కష్టం మీద భరిస్తున్న అమెరికన్ హస్లర్‌కి సంబంధించిన చిత్రం.

7.      సౌడ్

దర్శకుడు; అయైటెన్ ఆమిన్/ ఈజిప్ట్, ట్యునీషియా, జర్మనీ, అరబిక్

సారాంశం; సౌడ్ 19 ఏళ్ల ఒక ఈజిప్షియన్. ఆమె రోజువారీ జీవితంలో కొత్త స్వేచ్ఛలను అన్వేషించాలనే ఆమె కోరికకు సమాజంలో విభేదాలను ఎదుర్కుంటుంది. అలాగే తన స్మార్ట్‌ఫోన్‌లో ఒక రహస్య కాస్మోపాలిటన్ సృష్టించి అందులో రొమాంటిక్ బంధాలను ఆహ్వానిస్తుంది. మరోవైపు ఆమె ఒక చక్కని విద్యార్థిని. విధేయత గల కుమార్తె. ఒకరికి అక్క. కానీ సౌడ్‌కి ఉన్న ఈ కోరికల రెక్కలు ఆమె జీవితాన్ని ఆమే నాశనం చేసుకునేందుకు పురొకొల్పుతాయి. అయితే సౌడ్ భావనలు విచ్ఛిన్నమైనప్పుడు విరుద్ధమైన వాస్తవాల మధ్య ఆమె జీవితం బిజీగా మారతుంది. ఈ క్రమంలో సౌడ్‌తో సంబంధం తప్ప ఉమ్మడిగా ఏమీ లేని ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్‌కౌంటర్‌ని బహిర్గతం చేయడానికి మార్గం సుగుమం అవుతుంది. ఈ క్రమంలోనే సౌడ్ క్రమంగా మారుతుంది.

వాస్తవ పాత్రలకు దగ్గరగా ఉండే విధంగా అయైటెన్ ఆమిన్ చాలా చక్కగా సౌడ్ పాత్రను తీర్చిదిద్దారు. ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, వాటి ప్రభావాలు తెర మీద చాలా చక్కగా చూపించారు. ఇతరులకు దగ్గరయ్యే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమనించే విధానాలు.. అన్నీ చక్కగా ఆవిష్కరించారు.

8.      స్పెన్సర్

దర్శకుడు; పాబ్లో లారియన్/ జర్మనీ, యూకే, ఇంగ్లిష్

సారాంశం; ప్రిన్స్ చార్లెస్ మరియు ప్రిన్సెస్ డయానా వివాహం చాలా కాలం నుంచి నిరుత్సాహంగా మారింది. వీరికి సంబంధించిన వ్యవహారాలు, విడాకుల గురించి పుకార్లు పుష్కలంగా ఉన్నప్పటికీ క్వీన్స్ సాండ్రింగ్‌హమ్ ఎస్టేట్‌లో క్రిస్మస్ పండుగల కోసం శాంతిని నియమిస్తారు. అక్కడ తినడం, తాగడం, షూటింగ్ మరియు వేటాడడం వంటివి చేస్తారు. డయానాకు ఈ ఆట బాగా తెలుసు. అయితే ఈ సంవత్సరం మాత్రం విషయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

అదృష్టంతో కూడిన ఆ కొన్ని రోజుల్లో స్పెన్సర్‌లో ఏం జరిగిందా అనే ఊహాత్మక కథే ఇది.

9.      ద స్టోరీ ఆఫ్ మై వైఫ్

దర్శకుడు; ఇల్డికో ఎన్యేది/ హంగేరీ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లిష్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్

సారాంశం; ఒక చురుకైన గిజ్స్ నాబెర్ కెప్టెన్ జాకబ్ స్టార్‌. వారు కూర్చుని ఉన్న ఒక కేఫ్‌లో లోపలికి వచ్చే మొదటి మహిళను వివాహం చేసుకుంటానని తన సహచరుడితో పందెం వేస్తాడు. స్టార్ జీవితంతో ముడిపడిన ఈ పందెంలో భాగంగా లిజీ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇక తర్వాతే ఏమైందనేది తెర మీదే చూడాలి.

10.   ద వరెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్

దర్శకుడు; జవోచిమ్ ట్రైర్/ నార్వే, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, నార్వేజియన్

ప్రేమకు సంబంధించిన ఒక ఆధునిక అన్వేషణ మరియు ఓస్లోకి సంబంధించిన తత్సమ అర్థం ఈ చిత్రం. జులీ జీవితానికి సంబంధించిన నాలుగు సంవత్సరాలను ఈ చిత్రంలో చూపిస్తారు. ఆమె తన ప్రేమ జీవితాన్ని కష్టాలతో ఈదుతూ కెరీర్‌ని ఏర్పరుచుకోడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కుంటుంది. ఈ క్రమంలోనే ఆమె అంటే ఏంటో ఆమె తెలుసుకుంటుంది.

11.   టైటానె

దర్శకుడు; జులియా డ్యుకోర్నె/ ఫ్రాన్స్, బెల్జియం/ ఫ్రెంచ్

బాగా గాయాలు ఉన్న ముఖంతో ఓ యువకుడు విమానాశ్రయంలో గుర్తించబడతాడు. అతని పేరు ఆడ్రిన్ అని, 10 సంవత్సరాల క్రితం తానే అదృశ్యమయ్యానని అతను చెప్పుకొస్తాడు. అతను చివరికి తన తండ్రిని కలుసుకుంటాడు. కానీ ఈ క్రమంలో కొన్ని కిరాతకమైన హత్యలు జరుగుతాయి. ఈ కథేంటో తెలియాలంటే తెర మీదే చూడాలి.



(Release ID: 1773081) Visitor Counter : 209